/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz నేడు ఏపీ భవన్ ఆస్తులపై ఢిల్లీలో కీలక సమావేశం.. Andrapradesh
నేడు ఏపీ భవన్ ఆస్తులపై ఢిల్లీలో కీలక సమావేశం..

న్యూఢిల్లీ

ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ఆస్తుల పంపకాలపై బుధవారం కీలక సమావేశం జరగనుంది. సమైక్య రాష్ట్రం విడిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆస్తుల విభజన జరగలేదు..

దీనిపై పలు దఫాలుగా చర్చలు జరిగినా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. 

ఈ తరుణంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో సమావేశం జరగనుంది. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొననున్నారు..

ఈ నెల 29నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

 రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 29వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది..

 అయితే చివరి రోజున విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల రిపోర్ట్ కార్డును అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..

 తిరిగి జూన్ 12వ తేదీన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం..

తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై... సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన సునీత...

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో... తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై... సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన సునీత...

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 25వరకు అరెస్ట్ చేయవద్దు అంటూ... తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ వివేకా కుమార్తె సునీత...

AP, Srikakulam: షోరూంలో ఎగసిపడ్డ మంటలు.. 90 బైక్‌లు దగ్ధం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది..

షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌లకు చార్జింగ్‌ పెట్టారని, అయితే ఓ బైక్‌ బ్యాటరీ పేలిపోవడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని సమాచారం. అయితే అగ్ని ప్రమాదం జరగడానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ నగరంలోని నాచారం పీఎస్‌ పరిధిలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. మల్లాపూర్‌ పారిశ్రామిక వాడలోని ఏకశిలా కెమికల్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా వైసీపీ శాంతియుత ర్యాలీలు

: ఇంత జరుగుతున్నా అవినాష్ ఎక్కడ..!?

ఇవాళ తెల్లవారుజాము నుంచి పులివెందులలో హైటెన్షన్

ఓ వైపు వైసీపీ కార్యకర్తలు ఆందోళన.. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సోదాలు

ఆఖరికి అరెస్ట్ చేసినా ఇంతవరకూ స్పందించని ఎంపీ అవినాష్

హైదరాబాద్‌లో అవినాష్ ఉన్నట్లుగా వార్తలు

ఇప్పటికే హైదరాబాద్‌లోని అవినాష్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినట్లు సమాచారం

నెక్స్ట్ అవినాష్‌నే సీబీఐ అరెస్ట్ చేస్తుందని గుప్పుమంటున్న వార్తలు

ఈ వార్తలపై ఇంతవరకూ అటు సీబీఐ కానీ.. ఇటు వైసీపీ కానీ స్పందించని పరిస్థితి

ఏం జరుగుతుందో ఏమో అని వైసీపీలో టెన్షన్.. టెన్షన్

భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై కనీసం ఇప్పటి వరకూ ఒక్క ఎమ్మెల్యే కానీ.. మంత్రి కానీ స్పందించని పరిస్థితి.

సీబీఐ అదుపులో ఎంపీ అవినాష్‌ ప్రధాన అనుచరుడు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. 

ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డి, అతడి తండ్రి జయప్రకాశ్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది..

గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా ఎంపీ తండ్రి భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉదయ్‌ ఉన్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. 

పులివెందుల నుంచి కడప కారాగారం అతిథిగృహానికి ఉదయ్‌ను తీసుకెళ్లి విచారణ జరుపుతోంది..

వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్‌, శివశంకర్‌ రెడ్డితో పాటు ఘటనాస్థలికి ఉదయ్‌ వెళ్లినట్లు.. ఆ రోజు అంబులెన్స్‌, ఫ్రీజర్‌, వైద్యులను రప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ భావిస్తోంది. 

వివేకా మృతదేహానికి ఉదయ్‌ తండ్రి జయప్రకాశ్‌ రెడ్డి బ్యాండేజ్‌ కట్లు కట్టినట్లు ఆరోపణలున్నాయి. 

ఉదయ్‌ను గతంలో పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు.

ఆరుగురిని చంపారు.. అయినా ఒక్క ఫిర్యాదు లేదు..


పగలు రెక్కీ.. రాత్రిమర్డర్.. కత్తిపోటు పడదు.. నెత్తురు చుక్క కానరాదు.. గాయాలుండవు.. మర్డర్ అనే అనుమానం అసలే రాదు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు హత్యలు, 20 కి పైగా నేరాలు.. ఐదుగురు ఐదుగురు సభ్యులు.. మొత్తం 22 ఏళ్ళ లోపు వారే.. బంగారం, డబ్బు కోసం జరిగిన ఈ కిరాతక హత్యల్లో ఎట్టకేలకు నిందితులకు జీవిత ఖైదు పడింది.

చెడు వ్యసనాలకు బానిసై బంగారం, డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో వీరు చేసిన దారుణాలు ఏడాది క్రితం బెజవాడని ఉలిక్కి పడేలా చేసాయి. పోరంకి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ళ సుంకర గోపిరాజు, ప్రభుకుమార్‌లు స్నేహితులు ఆటో నడుపుతుంటారు. చెడు వ్యసనాలకు బానిసై కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించుకోవాలనుకున్న వీరు నేరాలు, హత్యలు, దోపిడిలు చెయ్యటం ప్రారంబించారు. ఎక్కడా ఆధారాలు దొరకకుండా ఎలాంటి అనుమానాలు రాకుండా ఏడాది క్రితం ఒంటరి వృద్ధ మహిళలను అతి కిరాతకంగా హత్య చేసారు. వీరి యాక్షన్ టీమ్‌లో చక్రి, దుర్గారావు, ఫణింద్ర అనే మరో ముగ్గురు కూడా ఉన్నారు. ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలే వీరి టార్గెట్. గోపి ఆటోలో కూరగాయలు అమ్ముతూ పగలు రెక్కీ నిర్వహించేవాడు. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను గుర్తించి రాత్రికి స్పాట్ పెట్టేవారు. ఈ ఐదుగురు కలిసి రాత్రికి ఫినిష్ చెసేశారు. దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో ఏర్పడ్డ ఈ ముఠా తొలినేరం పెనమలూరు లో చేసారు. అప్పటికే ఐదు నేరాలు చేసి, ఆరుగురిని హతమార్చారు. అయినా ఒక్క కేసు బయటకు రాలేదు. అది హత్య అని కూడా ఎవ్వరికీ తెలియలేదు. అదే వీరి స్పెషలిటీ.

వంద గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానాకే నేలకూలిందన్నట్లుగా.. ఓ చోరీలో వీరంతా అడ్డంగా దొరికిపోయారు. దాంతో వీరి వ్యవహారం మొత్తం బయటపడింది. గతేడాది పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంలో దొంగతనం చేసేందుకు యత్నించిన కేసులో సీసీ పుటేజి ద్వారా దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ నేరాలు, హత్యలు వెలుగులోకి వచ్చాయి. వీరి వ్యూహాలు, ప్లాన్ల ను తెలుసుకున్న పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. కరోనా సమయం కావటంతో వృద్ధ మహిళలు చనిపోతే అనుమానం రాదని సాధారణ మరణంగా భావిస్తారని పక్కా ప్లాన్‌తో రెక్కీ నిర్వహించి ఇళ్లకు వెళ్లడం, ముందుగా ఆ ఇంట్లో ఉన్న వారిని దుప్పటితోనో లేక దిండుతోనో అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చంపి వారి శరీరంపై ఉన్న బంగారం, ఇంట్లో దొరికిన నగదుతో భాధిత కుటుంబాలకు ఎలాంటి డౌట్ రాకుండా తప్పించుకునే వారు. ఇక చనిపోయిన వారు వయస్సులో పెద్ద వారు కావటంతో బంధువులు సైతం సహాజ మరణంగా బావించి అంత్యక్రియలు చేయడంతో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. కానీ ఒక్క చోరీ కేసులో దొరికిపోయి ఆఖరికి కటకటాల పాలయ్యారు. దాంతో అప్పటికే విరు రెక్కీ నిర్వహించి స్కెచ్‌కు సిద్ధంగా ఉన్న కంకిపాడు, ఉయ్యురు, పెనమలూరు, తెనాలి, మంగళగిరిలో ప్లాన్ ఫెయిల్ అయ్యి, మరిన్ని హత్యలకు బ్రేక్ పడింది.

ఈ కేసులన్నింటిలో నిందితుల నేరం రుజువవ్వటంతో ఎట్టకేలకు బెడజవాడ కోర్టు ఈ ఐదుగురికి జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించింది.

AP : ఈ రోజు EBC నేస్తం పథకం ద్వారా పేద మహిళల అకౌంట్లలోకి రూ.15 వేలు

 ఈ రోజు వైయస్సార్ ఈబీసీ నేస్తం పథకం రెండో విడతలో భాగంగా బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య రెడ్డి, కమ్మ, కులాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేద మహిళల ఖాతాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి 15 వేల చొప్పున సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఈ కార్యక్రమం జరగనుంది.

TTD : శ్రీవారి కి భారీ భూవిరాళం ఇచ్చిన భక్తుడు...

 ఏడుకొండల శ్రీవారికి  చెందిన భక్తుడు భారీ భూవిరాళం ఇచ్చాడు బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ అనే భక్తుడు.

 బెంగళూరు వాసి మురళీకృష్ణకు తిరుపతి జిల్లా డక్కిలి మండలం పోతేగుంటలో 90 ఎకరాలు, దగ్గవోలులో 160 ఎకరాలు, మొత్తం 250 ఎకరాల పోడు భూమిని టీటీడీకి అవసరమైన ఆహారోత్పత్తులు, పూలను సాగు చేసి తానే స్వయంగా అందజేసేందుకు ముందుకు వచ్చాడు. 

దీంతో అధికారుల బృందం నీటి సరఫరా, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.

జనసేనా పార్టీ ఎందుకు పెట్టారో పవన్ కే క్లారిటీ లేదని ఎద్దేవా చేసిన మంత్రి రోజా...

నగరి నియోజకవర్గంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి 

 రోజా జగన్ పాలనపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ప్రతిస్పందన తెలుసుకున్నారు.

ఈ సందర్భంలో జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ...

 

పవన్ పార్టీ పెట్టి 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయన ఆ పార్టీ ఎందుకు పెట్టారో... ఎవరి కోసం పార్టీ పెట్టారో..., ఏం చేయడానికి పార్టీ పెట్టారో... ఆయనకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేసారు మంత్రి రోజా...

ఆయన పార్టీపైన ప్రజలకు అస్సలు నమ్మకమేలేదని, ఎప్పుడు ఎవరి జెండా మోయాలో.. ఎవరిని తిట్టాలో తెలియక జనసేన కార్యకర్తల్లో గందరగోళం నెలకొందని అన్నారు.

 ఇలాంటి వాళ్ళు వైసీపీ పార్టీని ఏమీ చేయలేరని, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 స్థానాలు గెలుచుకుంటుందని అన్నారు మంత్రి రోజా.