విజేత ఎవరనేది ఎప్పటికి తెలుస్తుంది
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరిగాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డారు. పోటాపోటీగా జరిగిన ఈసారి ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడడానికి చాలా సమయం పట్టొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరిగాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నువ్వా-నేనా అన్నట్టుగా తలపడ్డారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడడానికి చాలా సమయం పట్టొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొన్ని రోజుల సమయం కూడా పట్టొచ్చని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తన పార్టీ శ్రేణులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు సమయాల్లో (కాలమానాలను బట్టి) ఓట్ల లెక్కింపు జరుగుతుండడం ఈ ఆలస్యానికి ఒక కారణం కానుంది. అందుకే ముగింపు ఫలితం చాలా ఆలస్యంగా వెలువడనుందని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ఓట్లను లెక్కిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసే వరకు వేచి ఉంటారు. అయితే మరికొన్ని రాష్ట్రాల్లో బ్యాలెట్లు సమర్పించిన వెంటనే కౌంటింగ్ మొదలుపెడతారు. అందుకే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల ప్రకటనలు వేర్వేరు సమయాల్లో వెలువడుతుంటాయి. మన దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగా కాకుండా అమెరికాలో రాష్ట్రాల ఎన్నికల సంఘాలే ఓట్లను లెక్కిస్తాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య (భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 -సాయంత్రం 4.30) విస్కాన్సిన్, మిచిగాన్‌ల రాష్ట్రాల్లో చాలా ఫలితాలు వెలువడనున్నాయి. ఇక పెన్సిల్వేనియా, అరిజోనా, నెవాడాల్లో అప్పటికి కొన్ని ఫలితాలు మాత్రమే వస్తాయి.
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతి ఓటు కోసం ప్రచారం చేశారు. ప్రత్యేకించి ఎన్నికల రణక్షేత్రాలుగా భావించిన అరిజోనా, నెవాడా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా స్వింగ్ రాష్ట్రాల్లో హోరాహోరీగా పోరాడారు. దీంతో ఓట్ల లెక్కింపు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అధికార డెమోక్రాటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ వందలాది మంది న్యాయవాదులు, వేలకొద్దీ వాలంటీర్లను ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మోహరించాయి. అవసరమైతే న్యాయ పోరాటాలు చేయడానికి న్యాయవాదులను సిద్దంగా ఉంచుతారు.
కాబట్టి ఎన్నికల ఫలితాలు చాలా రోజుల వరకు తెలియకపోవచ్చని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన పరిశీలకులు డిల్లాన్ పేర్కొన్నారు. పూర్తి ఫలితాల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాలని అన్నారు. బుధవారం రోజు తర్వాత అన్ని రాష్ట్రాల ఫలితాలు ఆశించవచ్చని డిల్లాన్ అన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అప్రమత్తం చేశారు. పెన్సిల్వేనియా, అరిజోనా, నెవాడా, మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బుధవారం తర్వాత కూడా కొన్ని ఫలితాలు రావొచ్చని పేర్కొన్నారు. ‘‘నెవాడాలో నవంబర్ 9 వరకు బ్యాలెట్‌లు వస్తాయి’’ అని పేర్కొన్నారు.
Nov 06 2024, 15:06