/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz టెండర్‌‌పై సర్కార్ కీలక నిర్ణయం Raghu ram reddy
టెండర్‌‌పై సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్న కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ బుధవారం జీవో జారీ అయ్యింది. మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్‌మెంట్ ఇంజనీరింగ్ విభాగం జీవో జారీ చేసింది.

గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ టెండర్ల విషయంలో సర్కార్ (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. 2017లో ఇచ్చిన కేశవాపురం కాంట్రాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల పేరిట గత ప్రభుత్వం ప్రాజెక్టును డిజైన్ చేసిన విషయం తెలిసిందే. మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్‌మెంట్ ఇంజనీరింగ్ విభాగం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవాపురం రిజర్వాయర్.. అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అదే ఖర్చుతో గోదావరి ఫేజ్ 2 స్కీమ్‌ను మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్ గ్రేటర్ సిటీ తాగునీటి అవసరాలకు తాగునీటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగు నీటిని సరఫరా చేయటంతో పాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

పాత టెండర్ల ప్రకారం ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కేశవాపురం చెరువును నింపుతారు. కేశవాపురం చెరువును 5 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్‌గా నిర్మించనున్నారు. అక్కడి నుంచి ఘన్‌పూర్ మీదుగా హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగునీటి అవసరాలకు సరఫరా చేసేలా ప్లాన్‌ను సిద్ధం చేశారు. అయితే ఆరేండ్లై పనులు ప్రారంభంకానీ పరిస్థితి. భూసేకరణ చిక్కులతో పాటు అనాలోచితమైన అలైన్మెంట్ కారణంగా పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం అటవీ భూములు, రక్షణ శాఖ భూముల నుంచి ప్రాజెక్టును డిజైన్ చేయటం, ఎంచుకున్న పైపులైన్ రూట్ సరిగ్గా లేకపోవటంతో పనులు ముందుకు సాగలేదని రేవంత్ సర్కార్ చెబుతోంది. గత ప్రభుత్వం హయాంలో ఈ టెండర్లను మెఘా కంపెనీ దక్కించుకుంది. అయితే టెండర్లను దర్కించుకున్నప్పటికీ పనులు చేపట్టకుండా మేఘా కంపెనీ వదిలేసింది.

2017 నాటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పనులు చేపట్టలేమని.. 2024 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని మెఘా కంపెనీ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటి వరకు పనులు చేపట్టని కారణంగా మెఘా కంపెనీకి కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో గ్రేటర్ సిటీకి తాగునీటి సరఫరాతో పాటు ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్ నీటిని నింపేందుకు ఎక్కువ భాగం గ్రావిటీతో వచ్చేలా కొత్త అలైన్మెంట్ ప్రకారం పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్

తొలి దఫా అధ్యక్షుడిగా పనిచేసిన నాటి నుంచి తాజా ఎన్నికల వరకు ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ పనిచేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని ధృఢంగా పునరుద్ధరించుతానంటూ ప్రచార సమయంలోనే గట్టిగానే చెప్పారు. మరి ట్రంప్ 2.0 ప్రభుత్వం భారత్‌-అమెరికా బంధాలను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి.

ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా ఎన్నికలు-2024 ఫలితాలు వచ్చేశాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. మరి ట్రంప్ రెండవ దఫా పరిపాలనలో భారత్-అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?, ప్రతికూలతలు ఏంటి, అవరోధాలు ఏమిటి? ఏయే అంశాలు ప్రభావితం కాబోతున్నాయి? అనే చర్చలు, విశ్లేషణలు ఊపందుకున్నాయి.

తొలి దఫా అధ్యక్షుడిగా పనిచేసిన నాటి నుంచి తాజా ఎన్నికల వరకు ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ పనిచేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని ధృఢంగా పునరుద్ధరించుతానంటూ ప్రచార సమయంలోనే గట్టిగానే చెప్పారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య స్నేహబంధం ఉంది. ‘హౌడీ, మోడీ!’, ‘నమోస్తే మోదీ’ వంటి ఈవెంట్‌లలో మోదీతో పాటు ట్రంప్ కూడా స్వయంగా పాల్గొన్నారు. ట్రంప్ గత పాలనలో భారత్-అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయని వీటిని బట్టి చెప్పవచ్చు. మరి ట్రంప్ 2.0 పాలనలో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఎదురుకావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇండియాకు వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్, సైనిక సహకారం, దౌత్యం వంటి అంశాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.

అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ తన విదేశాంగ విధానం ఉంటుందని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి దఫా పాలనలో పలు కీలకమైన అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగారు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో పనిచేసిన ఆయన.. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను నిష్క్రమింపజేశారు. ఇరాన్ అణు ఒప్పందంతో పాటు కీలక అంతర్జాతీయ ఒప్పందాలకు కూడా విలువ ఇవ్వలేదు. మరికొన్ని ముఖ్యమైన ఒప్పందాలను సవరించారు. దీంతో రెండవ ట్రంప్ దఫా పాలనలో విదేశాంగ విధానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

ఒప్పందాలు, పొత్తుల విషయంలో ట్రంప్ ప్రతికూల నిర్ణాయలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. భారత్ విషయానికి వస్తే అమెరికాతో వాణిజ్యం బంధం చాలా ముఖ్యమైనది. విదేశీ ఉత్పత్తులపై భారత్ అత్యధిక సుంకాలను విధిస్తోందంటూ గత పాలనలో ట్రంప్ ఆరోపించారు. పరస్పర పన్నును ప్రవేశపెట్టాలని కూడా ఆయన అన్నారు. తిరిగి అధికారంలోకి రావడంతో ఇప్పుడెలా వ్యవహరిస్తారో చూడాలి. ట్యాక్స్‌లు ఏమైనా ప్రవేశపెడతారా అనేది వేచిచూడాలి. ఇక భారత ఐటీ, ఫార్మాస్యూటికల్, టెక్స్‌టైల్స్ రంగాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడుతుంటాయి. వీటి విషయంలో ట్రంప్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.

అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానం భారతీయులకు చాలా కీలకమైనది. ముఖ్యంగా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై ఆధారపడి అక్కడ పనిచేస్తున్న ఐటీ నిపుణులపై ఇమ్మిగ్రేషన్ విధానం చాలా ప్రభావం చూపుతుంది. ట్రంప్ తన మొదటి దఫా పాలనలో విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వేతన పరిమితులు పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పరిణామం భారతీయ ఐటీ నిపుణులు, టెక్ కంపెనీలకు సవాలుగా మారింది. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ నిబంధనలను ప్రవేశపెడితే అమెరికాలోని భారతీయ టెకీలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణులపై ఆధారపడే ఐటీ కంపెనీలు కూడా ప్రభావితం అవుతాయి.

భారత్-అమెరికా సంబంధాలలో రక్షణ, సైనిక సహకారం అంశాలు గత కొన్నేళ్లుగా మూలస్తంభాలుగా ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (iCET), జెట్ ఇంజిన్‌ల తయారీకి జీఈ-హెచ్ఏఎల్ (GE-HAL) వంటి కీలకమైన రక్షణ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరిగాయి. ఇక ట్రంప్ తదుపరి పాలన విషయానికి వస్తే.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్-అమెరికా సైనిక సహకారాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

ఇక అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్న ‘క్వాడ్’ను ట్రంప్ హయాంలో మరింత బలోపేతం చేసే అవకాశాలున్నాయి. చైనాకు కౌంటర్‌గా క్వాడ్ బలోపేతం జరుగుతోంది. సభ్య దేశాల మధ్య ఆయుధ విక్రయాలు, సాంకేతికత బదిలీలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు వంటి మరింత రక్షణ సహకారాన్ని ట్రంప్ 2.0 హయాంలో ఆశింవచ్చు. ఇక ఉగ్రవాద నిరోధం విషయంలో కూడా భారత లక్ష్యాలకు అనుకూలంగా ట్రంప్ ప్రభుత్వం పనిచేసే అవకాశాలు ఉన్నాయి.

విజేత ఎవరనేది ఎప్పటికి తెలుస్తుంది

ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరిగాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డారు. పోటాపోటీగా జరిగిన ఈసారి ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడడానికి చాలా సమయం పట్టొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరిగాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నువ్వా-నేనా అన్నట్టుగా తలపడ్డారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడడానికి చాలా సమయం పట్టొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొన్ని రోజుల సమయం కూడా పట్టొచ్చని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తన పార్టీ శ్రేణులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు సమయాల్లో (కాలమానాలను బట్టి) ఓట్ల లెక్కింపు జరుగుతుండడం ఈ ఆలస్యానికి ఒక కారణం కానుంది. అందుకే ముగింపు ఫలితం చాలా ఆలస్యంగా వెలువడనుందని తెలుస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ఓట్లను లెక్కిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసే వరకు వేచి ఉంటారు. అయితే మరికొన్ని రాష్ట్రాల్లో బ్యాలెట్లు సమర్పించిన వెంటనే కౌంటింగ్ మొదలుపెడతారు. అందుకే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల ప్రకటనలు వేర్వేరు సమయాల్లో వెలువడుతుంటాయి. మన దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగా కాకుండా అమెరికాలో రాష్ట్రాల ఎన్నికల సంఘాలే ఓట్లను లెక్కిస్తాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య (భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 -సాయంత్రం 4.30) విస్కాన్సిన్, మిచిగాన్‌ల రాష్ట్రాల్లో చాలా ఫలితాలు వెలువడనున్నాయి. ఇక పెన్సిల్వేనియా, అరిజోనా, నెవాడాల్లో అప్పటికి కొన్ని ఫలితాలు మాత్రమే వస్తాయి.

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రతి ఓటు కోసం ప్రచారం చేశారు. ప్రత్యేకించి ఎన్నికల రణక్షేత్రాలుగా భావించిన అరిజోనా, నెవాడా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా స్వింగ్ రాష్ట్రాల్లో హోరాహోరీగా పోరాడారు. దీంతో ఓట్ల లెక్కింపు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అధికార డెమోక్రాటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ వందలాది మంది న్యాయవాదులు, వేలకొద్దీ వాలంటీర్లను ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మోహరించాయి. అవసరమైతే న్యాయ పోరాటాలు చేయడానికి న్యాయవాదులను సిద్దంగా ఉంచుతారు.

కాబట్టి ఎన్నికల ఫలితాలు చాలా రోజుల వరకు తెలియకపోవచ్చని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన పరిశీలకులు డిల్లాన్ పేర్కొన్నారు. పూర్తి ఫలితాల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాలని అన్నారు. బుధవారం రోజు తర్వాత అన్ని రాష్ట్రాల ఫలితాలు ఆశించవచ్చని డిల్లాన్ అన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అప్రమత్తం చేశారు. పెన్సిల్వేనియా, అరిజోనా, నెవాడా, మిచిగాన్, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో బుధవారం తర్వాత కూడా కొన్ని ఫలితాలు రావొచ్చని పేర్కొన్నారు. ‘‘నెవాడాలో నవంబర్ 9 వరకు బ్యాలెట్‌లు వస్తాయి’’ అని పేర్కొన్నారు.

అయ్యా నాది ఏ రాష్ట్రం

తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్నాళ్లపాటు ఆంధ్ర ప్రాంతంలో చదువుకున్నాడు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలో చదివాడు.

తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్నాళ్లపాటు ఆంధ్ర ప్రాంతంలో చదువుకున్నాడు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలో చదివాడు. ఆ విద్యార్థి ఇప్పుడు ఏ రాష్ట్రానికి చెందినవాడవుతాడు? వైద్య విద్యార్థి ధూరెడ్డి పృథ్వీరెడ్డికి ఇప్పుడు ఇదే సమస్య ఎదురైంది. పీజీ వైద్య విద్యకు అర్హత పరీక్షలో సీటు సాధించి కౌన్సెలింగ్‌కు సిద్ధమైన పృథ్వీరెడ్డిని తెలంగాణ అధికారులు ఏపీకి వెళ్లమంటున్నారు. ఏపీకి వెళితే.. అక్కడి అధికారులు తెలంగాణకు వెళ్లమంటున్నారు. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారి.. ఎంతో కష్టపడి సాధించిన పీజీ సీటుకు దూరమయ్యే ప్రమాదంలో ఉన్నాడు. మెడికల్‌ పీజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరులో జారీ చేసిన 148 జీవోనే ఇందుకు కారణమైంది.

ఈ జీవో ప్రకారం.. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతోపాటు ఎంబీబీఎస్‌ కూడా ఇక్కడే పూర్తి చేసినవారికి ఇక్కడి స్థానికత కల్పిస్తారు. అయితే పృథ్వీరెడ్డి.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందినవాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న విజయనగరం జిల్లా పరిధిలోని కోరుకొండ సైనిక్‌ స్కూల్లో 6వ తరగతిలో సీటు రావడంతో 12వ తరగతి వరకు అదే పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించాడు. అనంతరం నీట్‌ పరీక్షలో 1830 ర్యాంకు సాధించి గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎ్‌సలో చేరి వైద్య విద్యను పూర్తి చేశారు.

ఇటీవల జరిగిన నీట్‌ మెడికల్‌ పీజీ ఎంట్రెన్స్‌లో పృథ్వీరెడ్డి 11,362 ర్యాంకు సాధించి కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈ నెల 7 నుంచి జరగనున్న కౌన్సెలింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించగా.. ఆయన దరఖాస్తును ఆన్‌లైన్‌ స్వీకరించలేదు. దీంతో ఆందోళనకు గురైన పృథ్వీరెడ్డి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీకి వెళ్లి సంప్రదించా రు. వైస్‌ చాన్స్‌లర్‌ ఈయన సర్టిఫికెట్లను పరిశీలించి.. 12వ తరగతి వరకు విద్యాభ్యాసం ఏపీలో ఉన్నందున జీవో 148 ప్రకారం తెలంగాణ స్థానికత లేదని తెలిపారు. దీనిపై వైద్య ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖలో విచారించగా.. అక్కడా ఇదే విషయం చెప్పారు.

తాను తెలంగాణలో పుట్టానని, ప్రాథమిక విద్యను ఇక్కడే చదివానని, ఎంబీబీఎస్‌ కూడా ఇక్కడే పూర్తి చేశానని, ఏపీలోని సైనిక్‌ స్కూల్లో చదివింది కూడా ఉమ్మడి రాష్ట్రంలోనేనని, తన తండ్రి తెలంగాణలో పోలీస్‌ శాఖలో పని చేస్తున్నారని పృథ్వీరెడ్డి చెప్పినా కుదరదన్నారు. తనకు న్యాయం చేయాలం టూ రాష్ట్రఉన్నతాధికారులతోపాటు, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టియానాను కలిసినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఏపీకి వెళితే.. ఎంబీబీఎస్‌ తెలంగాణలో చదివినందున పీజీకి తమ రాష్ట్ర స్థానికత ఇవ్వలేమని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన 2014కు ముందు తాను ఏపీలో చదివానని, తనలాంటి వారంతా తెలంగాణ స్థానికత కోల్పోవాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు మరోరోజు మాత్రమే గడువు ఉన్నందున ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

మేడ్చల్‌ వరకు మెట్రో రైలు కావాలి

మేడ్చల్‌ వరకు మెట్రో రైల్‌(Metro Rail) కావాలని మేడ్చల్‌ మెట్రో సాధన సమితి డిమాండ్‌ చేసింది. నగరానికి ఉత్తర భాగంలో ఉన్న మేడ్చల్‌ శామీర్‌పేట్‌ ప్రాంతాలకు మెట్రో రైలు పొడిగించాలని మేడ్చల్‌ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మంగళవారం బోయిన్‌పల్లి(Boinpally)లోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌ వద్ద ప్లకార్డులు, ప్లెక్సీలు పట్టుకుని నిరసన చేపట్టారు.

మేడ్చల్‌ వరకు మెట్రో రైల్‌(Metro Rail) కావాలని మేడ్చల్‌ మెట్రో సాధన సమితి డిమాండ్‌ చేసింది. నగరానికి ఉత్తర భాగంలో ఉన్న మేడ్చల్‌ శామీర్‌పేట్‌ ప్రాంతాలకు మెట్రో రైలు పొడిగించాలని మేడ్చల్‌ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మంగళవారం బోయిన్‌పల్లి(Boinpally)లోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌ వద్ద ప్లకార్డులు, ప్లెక్సీలు పట్టుకుని నిరసన చేపట్టారు. ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ.. గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు వస్తున్నట్లు తెలుసుకున్న మేడ్చల్‌ సాధన సమితి ప్రతినిధులు కేంద్రం వద్దకు చేరుకుని మేడ్చల్‌ వరకు మెట్రో రైలు ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్బంగా సాధన సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళామని, నగరంలోని వివిధ ప్రాంతాలకు మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించాలని నిర్ణయించినప్పటికీ మేడ్చల్‌(Medchal)కు మాత్రం మెట్రో రైలు పొడిగించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్యారడైజ్‌ నుంచి మేడ్చల్‌ వరకు ఎన్ని ప్లైఓవర్లు వేసినా రహదారులను విస్తరించినా ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడంలేదని అన్నారు.

ఈ మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తొలగాలన్నా ఉత్తర భాగంలో నివశిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలన్నా మెట్రో ఒక్కటే మార్గమని తెలిపారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు మహేందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, జార్జ్‌, మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి భారీగా అప్పులు పెరిగాయి. ముఖ్యంగా గత పదేళ్లలో అప్పులు భారీగా పెరిగాయి. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కూడా అప్పులు చేయక తప్పడం లేదు. అప్పులతో పాటు ఆదాయం పెంచుకునే పనిలో రాష్ట్ర సర్కార్ ఉంది.

ఇందులో భాగంగా మద్యం ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందుకే ఎక్సైజ్శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. లిక్కర్ ధరలు పెంచ్చొద్దన భావించినప్పటికీ సరిహద్దు రాష్ట్రాల్లో ధరలు పెరగడంతో ఇక్కడ కూడా ధరలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

హార్డ్ మద్యంపై రూ.10 నుంచి రూ.90, బీరుపై రూ.15-20 పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేస్తోంది. చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువ.. ప్రీమియం బ్రాండ్లపై ఎక్కువ రేట్లు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మద్యం ధరలు పెంచితే రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ నుంచి రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుంది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఈ డబ్బు వస్తుంది.

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో ఆబ్కారీ శాఖకు రూ.17 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మిగిలిన 6 నెలల్లో కూడా ఇంతే స్థాయిలో ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో రోజుకు సరాసరిగా రూ.90 కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. దీన్ని బట్టి నెలకు రూ.2700 కోట్ల నుంచి రూ.3000 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ ఆదాయం తోపాటు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో ఆగస్ట్ లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని భావించారు. కానీ ఇంకా పెంచలేదు. భూముల విలువలకు సంబంధించి అధికారులు ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో జరిగిన సిగ్గుచేటు ఘటన మహాత్మాగాంధీ విగ్రహం నోట్లో క్రాకర్ పెట్టి పేల్చారు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలోని ప్రగతినగర్‌ సరస్సు సమీపంలో ఓ అవమానకర ఘటన వెలుగు చూసింది. ఇక్కడ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది మహాత్మా గాంధీ విగ్రహం తలను పగులగొట్టి అక్కడ ఉంచబడింది.

దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ సంఘటనపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గుల చర్యపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ విషయంపై బాచుపల్లి పోలీసులు స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో పాటు ఈ కేసులో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు. నవంబర్ 4 సోమవారం రాత్రి జరిగిన ఈ కేసును పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అంతకుముందు, దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో, మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన సరిగ్గా దీపావళి రోజు రాత్రి జరిగింది, నగరంలోని బోవెన్‌పల్లి ప్రాంతంలోని మహాత్మా గాంధీ విగ్రహం నోటిలో కొంతమంది పిల్లలు బాణసంచా పేల్చారు. అయితే ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు పిల్లలందరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైలు మార్గం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైలు మార్గానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ను బాపట్ల వరకు పొడిగించారు. తాజాగా ఆ రైల్వే లైన్‌ను రేపల్లె నుంచి బాపట్ల వరకు పొడిగించారు. రేపల్లె నుంచి బాపట్ల వరకూ 45.81 కిలోమీటర్ల మరో సెక్షన్‌గా తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఈ లైన్ సర్వే కోసం రూ.1.15 కోట్లను మంజూరు చేసిన రైల్వే బోర్డు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైలు మార్గానికి లైన్ క్లియర్ అయ్యింది. మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల కొత్త రైల్వేలైన్‌కు కీలక ముందడుగు పడింది. మొత్తం 45.81 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన లైన్‌కు సంబంధించిన ఎఫ్‌ఎల్‌ఎస్‌ (ఫైనల్‌ లొకేషన్‌ సర్వే) చేపట్టేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలపగా.. ఆదేశాలు జారీ అయ్యాయి. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు 45.30 కిలోమీటర్ల రైలు మార్గాన్ని ఒక సెక్షన్‌గా.. రేపల్లె నుంచి బాపట్ల వరకూ 45.81 కిలోమీటర్ల లైన్‌ మరో సెక్షన్‌గా తీసుకున్నారు. ఈ మేరకు కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటు కోసం సర్వే చేపట్టి.. డీపీఆర్‌ తయారీకి రైల్వేబోర్డు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేసింది. సర్వేకు సంబంధించి.. మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ కోసం రూ.1.13 కోట్లు.. రేపల్లె-బాపట్ల లైన్‌ కోసం రూ.1.15 కోట్ల నిధులను రైల్వేబోర్డు మంజూరు చేసింది. వాస్తవానికి మచిలీపట్నం-రేపల్లె మధ్య చేపట్టబోయే 45.30 కిలోమీటర్ల కొత్త రైల్వేలైనుకు సంబంధించి ఆగస్టులో ఎఫ్‌ఎల్‌ఎస్‌ కోసం రైల్వేబోర్డు ఆదేశాలిచ్చింది.

తాజాగా రేపల్లె నుంచి బాపట్లకు కొత్త లైన్‌ వేసేందుకు ఉత్తర్వులు వచ్చాయి.

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ కోసం ఎప్పటి నుంచో కలగా మిగిలింది. ఈ రైలు మార్గం కోసం గతంలో ఆందోళను కూడా జరిగాయి.. చివరికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారి కల నెరవేరబోతోంది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. విజయవాడతో సంబంధం లేకుండా మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల లైన్‌ ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుంది. ఈ రైల్వే మార్గం మచిలీపట్నం పోర్టుకు సరకు రవాణాలో కీలకం కాబోతోంది. ఈ లైన్ నేరుగా హౌరా-చెన్నై ప్రధాన రైల్వే మార్గంతో అనుసంధానం కావడంతో 50 నుంచి 100 కిలోమీటర్ల వరకూ దూరం కూడా తగ్గుతుంది అంటున్నారు.

వాస్తవానికి ఈ రైలు మార్గాన్ని ముందు.. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు 45.30 కిలోమీటర్లు మాత్రమే అనుకున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పలు సందర్భాల్లో రైల్వే మంత్రిని కలిసి రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ లైన్‌ను బాపట్ల వరకూ ఈ లైన్‌ను పొడిగిస్తే.. మచిలీపట్నం పోర్టుకు రాకపోకల విషయంలో ప్రయోజనాలు ఉంటాయని రైల్వే మంత్రిని కలిసి నివేదికలు అందజేశారు. దీంతో ఈ రైలు మార్గాన్ని బాపట్ల వరకు పొడిగించారు. మరో సెక్షన్‌ కింద 45.81 కిలోమీటర్ల లైన్‌ కోసం బాపట్ల వరకూ పొడిగించేందుకు సర్వేకు ఆదేశాలు జారీ చేశారు.

మచిలీపట్నం నుంచి రేపల్లె.. అక్కడి నుంచి బాపట్లకు వెళ్లే ఈ రైలు మార్గం భవిష్యత్తులో రవాణాలో కీలకంగా మారబోతోందన్నారు ఎంపీ బాలశౌరి. విజయవాడ రైల్వేస్టేషన్‌పైనా ట్రాఫిక్‌ భారం తగ్గుతుందని.. దివిసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షల మంది ప్రజలకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుందన్నారు. మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి కూడా ప్రధానంగా ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.

శ్రీశైలం, సాగర్‌ను ఖాళీ చెయ్యొద్దు

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు మాత్రమే వాడాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలను కోరింది.

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు మాత్రమే వాడాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలను కోరింది. 2025 వానాకాలం దాకా రిజర్వాయర్లలో నీటిని పొదుపుగా వాడుకోవాలని, జలవిద్యుత్‌ ఉత్పాదన చివరి ప్రాధాన్యంగా ఉండాలని సూచించింది. కేఆర్‌ఎంబీ సభ్యుడు డాక్టర్‌ ఆర్‌.ఎన్‌.శంకువ ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలకు వేర్వేరుగా లేఖలు పంపారు

. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అవసరమున్నా లేకున్నా పోతిరెడ్డిపాడు నుంచి ఇరువైపులా జలవిద్యుత్‌ ఉత్పాదనతో నీటిని దిగువకు వదులుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, సాగర్‌లో ప్రధాన కేంద్రంతో పాటు కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల్లో జల విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నారని తెలిపారు.

ఇలా పోటీ పడి తెలుగు రాష్ట్రాలు నీటి నిల్వలను దిగువకు వదులుతుండడంపై కేఆర్‌ఎంబీ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే జలవిద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయాలని, అవసరం లేకుండా ఇతర కాంపోనెంట్ల ద్వారా నీటి తరలింపును ఆపాలని కోరింది.

నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉండడంతో ఎగువ నుంచి వచ్చిన నీటిని అలాగే దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ లోనూ పూర్తి స్థాయి నిల్వలు ఉండడంతో ఎగువ నుంచి వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇలా నీరు వృథా అవుతున్న నేపథ్యంలో కేఆర్‌ఎంబీ తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

అమల్లోకి కొత్త రూల్స్

హైదరాబాద్‌ నగరంలోని వాహనదారులకు షాకింగ్ న్యూస్ వినిపించారు ట్రాఫిక్ పోలీసులు. మంగళవారం (నవంబర్ 05) రోజు నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టారు. అయితే.. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తున్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు.. జరిమానాలు భారీగా పెంచేయటమే కాకుండా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇక నుంచి హెల్మెట్ పెట్టుకోకపోయినా, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపినా వాహనదారులకు జేబులు గుల్ల కావటం గ్యారెంటీ.

హైదరాబాద్‌లోని వాహనదారులకు బిగ్ అలెర్ట్. ఇక నుంచి హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా.. అర్జెంట్ పనుందనో, ఇక్కడే కదా అనో రాంగ్ రూట్‌లో వెళ్లినా.. మీ జేబుకు చిల్లు పడ్డట్టే. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం (నవంబర్ 05) నుంచి నగరంలో భారీ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల నగరాల్లో గత 3 రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒక మహిళతో సహా ముగ్గురు మృత్యువాత పడ్డట్టుగా అడిషినల్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ వివరించారు. ఈ ప్రమాదాల్లోని మూడింటిలో.. బాధితులు ఐఎస్‌ఐ స్టాండర్డ్ హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వాహనదారులు హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేటి నుంచే హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు చేస్తున్నారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే రూ.200లకు వాహన జరిమానాను పెంచుతున్నట్టు పోలీసులు తెలిపారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే రూ.2 వేలకు వాహన జరిమానా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ నగరంలో రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్ట్‌ సీరియస్‌ అయిన నేపథ్యంలో.. ట్రాఫిక్ పోలీసులు ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది ఇప్పటివరకు 215 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయని.. అందులో 100 మంది బాధితులు ద్విచక్ర వాహనదారులేనని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇది మొత్తం మరణాల్లో 46 శాతమని పోలీసులు పేర్కొన్నారు. అందులోనూ వారు హెల్మెట్ ధరించకపోవడం వల్లే మరణించినట్టుగా తేలినట్టు వివరించారు. హెల్మెట్ ధరించడం వల్ల తలకు గాయమయ్యే ప్రమాదాన్ని 70 శాతం, మరణాల ప్రమాదాన్ని 40 శాతం తగ్గిస్తుందని విశ్వప్రసాద్ తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాపాయ ప్రమాదాలు 3 రెట్లు పెరుగుతాయని వివరించారు.

మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం హెల్మెట్ ధరించని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉల్లంఘనలకు సెక్షన్లు, జరిమానాలు ఇవే..:

హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం MV చట్టంలోని సెక్షన్ 129/177 ప్రకారం ఉల్లంఘన

హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినవారికి రూ.200 జరిమానా

MV చట్టంలోని సెక్షన్ 119/177 , 184 ప్రకారం రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్ చేయడం శిక్షార్హం

రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసినవారికి రూ.2000 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్