ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..కరెంట్ ఛార్జీలపై కీలక నిర్ణయం
2023-24కి సంబంధించిన విద్యుత్ టారిఫ్‌ను రిలీజ్ చేశారు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ , రిటైర్డ్ జస్టిస్ సీవి. నాగార్జునరెడ్డి. ఆర్థిక అవసరాలపై డిస్కంలు ఇచ్చిన టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి టారిఫ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 3 డిస్కంలకు(రైతులకు ఫ్రీ కరెంట్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు వరకు ఇస్తున్న సబ్సిడీ.. ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు) కలిపి ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చే విద్యుత్ వల్ల 10,135 కోట్ల ఆదాయ లోటు వచ్చిందన్నారు.
సాధారణ, పారిశ్రామిక వినియోగదారుల కేటగిరిలో ఎవరిపై అదనపు ఛార్జ్‌లు ఉండబోవన్నారు రిటైర్డ్ జస్టిస్ నాగార్జునరెడ్డి. ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులు ఎటువంటి భారం మోపడంలేదన్నారు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కంపెనీలకు ఇచ్చే హెచ్‌టీ వినియోగదారులకు మాత్రం కిలోవాట్‌కు 475 రూపాయల అదనపు డిమాండ్ ఛార్జ్‌ల ప్రతిపాదనను అంగీకరించామన్నారు. వీటి టారిఫ్ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువేనన్నారు. మిగతా పెంపు ప్రతిపాదనలు తిరస్కరించామన్నారు.
Mar 25 2023, 16:32