/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz AP : ఈ రోజు EBC నేస్తం పథకం ద్వారా పేద మహిళల అకౌంట్లలోకి రూ.15 వేలు Andrapradesh
AP : ఈ రోజు EBC నేస్తం పథకం ద్వారా పేద మహిళల అకౌంట్లలోకి రూ.15 వేలు

 ఈ రోజు వైయస్సార్ ఈబీసీ నేస్తం పథకం రెండో విడతలో భాగంగా బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య రెడ్డి, కమ్మ, కులాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేద మహిళల ఖాతాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి 15 వేల చొప్పున సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఈ కార్యక్రమం జరగనుంది.

TTD : శ్రీవారి కి భారీ భూవిరాళం ఇచ్చిన భక్తుడు...

 ఏడుకొండల శ్రీవారికి  చెందిన భక్తుడు భారీ భూవిరాళం ఇచ్చాడు బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ అనే భక్తుడు.

 బెంగళూరు వాసి మురళీకృష్ణకు తిరుపతి జిల్లా డక్కిలి మండలం పోతేగుంటలో 90 ఎకరాలు, దగ్గవోలులో 160 ఎకరాలు, మొత్తం 250 ఎకరాల పోడు భూమిని టీటీడీకి అవసరమైన ఆహారోత్పత్తులు, పూలను సాగు చేసి తానే స్వయంగా అందజేసేందుకు ముందుకు వచ్చాడు. 

దీంతో అధికారుల బృందం నీటి సరఫరా, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.

జనసేనా పార్టీ ఎందుకు పెట్టారో పవన్ కే క్లారిటీ లేదని ఎద్దేవా చేసిన మంత్రి రోజా...

నగరి నియోజకవర్గంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి 

 రోజా జగన్ పాలనపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ప్రతిస్పందన తెలుసుకున్నారు.

ఈ సందర్భంలో జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ...

 

పవన్ పార్టీ పెట్టి 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయన ఆ పార్టీ ఎందుకు పెట్టారో... ఎవరి కోసం పార్టీ పెట్టారో..., ఏం చేయడానికి పార్టీ పెట్టారో... ఆయనకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేసారు మంత్రి రోజా...

ఆయన పార్టీపైన ప్రజలకు అస్సలు నమ్మకమేలేదని, ఎప్పుడు ఎవరి జెండా మోయాలో.. ఎవరిని తిట్టాలో తెలియక జనసేన కార్యకర్తల్లో గందరగోళం నెలకొందని అన్నారు.

 ఇలాంటి వాళ్ళు వైసీపీ పార్టీని ఏమీ చేయలేరని, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 స్థానాలు గెలుచుకుంటుందని అన్నారు మంత్రి రోజా.

అన్నదాతల అలుపెరగని పోరు.. అమరావతి రైతుల ఉద్యమం @1200

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. రాజధాని రైతులు పోరాట బావుటా ఎగరవేసి నేటికి 1200 రోజులు. ప్రభుత్వ దాష్టీకం, పోలీసుల దాడులు, నిర్బంధాలు, అక్రమ కేసులను తట్టుకుని రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.

అమరావతే రాజధానిగా కొనసాగుతుందని 2019 ఎన్నికల సమయంలో చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్​ రెడ్డి మాట తప్పారు. జగన్ నిర్ణయంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వం తమకు చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించారు. 2019 డిసెంబర్ 17న ప్రారంభమైన నిరసనలు వివిధ రూపాల్లో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులకు మద్దతుగా ఉద్యమాలు నిర్వహించారు.

100వ రోజు నిరసనలు, 200వ రోజు అమరావతి అమరవీరులకు ప్రత్యేక శ్రద్ధాంజలి, 300వ రోజు అమరవీరుల ఫ్లెక్సీలతో శవయాత్ర, 400వ రోజు జన భేరి, 500వ రోజు రాష్ట్ర, జాతీయ నాయకులతో జూమ్ సదస్సు, 600వ రోజు మానవహారాలు, 700 రోజులకు తిరుమలకు పాదయాత్ర, 800వ రోజు సందర్భంగా రాజధాని రైతులు 24 గంటల నిరాహారదీక్ష చేపట్టారు.

ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి చేసిన సందర్భంగా రైతులు రెండో విడత పాదయాత్ర చేపట్టారు. అరసవెల్లి వరకూ చేపట్టిన మహా పాదయాత్రను ప్రభుత్వం నిబంధనల పేరుతో అడుగడుగునా.. అడ్డుతగిలినా ముందుకు సాగారు. ఉద్యమం ప్రారంభించిన నేటికి 12వందల రోజులు అవుతున్న సందర్భంగా రైతులు అన్ని పార్టీల నేతలతో కలిసి ప్రత్యేక నిరసన తెలుపనున్నారు.

AP Inter Evaluation: రేపట్నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం.. జూనియర్ కాలేజీలకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మాచవరంలోని ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో జరగనున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా ఆర్‌ఐవో పి రవికుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, గణితం, సివిక్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం రేపట్నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్‌ విద్యా మండలి నుంచి ఉత్తర్వులు అందుకున్న ఆయా అధ్యాపకులు మూల్యాంకనానికి విధిగా హాజరవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్‌లు, ప్రైవేటు యాజమాన్యాలు తమ అధ్యాపకులు విధులకు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అధ్యాపకులను పంపని కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా ఏపీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీతో ముగియనున్నాయి. ద్వితియ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 4తో ముగియనున్న సంగతి తెలిసిందే.

శ్రీరామనవమిలో అపశ్రుతి ! తృటిలో తప్పిన పెనుప్రమాదం…

ఈ రోజున దేశవ్యాప్తంగా రాములవారు ప్రసిద్ధి చెందిన అన్ని చోట్ల శ్రీరామనవమిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా రాముని వేడుకలు జరుగుతున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామం లో అనుకోకుండా ఒక అపశృతి జరిగింది. దువ్వ లోని వేణుగోపాలస్వామి ఆలయం ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీరామనవమి వేడుకలలో భాగంగా ఆలయం బయట చలువ పందిళ్లను వేసి చక్కగా అలంకరించారు.

భక్తులు అందరూ చలువ పందిళ్ళ కిందనే ఉండగా ఈ ప్రమాదం జరిగింధి. ఒక్కసారిగా మంటలు వ్యాపించగా భక్తులు ఆందోళనకు గురై వెంటనే బయటకు వచ్చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణం గానే ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు గుర్తించారు. ఆ శ్రీరాముని దయ వలన ఇంత ప్రమాదం జరిగినా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేడనై భక్తులు శ్రీరామనామ జపం చేస్తున్నారు.

సీఎం జగన్‌ పై అసభ్యకర పోస్టులు..NRI అరెస్ట్‌

సోషల్ మీడియాల్లో సిఎం జగన్ పై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడని ఎన్ఆర్ఐ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యూఎస్ లో 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి తన సొంత గ్రామం గన్నవరం లో తల్లి దండ్రులు ఇంటికి వచ్చాడు కోటిరత్నం అంజన్. ట్విట్టర్ లో సీఎం జగన్‌ పై అసభ్యంగా పోస్ట్ పెట్టడంతో నిన్న సాయంత్రం అంజన్ అరెస్ట్ చేశారు గన్నవరం పోలీసులు.

అంజన్ ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు..అంజన్ ఫోన్, ల్యాప్ ట్యాప్,బ్యాంక్ లావాదేవీలు అడిగి తెలుసుకున్నారు. అంజన్ కి ట్విట్టర్ , సోషలో మీడియాలో పై ఆసక్తి ఎక్కువ అని తెలిపారు తల్లి రత్నకుమారి. నిన్న సాయంత్రం అంజన్ నీ అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు..ఇప్పటి వరకు అంజన్ ఎక్కడ ఉన్నాడో తల్లి దండ్రులకు తెలుపలేదు. దీంతో పోలీసులు తీరు పై మండి పడుతున్నారు అంజన్ తల్లి దండ్రులు.

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. రూ. 1441 కోట్లతో భారీ ప్రాజెక్ట్‌.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం వరాలజల్లు కురిపించింది. దేశంలోని మూడు బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకదానిని ఆంధ్ర ప్రదేశ్‌కు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పాటు ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మూడు బల్క్ డ్రగ్ పార్కులను మంజూరు చేసిందని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తొండంగి మండలంలో 2000.46 ఎకరాల విస్తీర్ణంలో బల్క్ డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, పార్క్ అభివృద్ధికి అవసరమైన భూమిని ఇప్పటికే సేకరించామని కేంద్ర మంత్రి తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్‌లో కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ (CIF) అభివృద్ధి అంచనా వ్యయం రూ.1441 కోట్లు అని, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు గ్రాంట్‌గా ఇస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

బల్క్ డ్రగ్ పార్క్‌లోని తయారీ యూనిట్లకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి అడిగినప్పుడు ఇతర ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్థిర మూలధన పెట్టుబడి కోసం తీసుకున్న టర్మ్ లోన్‌పై కేంద్రం 3% వడ్డీ రాయితీని ఇస్తోందని, 10 సంవత్సరాల కాలానికి రాష్ట్రానికి చేరిన నికర SGSTలో 100% తిరిగి కేంద్రం చెల్లించనుందనీ కేంద్రమంత్రి తెలిపారు. కాకినాడ ప్రాంతంలో ఫార్మాస్యూటికల్ రంగానికి ఆర్థిక కార్యకలాపాలను రూపొందించడానికి ఈ పార్క్ ఉపయోగపడనుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. 

కేంద్ర సహాయంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధి చేయడం వల్ల కాకినాడ ప్రాంతం దేశంలోనే ఫార్మాస్యూటికల్ హబ్‌గా ఎదగడానికి దోహదపడుతుందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి జీవీఎల్ కృతజ్ఞతలు తెలిపారు.

గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో..

గుంటూరులో గ్రానైట్ తవ్వకాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.. గ్రానైట్‌ తవ్వకాలు నిలిపివేయాలంటూ గుంటూరు జిల్లా చిలకలూరపేటలో మురికిపుడి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.. దీనిపై గతంలో విచారణ జరిపి మంత్రి విడదల రజనీ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. ఇక, ఈ రోజు మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఈ కేసులో మంత్రి విడదల రజనీ, ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు స్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. అయితే, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దుచేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ ఇవ్వడంపై హైకోర్టులో రైతులు పిటిషన్‌ వేశారు.. ఈ పిటిషన్ తరపున వాదనలు వినిపించారు న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ.. మొత్తం 21 ఎకరాల 50 సెంట్లు భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ ఇచ్చిన ఎమ్మార్వోకు, రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్సైకి కూడా నోటీసులు ఇచ్చింది.

ఒక్కో ఎకరాలో 200 కోట్లు విలువ చేసే గ్రానైట్ నిల్వలు ఉన్నాయని అంచనా ఉండగా.. రైతులకు తెలియకుండానే ఎన్‌వోసీ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.. ఇక, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వచ్చేనెల 10 వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది.. అప్పటి వరకు స్టేటస్ కో ఉత్తర్వులు. కౌంటర్ లు దాఖలు చేయాలని మంత్రి, ఇతరులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం.. ప్రధాని, సీఎంకు ఆహ్వానాలు..!

ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. శ్రీశైలంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది.. ఇప్పటికే సీఎం జగన్‌కు ఆహ్వానం అందగా.. ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇక, మహా కుంభాభిషేకంలో భాగంగా శివాజీ గోపురం కలిశా ప్రతిష్టాపన చేయనుంది దేవస్థానం.. మహా కుంభాభిషేక సమయంలోనే పంచమఠ లింగాల ప్రతిష్టాపన చేయనున్నట్టు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య స్వామీజీ వెల్లడించారు. వీర శైవ ఆగమ శాస్త్రం, బ్రాహ్మణ ఆగమ శాస్త్రం ప్రకారం కలశ ప్రతిష్ట పనులు నిర్వహించాలన్నారు.. బ్రాహ్మణ, వీరశైవులకు సమాన అవకాశం ఇవ్వాలని ఈవోని కోరుతున్నాం అన్నా జగద్గురు పీఠాధిపతి.

ఇక, మహా కుంభాభిషేకానికి సీఎం జగన్ ను ఆహ్వానించాం.. ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి. కాగా, దేశంలోనే ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో శ్రీశైలంలో ఒకటి.. నల్లమల ఫారెస్ట్‌లో కృష్ణానది ఒడ్డున.. శ్రీశైలం డ్యామ్‌ పరిసరాల్లో ఈ ఆలయం ఉంది.. శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రంగా గుర్తింపు పొందింది. అంతేకాదు.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రెండవది కావడం విశేషం.. అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఆరోది కూడా శ్రీశైలమే… దీంతోపాటు దశ భాస్కర క్షేత్రాల్లో ఆరోది. అందుకే శ్రీశైలాన్ని శ్రీగిరి, సిరిగిరి అని భక్తులు పిలుస్తుంటారు. శ్రీశైలం అంటే సంపద్వంతమైన పర్వతమని పండితులు పేర్కొన్నారు.. ఇక, ఈ క్షేత్రంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.