థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు ఈ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు..!!
జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు..ఇవన్నీ కూడా ఈరోజుల్లో దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతున్నాయి. వాటిలో ఒకటి థైరాయిడ్. థైరాయిడ్ అనేది సీతాకోకచిలుక ఆకారంలో గొంతు వద్ద ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్‌ను రిలీజ్ చేయడం ద్వారా శరీరంలో అనేక మెటబాలిక్ ప్రాసెస్లను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేనట్లయితే థైరాయిడ్ సమస్య వస్తుంది. సాధారణంగా థైరాయిడ్ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు విపరీతంగా పెరిగినప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువ పనిచేస్తే దాన్ని హైపో థైరాయిడిజం అని అంటారు.
అయితే థైరాయిడ్ హార్మోను సవ్యంగా విడుదలైనప్పుడు శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేస్తుంది. జీవక్రియ పనితీరు కూడా బాగుంటుంది. థైరాయిడ్ హార్మోన్ విడుదలలో ఎప్పుడైతే సమతుల్యం లోపిస్తుందో అప్పుడు ఇబ్బుందు ఎదుర్కొవల్సి వస్తుంది. బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట, నీరసం, నెలసరి సమస్యలు, పొడి చర్మం, మలబద్దకం, సంతానలేమి వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం.
ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరండా ఉండండి:
మైక్రోవేబ్ డిన్నర్లు, పిజ్జాలు, డోనట్స్ వంటి పదార్థాలు అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారా జాబితాలో ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైనవి కావు. ఇవి థైరాయిడ్ వ్యాధి ఉన్నవారిపై నేరుగా ప్రభావం చూపుతాయి. తాజా పండ్లు, కూరగాయలు తృణధాన్యాలు, ప్రాసెస్ చేయని ఆహారాలను అలవాటు చేసుకోవడం మంచిది. కొన్ని ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలు కూడా క్యాన్సర్ కు కారణం అవుతాయి. అవసరమైన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న ఆహారాలు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి మంచివి. అయితే, డీప్ ఫ్రైడ్, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, ట్రాన్స్ లేదా ఇతర ఇన్ఫ్లమేటరీ కొవ్వులు థైరాయిడ్ గ్రంధి, థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఉప్పు అధికంగా తీసుకోవడం తగ్గించండి:
ఒక కొత్త అధ్యయనం ప్రకారం, భారతీయులు సగటున రోజుకు 10 గ్రాముల ఉప్పును తీసుకుంటారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మొత్తం కంటే రెట్టింపు. థైరాయిడ్ గ్రంధి అయోడిన్‌ను థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణకు ఉపయోగిస్తుంది. థైరాయిడ్ పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి, అధిక అయోడిన్ లేదా అయోడిన్ లోపం థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తుంది. ఇది వివిధ థైరాయిడ్ రుగ్మతలు లేదా థైరాయిడ్ విస్తరణకు దారితీస్తుంది.
స్వీట్లు తినకూడదు:
థైరాయిడ్ వ్యాధి ఉన్న వ్యక్తులు స్వీట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే థైరాయిడ్ వ్యాధి టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి కారణం అవుతుంది. దాని ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు శీతల పానీయాలు, కేకులు, ఐస్ క్రీములు, ఇతర కృత్రిమ స్వీటెనర్‌లతో సహా మీరు తీసుకునే ఆహారంలో అధికంగా చక్కర ఉండకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం.
గ్లూటెన్ రహిత ఆహారాన్ని తీసుకోవాలి:
గోధుమలలో ఉండే గ్లూటెన్ అనే ప్రొటీన్ చిన్న ప్రేగులను చికాకుపెడుతుంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన వివిధ పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఇది గట్‌లో మంటను పెంచుతుంది. ఇది క్రియారహిత థైరాయిడ్ హార్మోన్‌లను క్రియాశీల హార్మోన్‌లుగా మార్చడాన్ని ప్రభావితం చేస్తుంది. ఆటో-ఇమ్యూన్ థైరాయిడ్ రుగ్మతలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అధికంగా ఆహారం తీసుకోకూడదు:
కొంతమంది అధికంగా తింటుంటారు. అలా తినడం వల్ల రక్తంలో చక్కెరస్థాయి పెరుగుతుంది. ఇది ఆహార ఒత్తిడికి కారణం అవుతుంది. అందుకే అతిగా తినడం తగ్గించాలి.
రాత్రిపూట ఆహారం తినడం మానుకోండి:
రాత్రిపూట ఆహారం తీసుకోవడం మానేయడానికి ప్రయత్నించండి.మీరు అల్పాహారం తినడానికి ముందు 10 నుండి 12 గంటల విరామం తీసుకోండి. మీరు నిద్రపోతున్నప్పుడు, మీ శరీరం అడ్రినల్, గ్రోత్ హార్మోన్లు, థైరాయిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ నిల్వ ఉన్న కొవ్వు నుండి శక్తిని తీసుకుంటుంది. మీరు నిద్రిస్తున్న సమయంలో కొవ్వు బర్న్ అవుతుంది.
(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
Mar 04 2023, 12:10