ఈ నెల 22 నన్నయ యూనివర్సిటీ లో జరిగే యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సును విజయ వంతం చేయండి - PDSU
అనంతపురం జిల్లా
కణేకల్ మండలం
అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా కణేకల్ మండలం లో PDSU కర పత్రాలు విడుదల
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం
విశ్వవిద్యాలయాలు శాస్త్రీయ ఆలోచనలకూ, స్వతంత్ర బావ జలాలకు కేంద్రాలుగా ఉండాలి. విద్యార్థుల్ని నూతన ఆవిష్కరణల వైపు సృజనాత్మకంగా మళ్ళించగలిగే శక్తి విశ్వవిద్యాలయాలకి ఉన్నది. సామాజిక, విప్లవ, అస్తిత్వ ఉద్యమాలకు కూడా కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలే ఉన్నాయి.
ఇది చరిత్ర నిరూపిస్తున్న సత్యం. అసమానతలు, అంతరాలు, సామాజిక, రుగ్మతలతో నేడు కూనరిల్లుతున్నాయి. ప్రమాణాలు, నాణ్యత దిగజారిపోతున్నాయి. మరోవైపు హిందూ మతోన్మాదం విశ్వవిద్యాలయాల్లో విస్రాంకలంగా మారింది. కాషాయికరణ అజెండాతో బిజెపి లౌకిక భవానిల్ని సహించలేకపోతున్నది.
మన రాష్ట్రంలో సుమారు 30 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటి అభివృద్ధికి జగన్ సర్కారు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఒక్కో విశ్వవిద్యాలయానికి 200 కోట్లు కేటాయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1204 ఆశ్చర్య పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. విశ్వవిద్యాలయాల్లో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. V.C ఆచార్యుల నియామకాలన్నీ రాజకీయ నాయకుల కన్ను సన్నల్లోనే జరుగుతున్నాయి.
జాతీయ విద్యా, విధానం 2020 లో భాగంగా దేశంలోకి విదేశీ విశ్వవిద్యాలయాలు, విదేశీ ఉన్నత విద్యా సంస్థల ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజిసి) చైర్మన్ జనవరి 5 నా ప్రకటించారు. విదేశీ, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చి పెట్టి, దేశంలో ప్రభుత్వ ఉన్నత విద్యను, దెబ్బతీసీ పేద, మధ్య తరగతివర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను, దూరం చేసే (యూజిసి ) ముసాయిదాను వ్యతిరేకించాలి.
రాష్ట్రoలో సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు లేవు, సొంత భవనం లేక ప్రొఫెసర్ పోస్టులు లేక విద్యార్థులు 'చదువు' కొనసాగిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలి, విభజన హామీల ప్రకారం 11 కేంద్రీయ, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి.
ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల పటిష్టకరణ, సంరక్షణలకై 2023 ఫిబ్రవరి 22 వ తేదీన రాజమండ్రిలో నన్నయ విశ్వవిద్యాలయంలో జరుగు యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమం లో PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి మల్లెల ప్రసాద్. PDSU నాయకులు నాగరాజు, సుదీర్, నాగరాజు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Feb 23 2023, 14:08