కేరళ బాధితులకు సహాయాన్ని అందించి అండగా నిలవండి : సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి
![]()
ప్రకృతి వైపరీత్యంతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి మరణించిన 300 పైగా కుటుంబాలకు మరియు గాయాలపాలై వైద్యాన్ని అందుకుంటున్న క్షతగాత్రులకు,నిరాశ్రయులకు అండగా నిలిచి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి కోరారు సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం రోజున పులిగిల్ల గ్రామంలో కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ దేశంలో పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి కేరళను ప్రకృతి వైపరీత్యాలతో కురుస్తున్న అకాల వర్షం కారణంగా వయనాడ్ ప్రాంతంలోని ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేసిందన్నారు సుమారు 300 పైగా ప్రజలు ఇప్పటికే మరణించారని అనేకమంది గాయాలతో ప్రాణాలను కాపాడుకున్నారని అనేకమంది తమ ఇండ్లను కుటుంబాలను కోల్పోయి నిరాశ్రయులై ఉన్నారని వారందరికీ అండగా నిలవాల్సిన అవసరం ప్రస్తుత సమయంలో ఉందని వారిని ఆదుకునేందుకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా ఈనెల 4,5 తేదీల్లో విరాళాల సేకరణ నిర్వహించాలని పిలుపునిచ్చిందన్నారు ప్రజలను ఆదుకునేందుకు కేరళ రాష్ట్ర వామపక్ష ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందన్నారు, కష్ట కాలంలో ఉన్న కేరళ రాష్ట్రాన్ని బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని ఆయన అన్నారు ఇప్పటికే అనేకమంది సినీ నటులతో పాటు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటించిందని ప్రజలందరూ మానవతా దృక్పథంతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని తమకు వీలైన మేరకు ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు సిపిఎం పార్టీ సేకరించిన విరాళాలను జిల్లా రాష్ట్ర కమిటీల ద్వారా కేరళ బాధితులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి,సిపిఎం నాయకులు దొడ్డి బిక్షపతి, వడ్డమాని వెంకటయ్య, కొమ్మిడి సత్తిరెడ్డి,ఈర్ల రమేష్,మారబోయిన ముత్యాలు,వడ్లకొండ శంకరయ్య,బొడ్డు రాములు,వడ్డేమాన్ మధు,వేముల నాగరాజు, వరికుప్పల శంకరయ్య, వేముల అనిల్, వేముల నర్సింహ,వరికుప్పల బాబు,వేముల టెండూల్కర్,వేముల జ్యోతి బాబు,దయ్యాల నరసింహ,వనం యాదయ్య,దశరథ తదితరులు పాల్గొన్నారు.
![]()


ఈనెల 10, 11న భువనగిరి పట్టణంలో జరిగే ఆవాజ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆత్మకూరు మండల కేంద్రంలో కరపత్రాల విడుదల. శనివారం రోజున ఆత్మకూరు మండలంలో ఆవాజ్ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని అవాజ్ నాయకులు కరపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్ S.K లతీఫ్ మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్ (దివ్య) లో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు శిక్షణ తరగతులు లౌకిక వాద ప్రజాతంత్ర శక్తులు ఈ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని సమాజం ఐక్యంగా నిలపడం కొరకు దేశ ఐక్యతను చాటే విధంగా ఉంటాయని శిక్షణ తరగతుల మొదటి రోజున ముస్లిం స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను భువనగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో యువతి యువకులు ప్రజాతంత్ర వాదులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో MD అజీమోద్దీన్ MD మోలిసాహబ్ MD జమాల్ MD రంdజాన్ MD హారున్ వృత్తి సంఘం మండలం కన్వర్ వేముల బిక్షం తదితరులు పాల్గొన్నారు,
యాదాద్రి భువనగిరి జిల్లా : కారు ఢీ కొట్టడంతో తో వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండల పరిధిలోని నరసయ్య గూడెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వల్లపు నరసయ్య తన వ్యక్తిగత పనుల నిమిత్తం వలిగొండ కు వచ్చి తన టీవీఎస్ ఎక్సెల్ బండిపై తిరిగి వెళుతుండగా నరసయ్య గూడెం సమీపంలో రోడ్డు కల్వర్టు వద్ద కారు ఢీకొట్టడంతో తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.
Aug 04 2024, 16:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.2k