/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz బ్రిడ్జి కూల్చివేత.. ఆ రూట్‌లో ఏళ్లపాటు ట్రాఫిక్ ఆంక్షలు Raghu ram reddy
బ్రిడ్జి కూల్చివేత.. ఆ రూట్‌లో ఏళ్లపాటు ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలోని దశాబ్దాల నాటి బ్రిడ్జిని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఆ చారిత్రాత్మక బ్రిడ్జిని కూలగొట్టి.. దాని స్థానంలో అత్యాధునిక బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఈ బ్రిడ్జిని కూల్చి.. కొత్త బ్రిడ్జి ప్రారంభించేందుకు 2 ఏళ్ల సమయం పట్టనుంది.

ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో 2 ఏళ్ల పాటు ట్రాఫిక్‌ను ఆంక్షలు విధించనున్నారు. అంతేకాకుండా నో పార్కింగ్ నిబంధనలు కూడా అమలు చేయనున్నారు. ఇంతకీ ఆ బ్రిడ్జి ఏది. ఏ నగరంలో ఉందో ఈ స్టోరీలో చూద్దాం.

ప్రస్తుతం దేశంలో నగరాల్లో జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతుండటంతో.. ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వాలు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పాత, శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిలను కూల్చివేసి.. వాటి స్థానంలో కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని ముంబై మహా నగరంలో మరో కీలక ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. దీని కోసం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జిని కూల్చివేయనున్నారు. ఇందుకోసం ఆ మార్గంలో 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ మళ్లించనున్నారు. అదే సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్.

ఇప్పటికే ఈ సియోన్ ఆర్వోబీపైకి భారీ వాహనాలను అనుమతించకుండా అధికారులు నిషేధం విధించారు. కేవలం తేలికపాటి వాహనాలకు మాత్రమే ఈ సియోన్ ఆర్వోబీపైకి ఎక్కేందుకు అనుమతి ఉంది. వచ్చే 3 ఏళ్లలో సెంట్రల్ ముంబైలోని ట్రాఫిక్ సమస్యలను మార్చే ప్రణాళికల్లో భాగంగా ముంబై ట్రాఫిక్ పోలీసులు.. చారిత్రక సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జిని కూల్చివేసి..

దాని స్థానంలో మరో హైటెక్ వంతెనను నిర్మించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం జులై 31 వ తేదీ అర్ధరాత్రి నుంచి సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జిని మూసివేయనుండగా.. 2026 జూలై 31వ తేదీ వరకు కొత్త ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌కు ముంబై నగరంలో అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే మంబైలోని సియోన్ తూర్పు, సియోన్ పశ్చిమ ప్రాంతాలను కలిపే కీలక బ్రిడ్జ్. ఇక వచ్చే నెల 1వ తేదీ నుంచి సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జి కూల్చివేత ప్రక్రియ ప్రారంభం అవుతుందని ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ మార్గంలో వెళ్లే వాహనాలన్నింటినీ 2 ఏళ్ల పాటు దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు.. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆయా మార్గాల్లో నో పార్కింగ్ ఆంక్షలు కూడా విధించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. ముంబై ట్రాఫిక్ సమస్యలకు కొంత పరిష్కారం దొరుకుతుందని.. నగరంలో కీలకమైన తూర్పు-పశ్చిమ ప్రాంతాలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం ఉంటుందని చెప్పారు.

రైతు భరోసాపై తుమ్మల కీలక వ్యాఖ్యలు..!

రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా నిధులు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. అయితే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై మేధావులు, రైతుల అభిప్రాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

అన్ని జిల్లాల నుంచి రైతు అభిప్రాయం సేకరించిన తర్వాత రైతు భరోసా మార్గదర్శకాలను రూపొందిస్తామని చెప్పారు. అంతుకు ముందు అసెంబ్లీ కూడా రైతు భరోసా పథకం ఎలా ఉండాలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

రైతు భరోసాపై మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత అన్నదాతల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, సినీ స్టార్లకు, బడా వ్యాపారవేత్తలకు రైతు బంధు ఇచ్చారని. ఇలా రూ.25 వేల కోట్లు ఇచ్చారని శాసన మండలిలో తుమ్మల చెప్పారు. ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఉన్నా.. రుణ మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ. లక్ష లోపు రుణ మాపీ చేసినట్లు ప్రకటించారు. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు.

కాగా ఈసారి తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ. 72 వేల 659 కోట్లు కేటాయించారు.

ఇందులో రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు, రూ .2 లక్షల రుణమాఫీ కోసం రూ.32 వేల కోట్లు కేటాయించారు. యూనివర్సిటీల కోసం రూ.500 కోట్లు, ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఆర్టీసీలో ఫ్రీ జర్నీకి రూ.2,351 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించారు.

MMTS కు రూ. 50 కోట్లు, HMDA కు రూ. 500 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ. 5 వేల 790 కోట్లు, GHMC కోసం రూ. 3 వేల 65 కోట్లు, విద్యా రంగానికి రూ. 21 వేల 292 కోట్లు, హోం శాఖకు రూ. 9 వేల 564 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ. 2 వేల 762 కోట్లు, ఇరిగేషన్ శాఖకు రూ. 22 వేల 301 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 16 వేల 410 కోట్లు, అడవులు పర్యవరణ శాఖకు రూ. 1, 064 కోట్లు, IT రంగానికి రూ. 774 కోట్లు కేటాయించగా.. వైద్య ఆరోగ్య శాఖ రూ. 11 వేల 468 కోట్లు SC సంక్షేమం కోసం రూ. 33 వేల 124 కోట్లు కేటాయించారు. రిజినల్ రింగ్ రోడ్డునిర్మాణం కోసం రూ. 1525 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమం కోసం రూ. 2 వేల 736 కోట్లు స్త్రీ శిశు సంక్షేమం కోసం రూ. 2 వేల 736 కోట్లు కేటాయించారు.

ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది.

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Former CM KCR) తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly) వచ్చారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది. అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం త్వరత్వరగా జరిగిపోయాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైర్హాజరయ్యారు. అయితే ఫలితాల తర్వాత ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్ కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.

ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరుకావడం లేదని బీఆర్‌ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.

అయితే ఈ నెల 23 నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసలు కేసీఆర్ సమావేశాలకు హాజరు అవుతారా?... లేదా? అనే దానిపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది. చివరకు అనుకున్న విధంగానే కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు

ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నేడు అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో సమావేశాలు మొదలైన తర్వాత మూడవ రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. అయితే... బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభకు వస్తారని.. తరువాత సభకు దూరంగా ఉండనన్నట్లు సమాచారం. మరి మరికొద్దిరోజుల పాటు జరిగే సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారా?.. లేరా..? అనేది వేచి చూడాలి.

కాగా... మరికాసేపట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అందజేశారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి నివాసం ప్రజాభవన్‌లో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులను భట్టి దంపతులు తీసుకున్నారు. అలాగే రూ.2 లక్షల 95 వేల కోట్ల బడ్జెట్‌కు తెలంగాణ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.

దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదు: పవన్‌

దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. వీటిని సమర్థంగా తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగా ఏపీలో పలు చోట్ల రీసైకిల్ యూనిట్లు నెలకొల్పడం జరిగిందని చెప్పారు.

రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు పవన్ వివరించారు.

శాసనసమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఈ వ్యర్థాల తొలగింపునకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీ సైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పవన్​ తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. వీటిని సమర్థంగా తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ వ్యర్థాలను సేకరించి రీ సైక్లింగ్ చేసేందుకు అని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్​లో పలు చోట్ల రీ సైకిల్​ యూనిట్లు నెలకొల్పడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

మరోవైపు మోనజైట్, సిలికాన్‌ను ప్రైవేట్ ఏజెన్సీలకు అక్రమంగా విక్రయంపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు.

గార, భీమిలి బీచ్‌లో అక్రమ తవ్వకాలు జరిగిన మాట వాస్తవమేనని కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టి తవ్వకాలు జరిపి దోచుకున్నారని తెలిపారు. గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి స్వయంగా వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

సామాన్యులకు భారాలు - సంపన్నులకు వరాలు సబ్సిడీలకు కోత - కార్పొరేట్లకు నజరానా అభివృద్ధికి కీలకమైన ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఏది?

కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకున్న నిరుద్యోగం, అధిక ఆహార ద్రవ్యోల్బణం రేటు, అసాధారణమైన రీతిలో పెరుగుతున్న అసమానతలు, మందగించిన ప్రయివేట్‌ పెట్టుబడులు వంటి ఆర్థిక వాస్తవికతల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిఉందని, అందుకు భిన్నంగా ప్రస్తుత బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు వాటిని కుదించేలా, తిరోగమన ధోరణిలో వున్నాయని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ పేర్కొన్నారు. ప్రజలపై మరింత భారాలు మోపేలానే ఈ ప్రతిపాదనలు వున్నాయని, పెట్టుబడులు ఉపాధి కల్పన స్థాయిలను దిగజార్చేలా వున్నాయని తెలిపారు.  

ప్రభుత్వ రెవిన్యూ ఆదాయాలు 14.5 శాతం మేరకు పెరగగా, వ్యయం మాత్రం కేవలం 5.94 శాతమే పెరిగినట్లు బడ్జెట్‌ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఈ రెవిన్యూలను ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించడానికి బదులుగా, జిడిపిలో ఆర్థిక లోటును 5.8 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గించడం ద్వారా అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడిదారులను బుజ్జగించడానికి ఉపయోగించారని వాపోయారు. బడ్జెట్‌లో అంచనా వేసిన జిడిపి గణాంకాలు సమాచారాన్ని తప్పుగా చూపించడం (డేటా ఫడ్జింగ్‌) లో మరో ప్రక్రియ అని తెలిపారు. నామమాత్రపు జీడీపీ వృద్ధి 10.5 శాతమని అంచనా వేశారు, కానీ కీలకమైన ద్రవ్యోల్బణ రేటు 3 శాతాన్ని మినహాయించడం ద్వారా వాస్తవిక జీడీపీ 6.5 నుండి 7 శాతం మేరకు వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. కీలక ద్రవ్యోల్బణం రేటులో కూడా అధిక ఆహార ద్రవ్యోల్బణం 9.4 శాతాన్ని మినహాయించారు. ఆ రకంగా వాస్తవిక జిడిపి వృద్ధిని ఎక్కువ చేసి చూపించారని విమర్శించారు.

ప్రభుత్వ వ్యయాన్ని మరింతగా కుదించారు. సబ్సిడీల్లో గణనీయంగా కోత విధించారు. ఎరువుల సబ్సిడీని రూ.24,894 కోట్ల మేరకు కోత విధించారు. ఆహార సబ్సిడీని రూ.7,082 కోట్ల మేరకు కోత పెట్టారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి రంగాలపై వ్యయాలను జిడిపిలో శాతంగా గనక చూసినట్లైతే పెద్దగా మార్పేమీ లేదు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) ను మరింతగా నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. బడ్జెట్‌ కేటాయింపులు రూ.86 వేల కోట్లు వున్నా ఇవి 2023 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిందానికన్నా తక్కువే. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు మాసాల్లో ఇప్పటికే రూ.41,500 కోట్లు ఖర్చు పెట్టగా, మిగిలిన 8 మాసాల కాలంలో కేవలం రూ.44,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడానికి వున్నాయి. గ్రామీణ భారతంలో తీవ్రంగా నెలకొన్న నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ఇవి ఎంత మాత్రమూ సరిపోవనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు.

నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామనే పేరుతో, బడ్జెట్‌ అనేక జిమ్మిక్కులకు పాల్పడింది. ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌గా తీసుకువచ్చిన కొత్త పథకం కింద సాధికార రంగంలో కొత్తగా చేరి రూ.లక్ష కన్నా తక్కువ సంపాదిస్తున్న వారికి ఒక నెల వేతనాన్ని ఇస్తామని ప్రకటించింది. అర్హులైన వర్కర్లు గరిష్టంగా రూ.5 వేలను మూడు నెలవారీ వాయిదాల్లో పొందుతారని, అయితే, దీనివల్ల యజమానులు ఎక్కువగా లబ్ది పొందుతారని వివరించారు. రెండేళ్లలో సృష్టించిన ప్రతి అదనపు ఉద్యోగానికి రూ.లక్ష వరకు నెల జీతం వున్న ప్రతి ఒక్క కొత్త ఉద్యోగి వల్ల రూ.72 వేలు చొప్పున, 24 నెలవారీ వాయిదాల్లో యజమానులు లబ్ధి పొందుతారు. ఇటువంటి జిమ్మిక్కుల వల్ల ఉపాధి కల్పన జరగబోదు. గత సంవత్సరాల్లో కార్పొరేట్‌ రంగం సంపాదించిన భారీ లాభాలు భారీ యంత్రాలు, ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడుల రూపంలో కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థలో నిలకడగా డిమాండ్‌ లేకపోవడమే ఇందుకు కారణంగా వుంది. దీనివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా క్షీణించిందని పేర్కొన్నారు.

యువతలో నైపుణ్యాలను పెంపొందించే పథకాలను బడ్జెట్‌లో బాగా ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ వీటివల్ల కూడా తీవ్రంగా వున్న నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. 2016-2022 ల్లో కేవలం 18 శాతం మంది యువత మాత్రమే నైపుణ్యాల అభివృద్ధి పథకాల ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మరోసారి ఇక్కడ సుస్పష్టం చేయాల్సిన అంశమేమంటే ఆర్థిక కార్యకలాపాలు విస్తరించకపోతే వృద్ధి చెందలేం. 

‘సహకార సమాఖ్యవాదం’ గురించి చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇబ్బందులు పడుతున్నాయి. రాష్ట్రాలకు ఆర్థిక సంఘం మంజూరు చేసే నిధులు (పన్నుల ద్వారా వచ్చేది కాకుండా) 2022-23లో రూ.1,72,760 కోట్లు వుండగా, 2023-24 కి వచ్చేసరికి రూ.1,40,429 కోట్లకు పడిపోయాయి. ఈ బడ్జెట్‌ ఈసారి ఇంకా కుదించబడి, 1,32,378 కోట్లకు చేరుకుంది. మొత్తమ్మీద చూసినట్లైతే, ఈ బడ్జెట్‌ సంపన్నులను మరింత సంపన్నులుగా చేయడానికి, పేదలను మరింత దుర్భర దారిద్య్రంలోకి నెట్టడానికి ఉద్దేశించబడింది. దేశంలోని సూపర్‌ సంపన్నులపై సంపద పన్ను లేదా వారసత్వపు పన్ను విధింపు ప్రతిపాదనను పరిశీలించేందుకు కూడా తిరస్కరించింది. ప్రజలపై పడే పరోక్ష పన్ను భారానికి ఉపశమనం కూడా ఈ బడ్జెట్‌లో లేదు.

 దేశ ప్రజలు, ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందున ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలను మార్చి ప్రజా అనుకూల విధానాలను అమలు చేయాలని వి. కృష్ణ మోహన్ ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.

జగన్‌‌కు బిగ్ షాక్.. అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం

వైసీపీ అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలంటూ సీబీఐ కోర్టును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

ఈనెల 3న ఇచ్చిన ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణను కొనసాగించాలని, విచారణ స్థాయిపై నివేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణను త్వరగా పూర్తిచేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని హరిరామజోగయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం, సీబీఐ కోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో దాఖలైన డిశ్ఛార్జి పిటిషన్‌లపై రోజువారీ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ తీరు గతం కంటే మెరుగుపడ్డప్పటికీ సంతృప్తికరంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది.

దర్యాప్తు తీరుపై వివరాలతో నివేదిక ఇవ్వాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. గత ఆదేశాలను అమలు చేయాలని మరోసారి స్పష్టంచేస్తూ విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

అరబిందో, హెటిరోలకు భూకేటాయింపులకు సంబంధించి నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

సాయిరెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపించగా తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేయడం జరిగింది.

సింగరేణి కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు 30లక్షల బీమా

సింగరేణిలో పనిచేస్తూ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్‌ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ పేర్కొన్నారు.

సింగరేణిలో పనిచేస్తూ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్‌ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ పేర్కొన్నారు.

మంగళవారం సింగరేణి భవన్‌లో బలరామ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులై మెయిన్స్‌ రాయనున్న అభ్యర్థులకు రూ.లక్ష సహాయం అందించే ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ పథకానికి దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది.

ఆగస్టు 6న సాయంత్రం 5గంటల దాకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

1021 కోట్లు ఔట్….26 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

నాలుగో వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి మూవీ(Kalki 2898 AD Movie) వర్కింగ్ డే లో కొంచం అనుకున్న దాని కన్నా ఎక్కువగానే డ్రాప్ అయినా కూడా ఇప్పటికీ షేర్ ని అయితే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26వ రోజున ఆల్ మోస్ట్ 75% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఇప్పటికీ షేర్స్ రావడం మాత్రం గొప్ప విషయం అనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26వ రోజున మొత్తం మీద 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ తో హిందీ నుండే మంచి హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటంతో ఓవరాల్ గా

సినిమా 26వ రోజున 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని 2.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు టోటల్ గా సినిమా

ఇక సినిమా మొత్తం మీద 26 రోజుల్లో 1021 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేయగా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 149.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బహిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది.

ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

అంబానీ అందుకున్న బహుమతుల చిట్టా

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక పూర్తయినప్పటికీ దానికి సంబంధించిన ‘ఖరీదైన విశేషాలు’ మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లూ పెళ్లికి హాజరైన సెలబ్రిటీలకు ముకేష్ అంబానీ అందించిన బహుమతులు గురించి మాత్రమే తెలుసుకున్నాం.

చాలామంది సెలబ్రిటీలకు ఆయన 2 కోట్ల రూపాయల విలువైన వాచీలను బహుమతులుగా ఇచ్చారు. మరి పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలు, అనంత్ అంబానీకి ఎలాంటి బహుమతులిచ్చారు. ఇప్పుడీ విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

వీటిలో ముఖ్యమైనది షారూక్ ఖాన్ అందించిన గిఫ్ట్. అనంత్ అంబానీకి కళ్లుచెదిరే గిఫ్ట్ అందించాడట షారూక్. అనంత్ కోసం ఫ్రాన్స్ లో 40 కోట్ల రూపాయల విల్లాను కొనుగోలు చేసి, ఆ తాళాల్ని అతడికి అందించాడట షారూక్. పెళ్లికి వచ్చిన అతిథుల్లో అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చింది షారూక్ మాత్రమే అని టాక్.

ఇక బచ్చన్ కుటుంబం, అనంత్ అంబానీకి 30 కోట్ల రూపాయల విలువైన ఆభరణాల డబ్బాను అందించిందంట. ఇందులో బంగారం, వజ్రాలతో చేసిన ఎన్నో రకాల ఆభరణాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కూడా దాదాపు 30 కోట్ల రూపాయల ఖరీదైన వాచీని అనంత్ కు బహుకరించాడు. ప్రపంచంలో ఈ వాచీలు కేవలం 30 మాత్రమే ఉన్నాయట. అందులో ఒకటి అనంత్ చెంతకు చేరింది.

అలియా భట్, రణబీర్ దంపతులు 9 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును అందించగా.. దీపిక-రణ్వీర్ దంపతులు 20 కోట్ల రూపాయల విలువైన కస్టమైజ్డ్ రోల్స్ రాయిస్ కారును బహుకరించారు.

అక్షయ్ కుమార్ 60లక్షల రూపాయల విలువ చేసే 2 పెన్నుల్ని అందించగా.. కియరా అద్వానీ 25 లక్షల రూపాయల విలువైన హ్యాండ్ మేడ్ శాలువను బహుకరించిందట.

ఇక అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 11.5 కోట్ల విలువైన ఇంపోర్టెడ్ కారును బహుమతిగా అందించాడట. సౌత్ నుంచి వెళ్లిన రామ్ చరణ్, సూర్య, రానా, మహేష్ బాబు లాంటి వాళ్లు ఎలాంటి బహుమతులు అందించారనేది ఇంకా బయటకురాలేదు.

నీట్ పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు

నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని నిర్ధారించింది. బీహార్ లోని హజారీబాగ్, పాట్నాలోనూ పేపర్ లీకైందని తెలిపింది.

150 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ తో లబ్ధి పొందారని సీజేఐ బెంచ్ వెల్లడించింది. 

అయితే, దేశమంతా నీట్ పేపర్ లీకైనట్టు ఆధారాలు లేవని, అందువల్ల నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

నీట్ ఎంట్రన్స్ రద్దు చేయాలన్న వాదనలో అర్థం లేదని, నీట్ పరీక్ష రద్దు చేస్తే 24 లక్షల మందిపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది.

లీక్ తో లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. నీట్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని అభిప్రాయపడింది.

కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, నీట్ యూజీ ప్రవేశాల కౌన్సిలింగ్ కు మార్గం సుగమం అయింది.