/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ గా జిల్లా రాములు Mane Praveen
NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ గా జిల్లా రాములు

దేవరకొండ: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ స్థానిక కార్యాలయంలో ఆ సంఘం నాయకులు సాధారణ సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు నియోజకవర్గ కన్వీనర్ గా జిల్లా రాములు నియమిస్తూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, జిల్లా కన్వీనర్ మద్దిమడుగు బిక్షపతి నియామక పత్రాన్ని అందజేశారు.

జిల్లా రాములు మాట్లాడుతూ.. డా. బి ఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఈ సంస్థని పూర్తిస్థాయిలో విస్తరింపచేస్తానని అన్నారు. మహిళా ఉపాధ్యక్షురాలు నక్క శోభారాణి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత స్థాపించిన ఈ సంస్థని డివిజన్ స్థాయిలో అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

జిల్లా నాయకులు గా ధర్మపురం శీను, ఉపాధ్యక్షులు గా చేపురి రాజేష్, సహాయ కార్యదర్శిగా కండేల వెంకన్న, ఊరే సురేష్, ప్రధాన కార్యదర్శిగా సోషల్ మీడియా డివిజన్ కార్యదర్శిగా వస్కుల అనిల్ నియమితులయ్యారు.

కార్యక్రమంలో చేకూరి రాజేష్, కండేల వెంకన్న, ఊరే సురేష్ వస్కుల అనిల్, మద్దిమడుగు నరేందర్, రాజ్ కుమార్, యేసు బాబు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

NLG: కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి ఆర్ధిక సహాయం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: ఇటీవల దసరా పండుగ రోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన
కొండూరు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ జరుపుల బిచ్య నాయక్ కుటుంబసభ్యులను బుధవారం పలువురు పరామర్శించారు.

ఈ మేరకు బండి శేఖర్ గౌడ్ రూ.11 వేలు, మాజీ ఎంపిటిసి మారగోని వెంకటయ్య రూ.10 వేలు, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు వల్లపు సైదులు యాదవ్ రూ.5 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం పట్ల గ్రామస్తులు అభినందిస్తున్నారు. బండి జహంగీర్, బడేటి జంగయ్య, ఈద కృష్ణ, గూడూరు సలార్జాన్, రాములు, దుబ్బ గిరి, వల్లపు మల్లేష్, బండి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎన్.జి కళాశాల పి జి ఫలితాలు విడుదల
నల్లగొండ:నాగార్జున ప్రభుత్వ కళాశాల  పిజి 2వ, 4వ సెమిస్టర్ మరియు 1వ, 3వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ ఫలితాలను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా. జి. ఉపేందర్ రెడ్డి బుధవారం విడుదల చేశారు.

ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ఎమ్మెస్సీ, ఎం.కాం, ఎం.ఏ లకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశామని, ఫలితాలను నాగార్జున కళాశాల పరీక్షల విభాగం వెబ్ సైట్ లో చూడవచ్చని తెలిపారు.

ఫలితాలను నాగార్జున కళాశాల పరీక్షల విభాగం వెబ్ సైట్ లో చూడవచ్చని తెలిపారు.

కార్యక్రమంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి బి. నాగరాజు, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డా. వైవిఆర్ ప్రసన్నకుమార్, డా. వెల్దండి శ్రీధర్, అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్ పాల్గొన్నారు.
హాస్పిటల్స్‌ లో క్లినికల్, నాన్ క్లినికల్ స్టాఫ్ ప్యాటర్న్ ఉండాలి: ఆరోగ్యశాఖ మంత్రి
HYD: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) హాస్పిటళ్ల పనితీరు, టీవీవీపీ ని సెకండరీ హెల్త్ కేర్‌ డైరెక్టరేట్‌ గా బలోపేతం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) రూపొందించిన ప్రతిపాదనలపై వైద్య,  ఆరోగ్యశాఖ మంత్రి దామోదర  రాజనర్సింహ రివ్యూ సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, అధికారులు శ్రీనివాస్, పద్మజ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి) కన్సల్టంట్స్‌ సుబోధ్‌, వీరభద్రయ్య, శ్రీదేవి, అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.

వీవీపీని సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా మార్చడం కోసం రూపొందించిన ప్రతిపాదనలపై ఆస్కి కన్సల్టంట్స్‌ మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీవీవీపీ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా హాస్పిటళ్లలోనే ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయా హాస్పిటళ్లలో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రస్తుత అవసరాలకు మాత్రమే కాకుండా, భవిష్యత్ అవసరాలు, ఓపీ, ఐపీ, బెడ్‌ స్ట్రెంత్‌ ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని సూచించారు.

ఇండియన్ పబ్లిక్ హెల్త్‌ స్టాండర్డ్స్‌ (ఐపీహెచ్‌ఎస్‌) ప్రకారం హాస్పిటల్స్‌లో క్లినికల్, నాన్ క్లినికల్ స్టాఫ్ ప్యాటర్న్ ఉండాలన్నారు. ఈ మేరకు అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డాక్టర్లు, ఇతర ఉద్యోగుల ప్రమోషన్లు, ఇతర సర్వీసు మ్యాటర్స్‌లో ఇబ్బందులు, లీగల్ చిక్కులు తలెత్తకుండా ప్రతిపాదనలు ఉండాలన్నారు.


దానా' తుపాను ఎఫెక్ట్‌.. 41 రైళ్లు రద్దు
సికింద్రాబాద్‌: 'దానా' తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది.మొత్తం 41 రైళ్ల ను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో సర్వీసులందించే పలు రైళ్ల ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

రద్దు చేసిన రైళ్ల వివరాలు 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. రద్దయిన రైళ్లలో ఎక్కువగా భువనేశ్వర్‌, ఖరగ్‌పుర్‌, పూరీ తదితర చోట్ల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లే అధికంగా ఉన్నాయి.

దానా తుపాను ప్రభావంతో అక్టోబర్‌ 23 నుంచి ఒడిశాలోని తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వర్షాలు కురుస్తాయని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం అధికారులు ఇటీవల వెల్లడించారు. సముద్రంలో కెరటాల ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
NLG: కంఠమహేశ్వర స్వామి దేవాలయం చుట్టూ సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన వెన్ రెడ్డి రాజు
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డు 14వ వార్డులో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం చుట్టూ నిర్మించే సిసి రోడ్డు నిర్మాణం పనులను మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మంగళవారం ప్రారంభించారు.

అదేవిధంగా రోడ్డు నంబర్ 3,గణేష్ నగర్ కాలనిలో డ్రైనేజీ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, స్థానిక కౌన్సిలర్ సంధగల్ల విజయ్ సతీష్, బాబా షరీఫ్, కొయ్యడ సైదులు, కంఠమయ గుడి ఉపాధ్యక్షులు చెవ్వగోని వెంకటేష్, నాయకులు ఊడుగు శ్రీనివాస్, మునుకుంట్ల సత్యనారాయణ, రమేష్,వర్కాల రవి, ఉడుగు మల్లేష్, ఉష్కాగుల నాగరాజు, తొర్పునూరి బాబు, ఊడుగు ఇస్తారి, బొంగు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
NLG: రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు హామీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
రీజనల్ రింగ్ రోడ్డు వల్ల తమ భూములు కోల్పోతున్న చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు మరియు భువనగిరి నియోజకవర్గం లోని రాయగిరి ప్రజలు, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు, ఇవాళ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని హైదరాబాదులోని తన నివాసంలో కలిసి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో తమ భూములు కోల్పోతున్నామని.. ప్రభుత్వంతో మాట్లాడి అలైన్మెంట్ మార్పించాలని లేదా బహిరంగ మార్కెట్ విలువ ద్వారా పరిహారమైనా చెల్లించాలని కోరారు.

ఈ సమస్య తన దృష్టిలో ఉందని త్వరితగతిన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను చర్చిస్తానని రీజినల్ రింగ్ రోడ్డు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి  బాధితులకు హామీ ఇచ్చారు.
NLG: న్యాయం కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష.. అసలు ఏం జరిగిందంటే!

నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డు సమీపంలో రావిరాల శ్రీనివాస్, రావిరాల సత్యం అన్నదమ్ములు ఇద్దరు కలిసి నిర్మించుకున్న ఇల్లు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విక్రయించారు. కొనుగోలుదారు కొంత మొత్తం డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు విక్రయించిన అన్నదమ్ముల కుటుంబీకులు తెలిపారు.

సంవత్సరం గడిచినా మిగిలిన డబ్బులు చెల్లించకుండా కొనుగోలుదారు తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుకుంటున్నారు.

ఈ దీక్షా కార్యక్రమంలో జై సూర్య, ఊమేష్, హేమ, కోనం రవి తదితరులు పాల్గొన్నారు.

NLG: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్

నల్లగొండ జిల్లా:

చింతపల్లి వ్యవసాయ మార్కెట్లో స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్, సోమవారం పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు, సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ నక్క శ్రీను యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

NLG: డిసెంబర్ 20, 21 తేదీలలో నల్లగొండలో జాతీయ సదస్సు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అర్థ శాస్త్ర విభాగంలో డిసెంబర్ 20, 21 తేదీలలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం  తమ కార్యాలయంలో అధ్యాపకులతో కలిసి సదస్సు బ్రోచర్ ను విడుదల చేశారు.

ఈ మేరకు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ‘స్థిరమైన అభివృద్ధి – అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై జరిగే ఈ జాతీయ సదస్సులో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి, వివిధ విశ్వవిద్యాలయాల నుండి అకాడమిషియన్లు, ఆర్థికవేత్తలు, ప్రొఫెసర్లు, వివిధ కళాశాలల అధ్యాపకులు పరిశోధక విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగు ఈ సదస్సులో జిల్లాలోని అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు.

ఆసక్తి గల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు తగిన రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకొని సదస్సులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్,  వైస్ ప్రిన్సిపాల్ డా. పిల్లి సురేష్ బాబు, సదస్సు కన్వీనర్ డా. డి. మునిస్వామి, నిర్వాహక సంచాలకులు ఎ. మల్లేశం, పరీక్షల నియంత్రణాధికారి బి. నాగరాజు, ఎన్ సి సి ఆఫీసర్ సిహెచ్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. అనిల్ బొజ్జ, ఎన్. కోటయ్య, తెలుగు విభాగం అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, చరిత్ర విభాగం అధ్యక్షులు డా. భట్టు కిరీటం, తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.