ప్రత్యేక లైసెన్స్ అక్కర్లేదు: సుప్రీం కీలక తీర్పు
డ్రైవింగ్ లైసెన్సులపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఒకే లైసెన్సుతో రెండు రకాల వాహనాలను నడిపే వెసులుబాటును సమర్థించింది.
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలకతీర్పునిచ్చింది. ఎల్ఎంవి (లైట్ మోటార్ వెహికల్) డ్రైవింగ్ లైసెన్స్ తో 7500 కిలోల లోపు ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా నడపొచ్చు అని తీర్పులో వెల్లడించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించాయి. 7500 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న రవాణా వాహనాన్ని నడిపేందుకు ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదని తీర్పునిచ్చింది.
లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు రవాణా వాహనం నడపడమే ప్రమాదాలకు ప్రధాన కారణమనే వాదనను సుప్రీం తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన డేటా తమ వద్ద లేదని తెలిపింది. 7,500 కిలోలకు పైగా ఉన్న రవాణా వాహనాలను నడిపేందుకు ప్రత్యేక అనుమతి అవసరం లేదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ మేరకు ల్ఎంవీ కేటగిరీలోని ట్రాన్స్‌పోర్టు వాహనాలను డ్రైవ్ చేసేవారికి ప్రత్యేకంగా ఎలాంటి లైసెన్సు అవసరం లేదు. 7,500 కేజీల లోపు బరువున్న వాహనాలను కూడా ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు నడపవచ్చు.
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు ట్రాన్స్‌పోర్టు వాహనాలను నడపడం కారణమంటూ ఇటీవల వస్తున్న ఆరోపణలను కోర్టు ప్రస్తావించింది. ఈ రెండింటికీ సంబంధం లేదని తెలిపింది. మోటారు వాహనాల చట్టం 1988లో పేర్కొన్న అదనపు అర్హత ప్రమాణాలుదాని కింద రూపొందించిన నియమాల ప్రకారం మధ్యస్థ/భారీ రవాణా వాహనాలు 7,500 కేజీల కంటే ఎక్కువ స్థూల బరువు కలిగిన ప్రయాణికుల వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
Nov 06 2024, 18:13