ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైలు మార్గం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైలు మార్గానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ను బాపట్ల వరకు పొడిగించారు. తాజాగా ఆ రైల్వే లైన్‌ను రేపల్లె నుంచి బాపట్ల వరకు పొడిగించారు. రేపల్లె నుంచి బాపట్ల వరకూ 45.81 కిలోమీటర్ల మరో సెక్షన్‌గా తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఈ లైన్ సర్వే కోసం రూ.1.15 కోట్లను మంజూరు చేసిన రైల్వే బోర్డు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైలు మార్గానికి లైన్ క్లియర్ అయ్యింది. మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల కొత్త రైల్వేలైన్‌కు కీలక ముందడుగు పడింది. మొత్తం 45.81 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన లైన్‌కు సంబంధించిన ఎఫ్‌ఎల్‌ఎస్ (ఫైనల్ లొకేషన్ సర్వే) చేపట్టేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలపగా.. ఆదేశాలు జారీ అయ్యాయి. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు 45.30 కిలోమీటర్ల రైలు మార్గాన్ని ఒక సెక్షన్‌గా.. రేపల్లె నుంచి బాపట్ల వరకూ 45.81 కిలోమీటర్ల లైన్ మరో సెక్షన్‌గా తీసుకున్నారు. ఈ మేరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం సర్వే చేపట్టి.. డీపీఆర్ తయారీకి రైల్వేబోర్డు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేసింది. సర్వేకు సంబంధించి.. మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ కోసం రూ.1.13 కోట్లు.. రేపల్లె-బాపట్ల లైన్ కోసం రూ.1.15 కోట్ల నిధులను రైల్వేబోర్డు మంజూరు చేసింది. వాస్తవానికి మచిలీపట్నం-రేపల్లె మధ్య చేపట్టబోయే 45.30 కిలోమీటర్ల కొత్త రైల్వేలైనుకు సంబంధించి ఆగస్టులో ఎఫ్‌ఎల్‌ఎస్ కోసం రైల్వేబోర్డు ఆదేశాలిచ్చింది.
తాజాగా రేపల్లె నుంచి బాపట్లకు కొత్త లైన్ వేసేందుకు ఉత్తర్వులు వచ్చాయి.
మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ కోసం ఎప్పటి నుంచో కలగా మిగిలింది. ఈ రైలు మార్గం కోసం గతంలో ఆందోళను కూడా జరిగాయి.. చివరికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారి కల నెరవేరబోతోంది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. విజయవాడతో సంబంధం లేకుండా మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల లైన్ ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుంది. ఈ రైల్వే మార్గం మచిలీపట్నం పోర్టుకు సరకు రవాణాలో కీలకం కాబోతోంది. ఈ లైన్ నేరుగా హౌరా-చెన్నై ప్రధాన రైల్వే మార్గంతో అనుసంధానం కావడంతో 50 నుంచి 100 కిలోమీటర్ల వరకూ దూరం కూడా తగ్గుతుంది అంటున్నారు.
వాస్తవానికి ఈ రైలు మార్గాన్ని ముందు.. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు 45.30 కిలోమీటర్లు మాత్రమే అనుకున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పలు సందర్భాల్లో రైల్వే మంత్రిని కలిసి రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ లైన్‌ను బాపట్ల వరకూ ఈ లైన్‌ను పొడిగిస్తే.. మచిలీపట్నం పోర్టుకు రాకపోకల విషయంలో ప్రయోజనాలు ఉంటాయని రైల్వే మంత్రిని కలిసి నివేదికలు అందజేశారు. దీంతో ఈ రైలు మార్గాన్ని బాపట్ల వరకు పొడిగించారు. మరో సెక్షన్ కింద 45.81 కిలోమీటర్ల లైన్ కోసం బాపట్ల వరకూ పొడిగించేందుకు సర్వేకు ఆదేశాలు జారీ చేశారు.
మచిలీపట్నం నుంచి రేపల్లె.. అక్కడి నుంచి బాపట్లకు వెళ్లే ఈ రైలు మార్గం భవిష్యత్తులో రవాణాలో కీలకంగా మారబోతోందన్నారు ఎంపీ బాలశౌరి. విజయవాడ రైల్వేస్టేషన్‌పైనా ట్రాఫిక్ భారం తగ్గుతుందని.. దివిసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షల మంది ప్రజలకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుందన్నారు. మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి కూడా ప్రధానంగా ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.
Nov 06 2024, 11:21