/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 4 వరుసల రహదారి.. ముగిసిన సర్వే, త్వరలోనే పనులు ప్రారంభం Raghu ram reddy
నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 4 వరుసల రహదారి.. ముగిసిన సర్వే, త్వరలోనే పనులు ప్రారంభం

తెలంగాణలో మరో రహదారి విస్తరణకు అధికారులు సిద్ధమయ్యారు. నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 4 వరుసల రహదారిని విస్తరించనున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు మెుదలుపెట్టారు. విస్తరణకు సంబంధించిన సర్వే పనులు పూర్తి కాగా.. ప్రజల నుంతి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అనంతరం విస్తరణ పనులు ప్రారంభించనున్నారు.

తెలంగాణలో రహదారుల విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. హైదరాబాద్-విజయవాడ హైవేను 4 నుంచి 6 వరుసలుగా విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్-బెంగళూరు హైవేను కూడా విస్తరించేందుకు ఫ్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో హైవే విస్తరణ పనులు చేపట్టనున్నారు. నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 63వ నెంబర్‌ నేషనల్ హైవే విస్తరణ చేపట్టనున్నారు. ఈ హైవే విస్తరణలో కీలకమైన అలైన్‌మెంట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. భూ సేకరణకు వీలుగా తాజాగా ప్రజాప్రాయ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

నిజమాబాద్ జిల్లా ఆర్మూర్‌ నుంచి జగిత్యాల మీదుగా ఈ హైవే విస్తరణ చేపట్టనున్నారు. మంచిర్యాల సెక్షన్‌ పరిధిలో 131.8 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా విస్తరించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మెట్‍‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ పట్టణాల నుంచి గతంలో సర్వే నిర్వహించారు. అయితే ఆ మార్గాల్లో దుకాణాలు, ఆలయాలు, జనావాసాలు ఉండటంతో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అధికారులు రహదారిని బైపాస్ చశారు. అందుకు సంబంధించిన సర్వే పనులు ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు రెడీ అయ్యారు.

నాలుగు వరుసల హైవే విస్తరణ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆగస్టు 5న లక్షెట్టిపేటలో ప్రజాభిప్రాయ సేకరణకు నిర్వహించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.ఎన్‌.అజయ్‌ మణి కుమార్‌ ఆధ్వర్యంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములతో పాటు ఫారెస్ట్ భూములు రహదారి భూ సేకరణలో ప్రభావితం కానున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక అంశాలను విస్తరణ ప్రాజెక్టు అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. వాటికి ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అభ్యంతరాలపై చర్చించనున్నారు.

ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతుల అనంతరం అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అన్ని సమస్యలు పరిష్కారం అయితే త్వరలోనే రహదారి విస్తరణ పనులు ప్రారభం కానున్నాయి. రహదారి పనులు పూర్తయితే పలు జిల్లాల్ల ప్రజలకు ఎంతో మేలు జరగనుంది.

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు.. జేపీ వెంచర్స్‌కు సుప్రీంలో షాక్

ఏపీలో ఇసుకను అక్రమంగా తవ్వేసిన కేసులో జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టులో బిగ్‌షాక్ తగిలింది. ఈ కేసులో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) రూ. 18 కోట్లు విధించడంపై జేపీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రూ. 18 కోట్ల జరిమానా నుంచి విముక్తి కల్పించాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు నిన్న విచారణ జరిపింది. ఈ అంశంపై తాజా నివేదికలతో ఏపీ ప్రభుత్వం, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అఫిడవిట్‌లు దాఖలు చేశాయి.

ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో తనిఖీలు జరిపామని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అఫిడవిట్‌లో పేర్కొంది. తనిఖీల్లో తేలిన విషయాలన్నీ కోర్టు ముందు ఉంచామని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు.

వరదల కారణంగా అక్రమ ఇసుక తవ్వకాల అనవాళ్లు కొట్టుకుపోయాయనీ, వాటిని తేల్చడానికి శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ చేపట్టాలని భావిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. శాస్త్రీయ అధ్యయనానికి కొన్ని సంస్థలను సంప్రదించామని, అన్నీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది. 

ఇసుక తవ్వకాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన జేపీ వెంచర్స్‌ను వదిలిపెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అక్రమ తవ్వకాలకు బాధ్యులైన ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని సస్పెండ్ చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.

తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసిన ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఏమి చేయాలన్నది ఆదేశిస్తామని తెలిపింది.

మినిమమ్‌’ బ్యాలెన్స్‌..!

కనీస నిల్వలు పాటించని సేవింగ్స్‌ అకౌంట్‌ ఖాతాదారుల నుండి బ్యాంక్‌లు జరిమానా పేరుతో భారీగా సొమ్ము వసూలు చేయడం దారుణం. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మినహా పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాల్లో కనీస నిల్వను నిర్వహించడంలో విఫలమైనందుకు ఖాతాదారుల నుండి రూ.2,331 కోట్లు వసూలు చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటుకు నివేదించింది.

అంతకు ముందు ఏడాది అంటే 2022-23లో రూ. 1,855 కోట్లు పిండుకోగా ఇప్పుడు 25.63 శాతం అదనంగా ఈ బ్యాంకులు గుంజుకున్నాయన్నమాట. గత మూడేళ్లలో కనీస నిల్వను నిర్వహించనందుకు ఖాతాదారుల నుండి రూ.5,614 కోట్లు వసూలు చేశాయి. ఈ విధంగా ఖాతాదారుల నుండి జరిమానా పేరిట డబ్బు అప్పనంగా కొట్టేయడం బ్యాంకులకు తగని పని. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలను ఉదారంగా మాఫీ చేస్తున్న బ్యాంకులు సామాన్యుల నుండి ఇలా గోళ్లూడగొట్టి వసూలు చేయడం అమానుషం.

బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బిఐ మాత్రం 2019-20 నుంచి కనీస బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయని ఖాతాదారులపై జరిమానా విధించడాన్ని నిలిపివేయడం కొంత ఊరట కలిగించే విషయం. ప్రభుత్వ రంగ బ్యాంకుల సంగతిలా వుంటే రకరకాల రూపాల్లో జనం సొమ్ము కొల్లగొట్టే ప్రయివేటు బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వలు ఉంచడంలో విఫలమైతే ఖాతాదారుల నుంచి భారీ మొత్తాలను వసూలు చేస్తున్నాయి. ఆ విధంగా బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతాదారుల నుండి ఈ రూపంలో సొమ్ము లూటీ చేయడం అమానుషం.

బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతా తెరిచేది పేదలు, సామాన్య మధ్యతరగతి వారేనని వేరుగా చెప్పనక్కరలేదు. అంతే కాదు! వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు, రాయితీలు పొందడానికీ బ్యాంకు ఖాతా తప్పనిసరి అంటూ జనం చేత వాటిని తెరిపించేది ప్రభుత్వ అధికారులు లేదా వాటి ప్రమోటర్లే కదా! నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాని అయిన సందర్భంలో విదేశాల్లోని నల్లధనాన్ని ప్రజల ఖాతాలో వేస్తామని సాగించిన భారీ ప్రచారాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ పాపంలో పాలకుల పాత్ర ఎంతుందో విదితమవుతుంది.

ఆనాటి జన్‌ధన్‌ ఖాతాల హడావుడి కూడా ఎవరూ మర్చిపోలేరు. ఒకవైపున సర్కారువారే ఖాతాలు తెరిపించి వాటికి అనుసంధానంగా ఇన్సూరెన్స్‌ కూడా జత చేసి ఆ ప్రీమియంను ఖాతాదారుల నుండి వసూలు చేసిన విషయం చాలా మందికి అసలు తెలియనే తెలియదు.

ఈ రూపంలో ఏటా ప్రీమియం కత్తిరింపు జరిగి కనీస నిల్వ తరిగిపోయిన ఖాతాదారులు కోకొల్లలు. ఇది కూడా బ్యాంకులు చేస్తున్న మరోవిధమైన లూటీయే కదా! పొదుపు ఖాతా నిర్వహణకు ఆ యా బ్యాంకులకు ఓవర్‌హెడ్స్‌ రూపంలో కొంత ఖర్చయ్యేమాట నిజమేకానీ వారు జరిమానా పేరిట గుంజుతున్నంత మొత్తమైతే అవ్వదన్నది నిర్వివాదాంశం.

అన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోతుండగా మరోవైపున ప్రజల ఆదాయాలు తరిగిపోతున్నాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ధరలు, నిరుద్యోగం అన్న రెండు ప్రధానాంశాలే ఇటీవలి సాధారణ ఎన్నికల్లో ప్రభావితం చేశాయని పలు సర్వేలు నిగ్గు తేల్చాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు బ్యాంకుల్లో పొదుపు చేయడం అనేది ఓ మిలియన్‌ డాలర్ల ప్రశ్న లాంటిది. ఏడాదికేడాది ప్రజల పొదుపు తరిగిపోతున్నదని కేంద్ర గణాంకాల సంస్థ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ప్రజల్లో పొదుపు పట్ల అవగాహన కలిగించి, ఆసక్తి పెంచడం బ్యాంకులు, అంతకు మించి ప్రభుత్వమూ చేపట్టవలసి వుంది. ఆ పని మానేసి కనీస ఖాతా నిల్వ లేదనో ఇంకో పేరుతోనో ప్రజలపై భారాలు వేస్తూ పోతే అసలు బ్యాంకు గడపనెక్కడానికే జనం భయపడే స్థితి దాపురించే ప్రమాదముంది.

2008లో ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం భారతదేశాన్ని అంతలా దెబ్బ తీయకపోవడానికి మన బ్యాంకింగ్‌ రంగమూ, ద్రవ్య నిర్వహణా వ్యవస్థల పటిష్టత ఒక ముఖ్య కారణమని విశ్లేషకులు నిర్ధారించారు. మన బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింతగా పటిష్టపరుచుకోవాలి. ఇంకా ఎక్కువ మందిని వాటి పరిధిలోకి తేవడం ఎంతో అవసరం. ప్రజల్లో పొదుపు పట్ల ఆసక్తి పెంచేందుకు తగు ప్రోత్సాహకాలివ్వాలి తప్ప బ్యాంకులు రకరకాల పేర్లతో జరిమానాలు విధించడం ఇప్పటికైనా మానుకోవాలి.

వయనాడ్ బాధితులకు న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల భారీ విరాళం!

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. జులై 26న వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా మృతిచెందారు. వందలాది మంది గాయ‌ప‌డ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటీనటులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. 

గత కొన్ని రోజులుగా పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న సహా పలువురు ప్రముఖులు రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించారు.

ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భ‌ర్త‌, కోలీవుడ్ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివన్ తమ వంతు సాయంగా రూ.20లక్షలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు.

ఈ సంద‌ర్భంగా ఈ జంట వారి ఇద్దరు కుమారులతో పాటు వయనాడ్‌లోని ప్రజల జీవితాలను పునర్నిర్మించడానికి తమ మద్దతును తెలియజేస్తూ ఒక లేఖ కూడా రాశారు.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విషాద‌క‌ర ఘ‌ట‌న‌ మా హృదయాలను క‌లిచివేసింది. సమాజం అనుభవించిన విధ్వంసం, నష్టాలు దయనీయంగా ఉన్నాయి. సంఘీభావంగా బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కోసం మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20లక్షలు అందిస్తున్నాము" అని లేఖ‌లో పేర్కొన్నారు. 

కాగా, నయనతార స్వస్థలం కేరళ. ఆమె తల్లిదండ్రులు ఓమన కురియన్, కురియన్ కొడియాట్టు కేరళలోని తిరువల్లలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు డయానా మరియం కురియన్‌గా ఆమె జన్మించారు.

ఇక విఘ్నేష్ శివన్, నయనతార దంప‌తులకు ఉలగ్, ఉయిర్ అనే కవల పిల్ల‌లు ఉన్నారు. ప్ర‌స్తుతం న‌య‌నతార న‌టించిన‌ రెండు తమిళ చిత్రాలు 'ది టెస్ట్స‌, 'మన్నంగట్టి సిన్స్ 1960' విడుద‌ల కావాల్సి ఉన్నాయి. అలాగే విఘ్నేష్ శివన్ ప్రస్తుతం తన దర్శకత్వంలో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

భూ రికార్డులపై కొత్త ఆర్వోఆర్‌..

భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్‌ సర్కారు సమాయత్తమైంది.

భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్‌ సర్కారు సమాయత్తమైంది. ఈ మేరకు భూ రికార్డుల నిర్వహణ కోసం ‘2024-ఆర్వోఆర్‌’ను తెచ్చేందుకు సంకల్పించింది. తద్వారా ధరణి పోర్టల్‌ స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్‌ను తెచ్చే చర్యలను వేగవంతం చేసింది. ఈ 2024-ఆర్వోఆర్‌ ముసాయిదా బిల్లును శుక్రవారం మంత్రి పొంగులేటి సభ ముందుంచారు. ప్రజలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు కొత్త ఆర్వోఆర్‌ బిల్లుకు తుదిరూపమిచ్చి సభలో ప్రవేశపెట్టనున్నారు. ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలను పరిష్కారించడంతో పాటు భవిష్యత్తులోనూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఈ కొత్త సమగ్ర ఆర్వోఆర్‌-2024 ముసాయిదాకు రూపకల్పన చేసింది

ఈ ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం విస్తృత ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. ఇందుకుగాను సీసీఎల్‌ఏ ఈ నెల 23 వరకు గడువు విధింది. ప్రజలు తమ అభిప్రాయాలను ఈ మెయిల్‌, లేదా పోస్టు ద్వారా తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. మొయిల్‌ ద్వారా అయితే ద్వారా తెలియజేయాలి. లేఖ ద్వారానైతే ల్యాండ్‌ లీగల్‌ సెల్‌, సీసీఎల్‌ఏ కార్యాలయం, నాంపల్లి, ేస్టషన్‌ రోడ్‌, అన్నపూర్ణ హోటల్‌ ఎదురుగా, ఆబిడ్స్‌, హైదరాబాద్‌ 500001 చిరునామాకు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. ముసాయిదా బిల్లుపై సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాత.. బిల్లుకు తుదిరూపమిచ్చి.. సర్కారు సభలో ప్రవేశపెట్టనుంది. కాగా కొత్త ఆర్వోఆర్‌ ముసాయిదా బిల్లులో ధరణిలో పరిష్కారానికి వీల్లేకుండా పోయిన సమస్యలన్నీ పరిష్కారానికి ప్రతిపాదనలు పెట్టారు.

ఈ మేరకు మొత్తంగా 20 సెక్షన్‌ల కింద వివిధ రకాల భూ సమస్యలను పరిష్కరించుకొనే వెసులు బాట కల్పించారు. వ్యవసాయ భూముల మ్యుటేషన్‌కు సంబంధించిన సమస్యలన్నీ తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయిలోనే పూర్తవుతాయి. గత ఆర్వోఆర్‌లను సవరించుకోవచ్చు. రికార్డుల్లో లేని భూమును రికార్డుల్లోకి ఎక్కించుకోవచ్చు. నమోదులో జరిగిన పొరపాట్లపై అప్పీలుకు వెళ్లే వెసులుబాటు కల్పించారు. సర్వే అనంతరం పర్మినెంట్‌ భూధార్‌ నంబరు కేటాయించనున్నారు.

సెక్షన్‌-5 కింద మ్యూటేషన్‌ పరమైన సమస్యలను పరిష్కరిస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ద్వారా వచ్చిన భూమి పత్రాలను పరిశీలించి నోటీసులు ఇస్తారు. ఆపై విచారణ చేసి మ్యూటేషన్‌ చేసే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తారు. సెక్షన్‌-7 కింద వారసత్వం ద్వారా వచ్చిన భూమి, భాగాల పంపకాల్లో వచ్చిన భూమి, వీలునామా కింద సక్రమించిన భూమిని కూడా తహసీల్దార్లకు మ్యూటేషన్‌ చేసే అధికారం ఉంటుంది.

సెక్షన్‌-8 కింద.. ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలో కొనుగోలు చేసిన భూమి, సాదాభైనామా కింద వచ్చిన భూమి, కౌలుదారు చట్టం కింద సక్రమించిన భూమి, ఇనాం ద్వారా వచ్చిన భూమి, ఓఆర్సీ ద్వారా వచ్చిన భూమిని మ్యూటేషన్‌ చేసే అధికారం ఆర్డీవోలకు కట్టబెట్టారు. మ్యూటేషన్‌ చేసేకంటే ముందు అభ్యంతరాలొస్తే మ్యూటేషన్‌ నిలిపివేసే అధికారం కూడా తహసీల్దార్లు, ఆర్డీవోలకు కల్పించారు

సెక్షన్‌-6 కింద సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ఇప్పటికే వచ్చిన 9 లక్షల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించనున్నారు. వీటి పరిష్కారానికి ముందు విచారణ చేసి, నోటీసులు ఇచ్చి మ్యూటేషన్‌ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

కొత్త దరఖాస్తులు వస్తే రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఫీజలు వసూలు చేసి, సంబంధిత రైతులకు మ్యూటేషన్‌ చేయనున్నారు. ఇక నమోదులో తప్పులు జరిగితే అప్పీళ్లు చేసేందుకు ప్రస్తుతం ధరణిలో అవకాశం లేదు.

కానీ ఈ చట్టం ద్వారా బాధితులు అప్పీలుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. మొదటి అప్పీలు కింద కలెక్టర్‌ లేదా అదనపు కలెక్టర్‌, రెండో అప్పీలు కింద సీసీఎల్‌ఏకు అధికారం కల్పించారు. వీరు ఇచ్చిన తీర్పులను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

రికార్డుల మార్పు కోసం సివిల్‌ కోర్టుకు వెళ్లనక్కర్లేదు. రెవెన్యూశాఖకు వీటిని సవరించే అధికారం కల్పించారు. యాజమాన్యం హక్కుల కోసం మాత్రమే కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. ఈ ఆర్వోఆర్‌ ప్రకారం పహాణిలు మళ్లీ నమోదు చేయనున్నారు.

మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ ఎవరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా యువ అధికారి ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓఎస్డీగా నియమించేందుకు సమర్థుడైన అధికారి కోసం లోకేష్ అన్వేషించారు.

కడప జిల్లా బద్వేల్ ఆర్డీవోగా ఉన్న వెంకటరమణను ఏరికోరి తీసుకొచ్చారు. బద్వేల్ ఆర్డీవోగా పనిచేయకముందు తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా పనిచేశారు. ఈ రెండుచోట్లా తన అద్భుతమైన పనితీరుతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు.

ఉద్యోగం వచ్చినప్పటికీ చింతూరు ఐటీడీఏ అధికారిగా పనిచేసే సమయంలో అక్కడి గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు, ప్రభుత్వ పథకాలను వారి దరికి చేరేందుకు రమణ ఎంతో కృషిచేశారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం ఆయన స్వస్థలంకాగా, తల్లిదండ్రులు ఆకుల శ్రీరాములు, లక్ష్మీనరసమ్మ. విద్యాభ్యాసం మొత్తం మార్కాపురంలోనే సాగింది. సొంతంగా ప్రిపేర్ అయి ఎంసెట్ రాశారు. అందులో వెయ్యి రాంకును సాధించి ఈసీఈ తీసుకున్నారు. క్యాంపస్ సెలక్షన్స్ లో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.

అప్పుడే లోటుపాట్లు గుర్తించారు ఆ ఉద్యోగం చేస్తూనే సహచర ఉద్యోగులతో కలిసి దగ్గరలో ఉన్న పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. అలా చెపుతున్నప్పుడే లోటుపాట్లను చూసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే మరింత సేవ చేయవచ్చని భావించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేరయ్యారు.

వ్యక్తిగత ఖర్చుల కోసం పాఠాలు చెప్పేవారు. 2011లో గ్రూప్-1కు హాజరుకాగా ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. అదే సమయంలో ఆ పరీక్షను రద్దు చేశారు. మళ్లీ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేయగా వెంకటరమణ గ్రూప్-1కు మొదటి స్థానంలో నిలిచారు.

మార్కాపురంలోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రుల పేరుతో సొంతంగా గ్రంథాలయాన్ని నడుపుతున్నారు. పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. మార్కాపురం వచ్చిన ప్రతిసారీ గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పేద విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు.

సాగర్‌కు భారీగా వరద - 530 అడుగులు దాటిన నీటిమట్టం, తాజా పరిస్థితి ఇదే..!

ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీశైలం నుంచి భారీగా నాగార్జున సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ కూడా త్వరలోనే నిండిపోనుంది. ఇవాళ్టి(ఆగస్టు 1) మధ్యాహ్నం రిపోర్ట్ ప్రకారం… 533 అడుగుల నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 169.91 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక ఇన్ ఫ్లో 2,08,917 క్యూసెకులుగా నమోదు కాగా… 8,344 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. ప్రస్తుతం 103.71 అడుగుల నీటిమట్టం ఉంది. 1.11 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 185 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరనుంది.

రేపు సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటి విడుదల చేయనున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ లో సాగర్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు సాగర్ నుంచి నీటి విడుదల చేయనున్నారు.

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,42,026 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,78,172 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులకు చేరింది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు గురువారం శ్రీశైలంలోని మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో ప్రదక్షణలు చేసి అనంతపరం మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రిగా శ్రీశైలం తొలిసారి వచ్చిన బాబుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. చంద్రబాబు నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

ప్రజలను రైలులో ప్రయాణించకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందా?..అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రీ

లోక్‌సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర ఆగ్రహం!

రోజూ 2 కోట్ల మంది రైల్లో ప్రయాణిస్తున్నారని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ వారి మనసుల్లో భయాన్ని నింపాలన్నారు.

రైల్వేను సజావుగా నడపడానికి ప్రతిరోజూ 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులు కష్టపడుతున్నారు.

ప్రతిపక్షం 3 రైల్వే ప్రమాదాలను సమస్యగా మారుస్తోందని, కాంగ్రెస్ వారు తమ 58 ఏళ్ల పాలనలో రైల్వే ప్రమాదాల నివారణకు ఎలాంటి వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారన్నారు.

కవాచ్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంగా ప్రకటించింది.

2014లో, ప్రధాని మోదీ దీనిని గ్రహించి, పని ప్రారంభించారు.

మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రమాదాల సంఖ్య 0.24 నుంచి 0.19కి తగ్గిందని చెప్పేవారు సభలో చప్పట్లు కొట్టేవారు.

ఈరోజు 0.19 నుంచి 0.3కి దిగజారినప్పుడు ఇలా ఆరోపణలు చేస్తుంటే ఈ దేశం ఇలాగే కొనసాగుతుందా?

96 మంది డీఎస్పీలు ‘బదిలీ’

రాష్ట్రవ్యాప్తంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అందులో... వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించడంతోపాటు వివిధ కారణాలతో ఏకంగా 57 మందికి పోస్టింగ్‌ ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సబ్‌ డివిజనల్‌ అధికారులతోపాటు సీఐడీ, ఇంటెలిజెన్స్‌, విజిలెన్స్‌లో పనిచేస్తున్న కొందరు డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. వీరిలో శాంతి భద్రతల విభాగంలో పని చేస్తూ వైసీపీతో అంటకాగిన వారు

చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘సిట్‌’, ఇంటెలిజెన్స్‌లో ఉంటూ పీఎస్సార్‌ ఆంజనేయులు కనుసన్నల్లో పని చేసిన వారు, సీఐడీలో విధులు నిర్వహిస్తూ తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఉన్నారు.

శాంతిభద్రతల విభాగంలో 35 సబ్‌ డివిజన్లకు చెందిన 22 మంది డీఎస్పీలను అక్కడి నుంచి తప్పించారు. గన్నవరం డీఎస్పీగా ఉన్న జయసూర్యను మాత్రం భీమవరం బదిలీ చేశారు. మిగిలిన 21 మందికి కొత్తగా డీఎస్పీ పోస్టింగ్‌ లభించింది. వీరంతా ఐదేళ్లుగా లూప్‌లైన్‌లో ఉన్న వారే.

శాంతి భద్రతల విభాగంలో పని చేస్తూ... బదిలీ అయి పోస్టింగ్‌ దక్కని వారిలో... వై.శృతి (శ్రీకాకుళం), జి.నాగేశ్వర రెడ్డి (కాశీబుగ్గ), డి. బాలచంద్రారెడ్డి (టెక్కలి), ఎ.ఎస్‌, చక్రవర్తి(చీపురుపల్లి), హనుమంతరావు (కాకినాడ), విజయ్‌ పాల్‌ (రాజమండ్రి సెంట్రల్‌), అంబికా ప్రసాద్‌ (రాజమండ్రి దక్షిణ), పి. శ్రీకాంత్‌(గుడివాడ), నారాయణ స్వామి రెడ్డి (భీమవరం), మురళీ కృష్ణా రెడ్డి (విజయవాడ వెస్ట్‌), ఎం. రమేశ్‌ (తెనాలి), రవికాంత్‌ (గుంటూరు నార్త్‌), మహబూబ్‌ బాషా (గుంటూరు సౌత్‌), శ్రీనివాసరావు (గురజాల), కిశోర్‌ బాబు (ఒంగోలు), అశోక్‌ వర్ధన్‌ (దర్శి), బాలసుందర్‌ రావు (మార్కాపురం), వీరాంజనేయ రెడ్డి (నెల్లూరు రూరల్‌), బాజీజాన్‌ సైదా (పెనుకొండ), సూర్యనారాయణ రెడ్డి (గూడూరు), శ్రీనివాస రెడ్డి (నాయుడు పేట), ఉమా మహేశ్వర రెడ్డి (శ్రీకాళ హస్తి), శ్రీనివాస రెడ్డి (డోన్‌), శ్రీనివాసులు (ఏలూరు), ప్రసాద రెడ్డి (మదనపల్లె), వినోద్‌ కుమార్‌ (పులివెందుల), మురళీధర్‌ (ప్రొద్దుటూరు), శివభాస్కర్‌ రెడ్డి (గుంతకల్‌), బి. శ్రీనివాసులు(కళ్యాణదుర్గం), వాసుదేవన్‌ (పుట్టపర్తి), విజయ శేఖర్‌ (కర్నూలు), రవీంద్రనాథ్‌ రెడ్డి (నంద్యాల) ఉన్నారు. వీరిలో చాలామంది గత ప్రభుత్వంలో వైసీపీ భక్తులుగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి.

సగానికి పైగా నిండిన సాగర్‌..

కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది.

కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. 312.05 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తు తం 161.97 టీఎంసీల నీరు ఉంది.

కృష్ణాబేసిన్‌లో సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ దాదాపు గా నిండాయి. గోదావరి బేసిన్‌లో సాగునీటిని అందించే కీలక ప్రాజెక్టు ల్లో తప్పిస్తే.. మిగతా ప్రాజెక్టుల్లో వచ్చిన నీటిని వచ్చినట్లు గానే విడుదల చేస్తున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పం గా తగ్గుతోంది. బుధవారం సాయంత్రం 44.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

కాగా, గురువారం ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించ నున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు.