తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు
తెలంగాణలో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ప్రతాపాన్ని చూపాయి. 47 మండలాల్లో వడగాలులతో జనం అల్లాడిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, మణుగూరు, ఖమ్మం జిల్లాలో సింగరేణి, వేంసూరు మండలాల్లో వడగాలులకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6.5 డిగ్రీలపైన నమోదయ్యాయి.
ఇక శనివారం తెలంగాణ వ్యాప్తంగా పది మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45-46.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలు, ఖమ్మంలో 7, హనుమకొండ 4, మహబూబాబాద్ 4, సూర్యాపేట 4, జనగామ 3, కుమురం భీం ఆసిఫాబాద్ 3, పెద్దపల్లి 3, సిద్దిపేట 3, వరంగల్ 3, ఆదిలాబాద్ 2, నల్గొండ 2, కరీంనగర్ జిల్లాలో 2 మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా నమోదైంది.
శని, ఆదివారాల్లోనూ తెలంగాణలో వేడిగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై కొనసాగుతుండగా, తెలుగు రాష్ట్రాలను తాకడానికి మరో 5 రోజులు పట్టనున్నాయని అధికారులు తెలిపారు.........
Jun 10 2023, 14:13