నవ సమాజ నిర్మాత మహాత్మ జ్యోతిరావు పూలే! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆర్.టీ.ఐ పి.సి జాతీయ అధ్యక్షులు
నవ సమాజ నిర్మాత మహాత్మ జ్యోతిరావు పూలే!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ఆర్.టీ.ఐ పి.సి జాతీయ అధ్యక్షులు
తేది: 11-04-2023 మంగళవారం
చిన్నకోడూర్ న్యూస్
మహాత్మ జ్యోతిరావు పూలే అంటరానితనం కులవ్యవస్థ నిర్ములనతో పాటుగా మహిళోద్దరణకు ఎనలేని పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి పూలే అని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ నవసమాజ నిర్మాత మహాత్మ జ్యోతిరావు పూలే అని పెతందారి వ్యవస్థలో బానిస సంఖ్యలను తెంపుతు అంటరానితనాన్ని కులవ్యవస్థ నిర్ములన కోసం పోరాటం చేస్తూ మరోపక్క పేదల కోసం స్కూళ్లు స్థాపించి విద్య నేర్పిన మహోన్నతుడు పూలే అని అన్నారు.
అదే విదంగా మహిళల కోసం తన సహా ధర్మాచరిని సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి ఆమె ద్వార మహిళలకు విద్యను అందించిన మహాను బావుండు పూలే అని అన్నారు.
బడుగు బలహీన వర్గాలుబుఅయన అడుగు జాడలో నడిచి ముందు తరాలకు మార్గదర్శులు కావాలని జంగిటి అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షుడు సుంచు రమేష్, ఆర్.టీ.ఐ పి.సి రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రం, ఎస్.సి సెల్ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి కనకరాజు, లడ్డు శ్రీను, గుడుమల్ల చిన్న మల్లేశం, కస్తూరిపల్లి మహేందర్, కడారి శ్రీనివాస్, ఇస్తారి, మహేష్, సురేష్ తదితరులు ఉన్నారు.
Jun 02 2023, 13:11