/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు.. 2024 ఎన్నికలే టీడీపీకి చివరివి..! - మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. Andrapradesh
ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు.. 2024 ఎన్నికలే టీడీపీకి చివరివి..! - మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్‌ వచ్చింది.. ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.. ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇక 2024 ఎన్నికల్లోనూ ఈ ఫలితాలు రిపీట్‌ అవుతాయని చెబుతున్నారు.. అయితే, ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు అంటూ హాట్‌ కామెంట్లు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే పార్టీ గెలిచినట్లు చంద్రబాబు ఫీలవుతున్నారన్న ఆయన.. తనకు తానే తిరుగులేదని చెప్పుకోవటం హాస్యాస్పదమని సెటైర్లు చేశారు.. ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు.. 2024 సాధారణ ఎన్నికలు టీడీపీకి చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు.

ఇక, కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు ఉంది సభలో టీడీపీ సభ్యుల తీరు అని ఫైర్‌ అయ్యారు మంత్రి కాకాణి.. చంద్రబాబు పగటి కలలు కంటున్నాడు.. మోసాలు చేయటంలో‌ చంద్రబాబుకు గజకర్ణ, గోకర్ణ విద్యలు తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. వర్షాలు ఆగిన వెంటనే పంట నష్టం అంచనా వేస్తామని ప్రకటించారు. దిగుబడి ఆధారిత, పంట నష్టం ఆధారంగా వేసే పంటలకు అంచనా వేస్తున్నాం.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం అని ఇప్పటికే నిరూపించాం అన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన వాటిని జగన్ ప్రభుత్వమే చెల్లించిందని.. దీంతో.. చంద్రబాబు, టీడీపీ నేతలు ఫ్రస్టేషన్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

మరోవైపు.. ప్రజల ప్రాణాలు కాపాడటానికే జీవో నంబర్‌ వన్‌ తీసుకొచ్చామని తెలిపారు కాకాణి.. చంద్రబాబు గొంతు పెద్దది చేసుకుని అరుస్తూనే ఉన్నాడుగా.. గొంతు నొక్కితే అలా మాట్లాడలేడుగా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు అంటే లెక్క ఉండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వామపక్షాలవి అస్థిత్వం కోసం ఆందోళన, చంద్రబాబుది ఓటమి ఆవేదన అని సెటైర్లు వేశారు. ఇక, అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని.. అంగన్వాడీల సమస్యల పై ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానం ఇదేనా?

వచ్చే యేడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతుంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల నుంచి బరిలోకి దిగనున్నారు. ముఖ్యంగా, ఆయన కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇక్కడ నుంచి రెండోసారి పోటీ చేసిన ఏ ఒక్క నాయకుడు మళ్లీ గెలిచిన దాఖలాలు లేవు. అంటే తమకు అవసరమైన నేతలను ఎన్నుకోవడంలో పిఠాపురం ఓటర్లు ఎంతో చైతన్యవంతులనే నమ్మకం ఉంది. అందుకే ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ స్థానం ఓటర్లు రాజకీయ వైవిధ్యం చూపుతారని చెబుతుంటారు. 

ఈ నియోజకవర్గంలో మొత్తం మూడు మండలాలు ఉండగా, 2.36 లక్షల వరకు ఓట్లు ఉన్నాయి. వీరిలో కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లే కీలకం. ఇవి 80 వేల వరకు ఉన్నాయి. బీసీల ఓట్లు 79 వేలు ఉండగా, మిగిలిన ఓట్లు ఇతర కులాలకు చెందినవి కావడం గమనార్హం. పైగా, ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కాపు నేతలే ఉన్నారు.

ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాపు సామాజికవర్గానికి చెందిన వైకాపాకు చెందిన పెండెం దొరబాబు ఉన్నారు. ఉప్పాడ దగ్గర 450 కోట్లతో అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్, 2 వేల ఎకరాల భూమి రైతులకు తిరిగివ్వడం, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో.. అదనపు తరగతి గదుల నిర్మాణాలతో పాటు ఇతర అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే ఈ స్థానం టిక్కెట్ కేటాయించవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. 

అయితే, కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత కూడా ఈ దఫా పిఠాపురం నుంచి పోటీ చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్నారు. అయితే, ఆమెకు సీఎం జగన్ టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది తర్వాత విషయం. కానీ, ఆమె మాత్రం ఈ స్థానం నుంచి పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అదేసమయంలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది.

సీఎంను కలిసి కొత్త ఎమ్మెల్సీలు.. అభినందించిన వైఎస్‌ జగన్‌

తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగిన విజయం సాధించిన ఎమ్మెల్సీలు ఇవాల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు.. బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతోన్న నేపథ్‌యంలో.. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నర్తు రామారావు, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్‌.. తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక, ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలను అభినందించారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇక, కొత్త ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని కలిశారు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ జరగగా.. 16వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు.

2024లో పులివెందులలో జగన్ ను ఓడిస్తాం – బుద్ధ వెంకన్న

2024లో పులివెందులలో జగన్ ను ఓడిస్తామని హెచ్చరించారు ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న. టిడిపి బలపరచిన పట్టభద్రుల ఎంఎల్సీలు గెలవడంతో బెజవాడలో సంబరాలు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే బుద్ధ వెంకన్న మాట్లాడారు. మళ్ళీ వచ్చేది చంద్రబాబు నాయుడేనని… నాని, వంశీ, అవినాష్ టిడిపి భిక్షతో వచ్చిన వాళ్ళు అని విమర్శలు చేశారు.

పట్టభద్రుల MLC లో టిడిపి అభ్యర్ధులను గెలిపించారని… ప్రజల తీర్పుకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. 2024లో వచ్చేది చంద్రబాబే అని దేవుడు స్క్రిప్ట్ రాసాడని.. 14 నెలల ముందే చూపించాడు భగవంతుడు అని తెలిపారు. కుప్పంలో చెత్తకుప్పని కూడా కొట్టలేరు మీరునని… పులివెందుల కొట్టేసాం మేం … 2024లో జగన్ పులివెందుల లో గెలిస్తే చాలు అన్నారు. ఇప్పటికైనా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని జగన్ కు సవాల్‌ విసిరారు ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న.

రేపు ఎన్టీఆర్ జిల్లాలో జగన్ పర్యటన

సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్టీఆర్‌ జిల్లా పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది. రేపు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు లో పర్యటించనున్నారు. తాడేపల్లినుంచి బయలుదేరి తిరువూరు మార్కెట్ యార్డుకి చేరుకోనున్నారు సీఎం జగన్.

ఇందులో భాగంగా రేపు ఉదయం 11.00- 12.30 గంటలకు మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. ఇవాళ రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఎన్టీఆర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. లిఫ్ట్ వైర్ తెగి ఇద్దరు మృతి..

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. వీటీపీఎస్‌లో వైర్ తెగిపోవడటంతో లిఫ్ట్ కింద పడిపోయింది. దీంతో లిఫ్ట్‌లో ఉన్న 8 మంది కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోయారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఆరుగురిని చికిత్స కోసం దగ్గర్లో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌లో ప్రతి రోజు ఉదయం లిఫ్ట్ ద్వారా కార్మికులు పైకెళ్లి పనులు చేస్తుంటారు.ప్రతి రోజూలాగే ఇవాళ కూడా కార్మికులు లిఫ్ట్‌లో వెళ్తుండగా కొంత దూరంపైకి వెళ్లిన తర్వాత వైర్ తెగి పోవడంతో లిఫ్ట్ అమాంతం కింద పడిపోవడం ఈ ప్రమాదం జరిగిందీ..అయితే ఓవర్‌ లోడ్‌ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని చెబుతున్నారు.ఇక అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు వీటీపీఎస్ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వలన మాత్రమే ప్రమాదం జరిగిందని తోటీ కార్మికులు హాస్పిటల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే వీటిపిఎస్, పవర్ మేక్, కంపెనీల అధికారులు బోర్డు హాస్పటల్ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించాలని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

యువ గళం పాదయాత్రలో అపశృతి..లోకేష్‌ భుజానికి గాయం

యువ గళం పాదయాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. యువ గళం పాదయాత్ర చేస్తున్నా నారా లోకేష్‌ భుజానికి గాయం అయింది. అయితే.. కుడి భుజం నొప్పితోనే నారా లోకేష్..పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పలువురు మహిళలు తన కుడిచేయి పట్టుకొని థాంక్స్ చెప్పాలని చూడడంతో కుడి భుజం నొప్పిగా ఉందంటూ ఎడమ చేతితో థాంక్స్ చెప్పారు నారా లోకేష్.

దీంతో నారా లోకేష్‌ భుజానికి గాయం అయిందని తెలుస్తోంది. పాదయాత్ర చేస్తూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి కుడి భుజం నొప్పిగా ఉందని చెప్పారు నారా లోకేష్. సెల్ఫీ తీసుకునే సమయంలో తన బిడ్డను ఎత్తుకొని ఫోటో తీసుకోవాలని లోకేష్ ను కోరగా తన చేయి నొప్పిగా ఉందంటూ మహిళతో చెప్పారు నారా లోకేష్. ఈ సంఘటన నేపథ్యంలోనే… ఈ విషయం బయటపడింది.

ఏపీ, తెలంగాణ మధ్య ఉన్నపెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్​కోకు రావాల్సిన రూ.7,058 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలని ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు సరఫరా చేసిన కరెంట్​కు సంబంధించి తెలంగాణ, ఏపీకి బకాయిపడిందని వివరించారు. 

శుక్రవారం పార్లమెంట్ లోని పీఎం ఆఫీసులో ప్రధాని మోడీతో జగన్ భేటీ అయ్యారు. అరగంటకుపైగా సాగిన ఈ సమావేశంలో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ఏపీకి సంబంధించిన 14 అంశాలను జగన్ ప్రస్తావించారు. విభజన జరిగి తొమ్మిదేండ్లు గడుస్తున్నా.. చాలా అంశాలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు.

కీలకాంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయని, వీటిపై దృష్టి సారించాలని కోరారు. ఏపీకి సంబంధించి.. 2014–15 ఆర్థిక సంవత్సరం నాటి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద పెండింగ్​లో ఉన్న రూ.36,625 కోట్లు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

 కేంద్రం సహకారం అందిస్తే కొద్దికాలంలోనే పోలవరం పూర్తవుతుందని, ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,600.74 కోట్లు ఖర్చు చేసిందని, ఈ బకాయిలను చెల్లించాలని కోరారు. పోలవరం అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ నిర్ధారించిన రూ. 55,548 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అడహక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీని గుర్తు చేశారు.

ఏపీ బడ్జెట్ పై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ బడ్జెట్ పేదరిక నిర్మూలనకు పునాది అని తెలిపారు మంత్రి రోజా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఐదోసారి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పునాది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించేలా బడ్జెట్ లో డిబిటి పథకాలకు 54,228 కోట్ల కేటాయింపులు చేయడం హర్షణీయం అన్నారు రోజా.

ఈ రాష్ట్రంలోని పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ కొండంత భరోశాను కలిగించింది. జగనన్న మాట తప్పడు మడమ తిప్పడు అని మరో సారి ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు కేటాయింపుల ద్వారా స్పష్టమైంది. విద్య,వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఈ రాష్ట్రంలోని ప్రజలందరి ఆకాంక్షలను గౌరవించారు. ముఖ్యంగా ఓ మహిళా మంత్రిగా ఈ బడ్జెట్ లో మహిళలకు ఇచ్చిన ప్రాధ్యాన్యతకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని వివరించారు.

మహిళలకు ఇళ్ల నిర్మాణం, అమ్మఒడి, సున్నావడ్డీ రుణాలు, వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపి జగనన్న మరోసారి మహిళా పక్షపాతి అని నిరూపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం ప్రాధాన్యం ఇచ్చి, గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ తరువాత రాష్ట్ర ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయ్యేలా ఈ బడ్జెట్ ను రూపొందించారు. ఇలాంటి బడ్జెట్ ప్రతులను చించేసిన తెలుగుదేశం పార్టీకి ఈ బడ్జెట్ ద్వారా మేలు జరిగే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు రాబోయే రోజుల్లో వాళ్ల భవిష్యత్ ని చించేయడం ఖాయం.“ అన్నారు రోజా.

TTD : ఇక వారికి ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభం... - టీటీడీ ఇ.ఓ ధర్మారెడ్డి

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో టీటీడీ ఇ.ఓ ధర్మారెడ్డి మాట్లాడారు. తిరుమల కొండ పైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తాం అన్నారు ఈవో ధర్మారెడ్డి.

తిరుమలలో భక్తులకు నాలుగంచెల విధానంలో దర్శనం కల్పిస్తున్నాం అన్నారు. రోజూ వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం అన్నారు.

రాష్టంలో ఆదరణ తగ్గిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నాం అన్నారు. టీటీడీ ఆధీనంలో 60కి పైగా ఆలయాలు ఉన్నాయి.. వాటి సరసన రాజాం ఆలయం చేరిందన్నారు.