/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz అరూరు లో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత Vijay.S
అరూరు లో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని  అరూరు గ్రామంలో పురమ కృష్ణ అనారోగ్యం కారణాల వల్ల మరణించాడు, కృష్ణ కుటుంబానికి ఆదివారం రూ.10000/- పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని Ex.ZPTC వాకిటి పద్మ అనంత రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో DCC ఉపాధ్యక్షులు అనంత రెడ్డి, వాకిటి శరత్ పవన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, జనరల్ సెక్రటరీ కోడితల కరుణాకర్,సుంకిశాల పరమెశ్,పోలెపాక నరసింహ,దమెర అంజయ్య, M. ముత్యాలు , జకిడి నర్సిరెడ్డి,రేఖ మచి, కసరబోయిన మహేష్,K.మధు ,ch.సీను,పోలెపాక చెమ్మయ, బుర్ర శ్రీను,కాదరి నరేష్,J.రాజు,M.గణేష్,నల సత్తయ్య, వేముల ఎట్టయ్య, వేముల నరసింహ, వేముల రమేష్,B.రాజు,జినుకల దానయ్య,ఫకీర,అజగర్,P.రమేష్,P.మహేష్, వేముల చిన నరసింహ,ch.ఉపేందర్,రెబస్ నరేష్,జోలం సిద్ధయ్య మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉత్తమ జర్నలిస్టుగా సేవ రత్న అవార్డును అందుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా స్టాపర్ గుర్రాల నాగరాజు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,డిజిటల్ మీడియా సంస్థలలో పనిచేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ..ప్రజల సమస్యలపై పలు ప్రత్యేక కథనాలు రాస్తూ, సామాజికంగా, రాజకీయంగా ప్రజలను ,యువతని చైతన్యపరుస్తూ సేవలు అందిస్తున్నందుకు ఎస్ఎల్పి చారిటబుల్ ట్రస్ట్ ,ఎస్జెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని చిక్కడ పల్లి త్యాగరాయ కళా భవనంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న ,హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్టుగా సేవ రత్న అవార్డును అందుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా చాడ గ్రామానికి చెందిన , యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా స్టాపర్ గుర్రాల నాగరాజు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, గ్రామస్తులు నాగరాజుకు అభినందనలు తెలియజేశారు.

భువనగిరి లొ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా.... భువనగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జన్మదిన సందర్భంగా, భువనగిరి బాబు జగ్జీవన్ రావ్ చౌరస్తా వద్ద, జన్మదిన వేడుకలు, కుమ్మరి వినాయకుని గుడి వద్ద పూజలు నిర్వహించి, ఏరియా హాస్పిటల్, పండ్లు,బ్రెడ్లు, పంపిణీ కార్యక్రమం, రైతు బజార్ వద్ద, రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం, అనంతరం కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపిన, నాయకులు . ఈ కార్యక్రమంలో,BRS పార్టీ అధ్యక్షులు, కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్, ఎనబోయిన ఆంజనేయులు, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్, జడల అమరేందర్ గౌడ్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు, కొలుపుల అమరేందర్, జిల్లా నాయకులు, ఎడ్ల సత్తిరెడ్డి, జడ్పిటిసి, బీర్ మల్లయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు, ఏవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి, రచ్చ శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు,కార్యదర్శులు, జనగాం పాండు, ఓం ప్రకాష్ గౌడ్, ఎంపీటీసీలు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
భువనగిరి పట్టణంలోని 8వ వార్డులో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం

స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒకరూ భాగస్వామ్యం కావాలనిజమఖానగూడెము.సీతానగర. రాంనగరమున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం బోనగిరి హ లో కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఏర్పాటు చేసిన వన మహోత్సవానికి ఆయన హాజరై మొక్కలను నాటారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వార్డ్ ఇన్చార్జి శబయొద్దీన్,సబితగోపాల్ బర్రె జాంగిర్, ముస్లిం సోదరులు ఆర్ .పి దనలక్ష్మీ ,పావని అంగన్వాడి టీచర్ నాగమ్మ ఏఎన్ఎం సిస్టర్స్ పాల్గొన్నారు.

AISF ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని విజేత కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జీవిత చరిత్ర వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భ వేడుకలను పురస్కరించుకొని ఈ వ్యాసరచన పోటీలు పెట్టడం జరుగుతుందన్నారు. దేశ స్వాతంత్రం కోసం చిన్నవయసులోనే వీరమరణం పొందిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని, భారతరత్న అవార్డు ఇవ్వాలని శాంతి కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. 89 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా, విద్యారంగల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. వ్యాసరచన పోటీ లో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు చింతపల్లి అరుణ్,అనిల్ రెడ్డి రమేష్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

సాగర్ లో నేటి నుంచి క్యాట్ -కో దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలి: కొడారి వెంకటేష్, వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు

తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (CATCO) పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆగస్టు 10, 11, తేదీల్లో నలగొండ జిల్లా నాగార్జునసాగర్ లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించే వర్క్ షాప్ ను విజయవంతం చేయాలని వినియోగదారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రాష్ట్రంలోని వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, నూతనంగా వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయాలనుకునే వారు హాజరగుతారని ఆయన అన్నారు. రెండు రోజులపాటు జరిగే వర్క్ షాప్ లో "నూతన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం -2019", ఆహార భద్రత చట్టం, తూనికల కొలతల శాఖలో వచ్చినటువంటి మార్పులు- చేర్పులు, ఐఎస్ఐ, బిఐఎస్ , హాల్ మార్క్, ఆగ్ మార్క్, సిల్క్ మార్క్, తదితర నాణ్యతా ప్రమాణాల చిహ్నాల గురించి, రేర (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్) , సంబంధిత శాఖల అధికారులు వివరిస్తారని ఆయన తెలిపారు. వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, వినియోగదారుల సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారని ఆయన అన్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే వారు, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు సెల్ నెంబర్ : 9440134610. 9059188199 లను సంప్రదించాలని ఆయన కోరారు.
గోల్నే పల్లి అంగన్వాడి కేంద్రంలో రక్తహీనత పై అవగాహన , శుక్రవారం మహాసభ


యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి మేడం మాట్లాడుతూ మాట్లాడుతూ రక్తహీనత పై అవగాహన కల్పించారు ప్రతి గర్భిణీ స్త్రీ కి బాలింతలకు రక్తహీనత లేకుండా మంచి పౌష్టిక ఆహారము తీసుకోవాలని ఆకుకూరలు పప్పు మునగాకు యూస్ చేయాలని రాగి జావా అని డిమాండ్ స్టేషన్ గా చేయించారు ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ పల్లి పట్టి బెల్లం ఆకుకూరలు తినాలని సూచించారు ఏడు నెలలు నిండిన పిల్లలకు ఖచ్చితంగా అన్నప్రాసన చేయాలని సూచించారు బరువు తక్కువ పిల్లల గురించి వయసుకు తగిన ఎత్తు ఎత్తుకు తగిన బరువు ఉండేలా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సరైన పోషక ఆహారము వారికి అందించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డి డబ్లూ కృష్ణవేణి, మేడం సూపర్వైజర్ పారిజాత,స్కూల్ హెడ్మాస్టర్ కళావతి మేడం, అంగన్వాడీ టీచర్స్ ఇందిరా భాగ్యలక్ష్మి వసంత, ఆశా వర్కర్స్ సుష్మ,గిరిజ పాల్గొన్నారు.

వలిగొండ: నాగారం లో మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ  మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన యువకుడు మంగ వినయ్ (25) అనారోగ్యంతో మృతి చెందగా అతని కుటుంబ సభ్యులకు అదే గ్రామానికి చెందిన గోళ్ల పెద్ద భిక్షం ఒక క్వింటాల్ బియ్యాన్ని శుక్రవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి బెలిదే నాగేశ్వర్, గోళ్ల అవినాష్,పాలెర్ల మహేష్, గోళ్ల ప్రవీణ్,మైసోళ్ల వెంకటేష్, గోళ్ల నవీన్,గోళ్ల శ్రీనివాస్, గోళ్ల విక్రమ్,తదితరులు పాల్గొన్నారు
గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి: కల్లూరి మల్లేశం సిఐటియు జిల్లా కార్యదర్శి

గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, కనీస వేతనం జిఓ నంబర్ 60 ప్రకారం 18 వేలు ఇవ్వాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (CITU) జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ,గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ళ గణపతి రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (CITU) రాష్ట కమిటీ ఇచ్చిన ఒక్క రోజు సమ్మె పిలుపులో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలో MPDO కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో తాతల కాలం నుండి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నప్పటికీ నేటికి ప్రభుత్వ ఉద్యోగులుగా గ్రామ పంచాయితీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గా రెగ్యులర్ చేయలేదని వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.గత సంవత్సరం సమస్యల పరిష్కారం కోసం 34 రోజులు చేసిన సమ్మె చేసిన సందర్భగా , ఎన్మికల మేనిపొస్టెలో సైతం రేవంత్ రెడ్డి గారు గ్రామపంఛాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ,ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని ,సమ్మె కాలపు వేతనం నేటికి ఇవ్వలేదని సమ్మె కాలపు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.పది లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , విధినిర్వహణలో చనిపోయిన కార్మికుని కుటుంబం లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె కార్యక్రమానికి సిపియం మండల కార్యదర్శి వేముల భిక్షం , సిపిఐ జిల్లా నాయకులు ఉప్పల ముత్యాలు ప్రజాసంఘాల నాయకులు మద్దత్తుతెలియజేసి మాట్లాడారు.ఈ కార్యక్రంలో గ్రామ పంచాయితీ యూనియన్ మండల అధ్యక్ష ,కార్యదర్శులు కూరెళ్ళ కిష్టయ్య , ఇంద్రపెళ్లి జ్ఞానేశ్వర్ , మండల గౌరవాధ్యక్షులు నోముల స్వామి , ఉపాధ్యక్షులు శ్రీను ,కోశాధికారి సుదగాని రమేష్ ,సహాయకార్యదర్శి కూరెళ్ళ సైదులు ,నాయకులు కవిత ,నర్సిరెడ్డి , తాల్లపల్లి నరసింహ ,చారి తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయాలి : తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి

ఎలాంటి షరతులు లేకుండా రైతుల రుణమాఫీ అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున ఆత్మకూరు మండలంలోని పల్లెర్ల గ్రామంలో జరిగిన రైతు సంఘం మండల ముఖ్యుల సమావేశంలో చంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమం నేటికీ 40 శాతం లోపు రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన షరుతులను ఎత్తేసి రుణమాఫీకి కావలసిన 31 వేల కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదలచేయాలని అన్నారు. రేషన్ కార్డులు, ఐటీ రిటర్న్స్, రీ షెడ్యూల్ లాంటి నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు సంవత్సరానికి 15వేల రూపాయలు రైతు భరోసా కింద వేస్తానని చెప్పినట్లుగా వెంటనే వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక రబీ సీజన్లో వేయాల్సిన రైతు భరోసా డబ్బులను వేయలేదన్నారు. అదే విధంగా ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమై మధ్యలోకి వచ్చిందన్నారు. ఈ రెండు సీజన్ల డబ్బులను రైతుల ఖాతాల్లో త్వరితగతిన జమ చేయాలని అన్నారు. ఇట్టి సమావేశానికి నాయిని కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా వృత్తిదారుల మండల కన్వీనర్ వేముల బిక్షం, రైతు సంఘం మండల నాయకులు నాయిని రాంరెడ్డి, నాయిని యాదిరెడ్డి, గున బోయిన స్వామి, జినుకల బిక్షం, ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు.