బ్రౌన్ షుగర్‌ను చర్మానికి ఇలా వాడితే ముడతలే రావట..!
బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు.. అలాగే బ్రౌన్ బ్రెడ్ కూడా.. వైట్ బ్రెడ్‌తో పోలిస్తే.. బ్రౌన్ బ్రెడ్ తినడమే ఆరోగ్యానికి మంచిది.. వైట్ షుగర్ కంటే..బ్రౌన్ షుగర్ వాడటం వల్ల ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చు.. అయితే బ్రౌన్ షుగర్ ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా కాపాడుతుంది. బ్రౌన్ షుగర్‌ను 2 రోజులకు ఒకసారి మీ చర్మానికి అప్లై చేయడం వల్ల మీ చర్మ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. బ్రౌన్ షుగర్‌ను ముఖం, మెడకే కాకుండా మోచేతులు, మోకాళ్లు, చేతులు, కాళ్లకు కూడా ఉపయోగించవచ్చు.
బ్రౌన్ షుగర్ డెడ్ స్కిన్ సెల్స్ ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి ప్రకాశవంతమైన మెరుపును అందిస్తుంది. చర్మంపై ఉన్న ట్యాన్‌ని తొలగించి, మెరిసేలా చేస్తుంది. టొమాటో స్లైస్‌లో బ్రౌన్ షుగర్ వేసి, యాంటీ క్లాక్ వైజ్‌లో ముఖం, మెడపై నెమ్మదిగా మసాజ్ చేయండి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసి కాసేపు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మళ్లీ రెండు నిమిషాలు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.
బ్రౌన్ షుగర్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. గ్లైకోలిక్ యాసిడ్, ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్, చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి మృతకణాలను తొలగిస్తుంది. కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. బ్రౌన్ షుగర్ చనిపోయిన కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. తేనె, బ్రౌన్ షుగర్‌ను సమాన పరిమాణంలో తీసుకుని దానికి లావెండర్ ఆయిల్ జోడించండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించండి…10-15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.
బ్రౌన్ షుగర్ సహజ హ్యూమెక్టెంట్. ఇది సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాన్ని మృదువుగా, తేమగా చేస్తుంది… సాధారణ చక్కెర కంటే బ్రౌన్ షుగర్ మెత్తగా ఉంటుంది. కొబ్బరి నూనెతో కొద్దిగా బ్రౌన్ షుగర్ కలపండి. లావెండర్ నూనె జోడించండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం సాఫ్ట్‌గా అవుతుంది.
బ్రౌన్ షుగర్‌ను చర్మానికి అప్లై చేయడం వల్ల మచ్చలు తగ్గుతాయి. బ్రౌన్ షుగర్‌లో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. ఇది మెలనిన్ ఏర్పడటాన్ని కూడా నియంత్రిస్తుంది. నువ్వుల నూనెలో ఒక చెంచా బ్రౌన్ షుగర్ వేసి ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా 15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బ్రౌన్ షుగర్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల మొటిమలు రాకుండా చేస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే సరిపోతుంది.
అలాగే, చర్మంపై బ్రౌన్ షుగర్ ఉపయోగించేటప్పుడు సున్నితంగా మసాజ్ చేయండి. లేకపోతే దద్దుర్లు రావచ్చు. పురుషులు కూడా బ్రౌన్ షుగర్‌ను వాడొచ్చు.. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ట్రై చేసి చర్మాన్ని మరింత కాంతివంతంగా చేసుకోండి.!
Mar 28 2023, 13:32