అన్ని పార్టీలు పాలమూరుపైనే ఫోకస్
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు పాలమూరుపై ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి జిల్లాలో14 నియోజకవర్గాలుండడంతో పార్టీల పెద్దలు.. ఇప్పటికే పాలమూరులో పర్యటించి క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశాలు ఇవ్వడంతో నేతలు, కార్యకర్తలు పల్లె, వార్డుబాట పట్టారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పేరిట బీఆర్‌ఎస్ లీడర్లు, ప్రజాసమస్యల పేరిట ప్రతిపక్ష నేతలు ప్రజల వద్దకు వెళ్తున్నారు.
అభివృద్ధి మంత్రం
బీఆర్‌ఎస్ నేతలు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. సీఎం కేసీఆర్ డిసెంబర్ 4న పాలమూరులో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పలు హామీలు కూడా ఇచ్చారు. కొద్ది రోజులకే ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు పాలమూరులో, మంత్రి కేటీఆర్నారాయణపేట జిల్లాలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. స్థానిక మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బాలరాజు, అబ్రహం, జనార్దన్ రెడ్డి, జైపాల్, అబ్రహం, రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, మహేశ్ రెడ్డి సీఎం రిలీఫ్ పండ్, కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు పేరిట నిత్యం గ్రామాల్లో తిరుగుతున్నారు. సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. లేదా ప్రభుత్వ పెద్దల దృష్టికి
తీసుకెళ్తున్నారు.
బీజేపీ రాష్ర్టస్థాయి కార్యవర్గ సమావేశాలు
పాలమూరుపై ఫోకస్ పెట్టిన బీజేపీ పెద్దలు.. రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలను ఇక్కడే నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్చుగ్నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకోవడానికి తీసుకోవాల్సిన అంశాలపై స్థానిక నేతలతో చర్చించారు. ప్రజా సంగ్రామ యాత్ర-–2 ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు దగ్గరైన పార్టీ స్టేట్ చీఫ్బండి సంజయ్.. కొల్లాపూర్‌లో ఎల్లేని సుధాకర్‌రావు నిర్వహించిన పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో అత్యధికంగా సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్‌కు సూచించారు. దీనిపై పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డితో చర్చించి రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిసింది. వీరి డైరెక్షన్లో డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎన్పీ వెంకటేశ్, బాలా త్రిపుర సుందరి, సత్య యాదవ్, దేవరకద్ర బాలన్న, ఎగ్గని నర్సింహులు, ఎల్లేని సుధాకర్‌రావు, జలంధర్‌రెడ్డి, రతంగ్ పాండురెడ్డి, పాలమూరు సీడ్స్ సుదర్శన్‌రెడ్డి, అయ్యంగారి ప్రభాకర్‌రెడ్డి, అశ్వాత్థామారెడ్డి, టి.ఆచారి, అందే బాబయ్య, మిథున్‌రెడ్డి, దిలీపాచారి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. శక్తి కేంద్రాలు, పదాధికారుల మీటింగ్‌లు, బూత్ కమిటీలతో పార్టీని పటిష్టం చేస్తున్నారు.
ఉద్యమాల బాటలో కాంగ్రెస్ క్యాడర్
2014 ఎన్నికల వరకు ఉమ్మడి జిల్లాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఉనికి కోల్పోయే స్థితికి చేరింది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ స్టేట్చీఫ్ ఎనుముల రేవంత్‌రెడ్డి పాలమూరువాసి కావడంతో.. పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల బిజినేపల్లిలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో భాగంగా గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రధానంగా మాజీ మంత్రులు చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీలు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్లు జి.మధుసూదన్‌రెడ్డి, వంశీకృష్ణ, పటేల్ ప్రభాకర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, టీపీసీసీ సెక్రటరీ జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ కె.వీరారెడి కొడుకు కె.ప్రశాంత్‌రెడ్డి, కొల్లాపూర్ నేతలు రంగినేని అభిలాష్‌రావు, జగదీశ్వర్‌రావు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.
Feb 12 2023, 11:32