మహిళలపై వేధింపుల్లో తెలంగాణ స్థానమెంత?
దేశంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళలపై వేధింపులు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. “విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022” పేరుతో ఒక సర్వేను నిర్వహించింది. ఈ నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న 75 శాతం గృహ హింస కేసుల్లో ఒక్క అస్సాంలోనే నమోదవుతున్నట్టు ఆ నివేదిక బట్టబయలు చేసింది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో 50.4 శాతం గృహ హింస కేసులు నమోదవుతున్నాయి. 48.9 శాతం కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది.
మహిళలపై మూడో వంతు దాడులు వారి భర్తలు, అత్తింటివారు, వారి బంధువులే చేస్తున్నవే కావడం గమనార్హం. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వాటిలో ఉద్దేశపూర్వకదాడులు, కిడ్నాప్, అత్యాచార యత్నాలు వంటివి ఉన్నాయి. 2015-16లో ఇవి 33.3 శాతంగా ఉండగా, 2019-21 నాటికి ఇవి స్వల్ప తగ్గుముఖం పట్టి 31.9 శాతానికి దిగివచ్చాయి. ఇపుడు మళ్లీ ఈ కేసులు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి.
మరోవైపు మహిళపై జరుగుతున్న దాడుల కేసుల్లో అనేకం వెలుగులోకి రావడం లేదు. అలా వచ్చిన కేసుల్లో కోర్టుల్లో పెండింగ్‌లో 21.22 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి. వీటిలో 83,536 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. అదేవిధంగా గత 2005లో 40,998 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా, 2011 నాటికి ఈ సంఖ్య 47,746కు చేరింది. 2021 నాటికి ఈ సంఖ్య 45,026కు తగ్గింది.
Mar 23 2023, 18:20