TS : ఈ రోజు నుంచే ఇంటర్ పరీక్షలు..
తెలంగాణలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ)-2023 మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్‌బీఐఈ) వెల్లడించిన విషయం తెలిసిందే. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.45 గంటల లోపు పరీక్ష కేంద్రంలోకి రావాల్సి ఉంటుంది. 9 గంటల తర్వాత లోపలికి అనుమతించరు. ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,47,699 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారంతా పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. విద్యాధికారులు ఈ పరీక్షల కోసం 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అంతేకాదు… 61 సెల్ఫ్ సెంటర్లు కూడా ఉన్నాయి. పరీక్షల కోసం 75 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 1,473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించారు.
Mar 15 2023, 13:35