హెల్త్‌హబ్‌గా తెలంగాణ : మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ :జూన్ 11
తెలంగాణ హెల్త్ హబ్‌గా అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదిగిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బంజారాహిల్స్‌లో ఆదివారం లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్ ఆసుపత్రిని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, అదే విధంగా ఆరోగ్యరంగంలో అభివృద్ధి చెందిందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారని, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు.
10వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లను గాంధీ, నిమ్స్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే నెలలో గాంధీలో ప్రారంభం అవుతుందని, కార్పొరేట్ ఆసుపత్రులతో తెలంగాణ ప్రభుత్వ దవాఖానాలు పోటీపడుతున్నాయన్నారు. 2014 లో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 30శాతం ఉంటే.. గత నెల 70శాతం చేరాయన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌గా ఉందన్నారు.
ఎనీమియా తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 14 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించబోతున్నామన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశంలో నెంబర్-1 అని, వందశాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్నాయన్నారు. అనవసర సీ సెక్షన్లు తగ్గించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు తోడ్పాటు అందించాలన్నారు. అనవసర సీ సెక్షన్లతో అనేక ఇబ్బందులుంటాయని, నాడు పేదలు రొట్టెలు తింటే, ధనికులు అన్నం తిన్నారని, నేడు అది రివర్స్ అయ్యిందన్నారు. ఆసుపత్రిలో ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యసేవలు అందించాలని మంత్రి హరీశ్‌రావు ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు...
Jun 11 2023, 20:34