/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వడపర్తి కత్వ నుండి భువనగిరి పెద్ద చెరువులోకి నీళ్ళు పోయే రాచకాల్వ పనులను పూర్తి చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ Vijay.S
వడపర్తి కత్వ నుండి భువనగిరి పెద్ద చెరువులోకి నీళ్ళు పోయే రాచకాల్వ పనులను పూర్తి చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్

వడపర్తి కత్వ నుండి భువనగిరి పెద్ద చెరువులోకి నీళ్లు పోయే రాచ కాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి యండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలోని రాచ కాల్వ పనులను సిపిఎం నాయకత్వం, రైతులతో కలిసి పరిశీలన చెయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ కాల్వ పనులు వర్షాకాలం నెత్తిమీదికి కొచ్చిన ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ ను ప్రశ్నించారు. కాల్వ పక్కన ఉన్న రైతులు కాలువ తీస్తుంటే తమ పంట పొలాలు ధ్వంసం అయ్యాయని వాటికి నేటికీ ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్వ పనులు పూర్తి కావడానికి యుద్ధ ప్రాతిపదికన నిధులు తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రైతులు కాలువలు దాటి తమ పంట పొలాలకు పొలాలకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రత్యామ్నాయ బాటలు కూడా లేవని ఇప్పటికైనా కాల్వపైన 14 చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని, కాల్వ మధ్యలో ఉన్న మట్టి కుప్పలను తక్షణం తొలగించాలని జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈవారం లోపు పనులు చేపట్టకపోతే రైతులను సమీకరించి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, నాయకులు బండి శ్రీను, రైతులు పన్నాల సంజీవరెడ్డి, భాస్కర్ రెడ్డి, అంజిరెడ్డి, సత్తిరెడ్డి, హరినాధ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మద్దుల ప్రభాకర్ రెడ్డి, సోమ అంజయ్య, చందుపట్ల ఎల్లయ్య, మల్లేష్, కసర బోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

గోపరాజుపల్లి లో జై భీమ్ సేన నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామంలో "జై భీమ్ సేన" నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా సంగిశెట్టి సుందర్ రావు, అధ్యక్షులుగా వల్లమల్ల రత్నయ్య, ఉపాధ్యక్షులుగా కట్ట సురేష్, వల్లమల్ల రాజేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సంగిశెట్టి విజయకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నీలం నరేందర్, సహాయ కార్యదర్శులుగా సంగిశెట్టి రమేష్, ఎర్ర మత్స్యగిరి, కోశాధికారిగా వల్లమల్ల మత్స్యగిరి, సాంస్కృతిక కార్యదర్శి గా నీలం నరేష్, గేమ్స్ సెక్రెటరీ గా నీలం కుబులు, మీడియా ప్రతినిధి గా సంగిశెట్టి ఉపేందర్, కమిటీ కార్యవర్గ సభ్యులుగా సంగిశెట్టి ప్రభాకర్, సంగిశెట్టి మనోహర్,ఎర్ర శ్రీను, వల్లమల్ల సైదులు, వల్లమల్ల రమేష్, కమిటీ గౌరవ సలహాదారులుగా రావుల ఎల్లయ్య, సంగిశెట్టి దేవదాస్ (Rtd టీచర్), వల్లమల్ల రఘుపతి, సంగిశెట్టి రాములు వల్లమల్ల స్వామి, సంగిశెట్టి నర్సింగరావు లెక్చరర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి: సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్. ఈ సందర్భంగా ...సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్ మాట్లాడుతూ నాటి సాయుధ పోరాట నుండి నేటి మలి దశ ఉద్యమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనేక పోరాటాలు చేసి ఆనాటి నైజం నుండి విముక్తి చేసింది. మలి దశ ఉద్యమంలో సిపిఐ పార్టీది కీలక గణనీయమైన పాత్ర పోషించిందని అన్నారు,స్వరాష్ట్రం కోసం సుమారు 12 వందల మంది విద్యార్థి యువకుల బలిదానాల తోటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేసుకోవడం జరిగినది మన రాష్ట్రం మనకు కావాలని మన ఉద్యోగాలు మనకు కావాలని మన నీళ్లు మనకు కావాలని నీళ్లు నియామకాలు కావాలని ప్రత్యేక రాష్ట్రం కొరకు సబ్బండ వర్గాలు సకల జనుల సమ్మె చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోవడం జరిగినది. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ సంపాదన కొంతమంది చేతుల్లోకి వెళ్లడం జరిగినది. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కొరకు ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీల కొరకు సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అందరికీ చేరువాయే విధంగా ప్రజాపాలన కొనసాగాలని విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించాలని,తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు అన్నారు కార్యక్రమంలో *సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, ఏఐవైఏఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, బోడిగే సుదర్శన్,చొప్పరి వెంకటేష్, సుద్దాల సాయికుమార్, మేడి దేవేందర్,నరేష్, నరసింహ, భుషి శివ* తదితరులు పాల్గొన్నారు.

కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి అకాల మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు : సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి అకాల మృతి ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి యండి.జహంగీర్ అన్నారు.ఆదివారం భువనగిరి మండల పరిధిలోని చీమలకొండూరు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి (ధర్మబిక్షం) గారి అకాల మృతికి సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున సంతాపాన్ని ప్రకటించి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు.ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ కామ్రేడ్ బిక్షపతి విద్యార్థి దశలో కమ్యూనిస్టు రాజకీయాలకు ఆకర్షితులై విద్యార్థుల సమస్యల పరిష్కారంకై ఎస్ఎఫ్ఐ చేరి అనేక ఉద్యమాలు నిర్వహించాడుని అన్నారు. యువజన నాయకుడిగా నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలపై నిర్వహించిన అనేక పోరాటాలలో ముందున్నారని అన్నారు. సిపిఎం పార్టీ సభ్యుడిగా భువనగిరి మండల నాయకుడిగా అనేక కూలీ ,భూమి పోరాటాలకు నాయకత్వం వహించి గ్రామంలో మండలంలో కూలీ పోరాటాలు నిర్వహించి కూలీ రేట్లు పెరగడానికి తమ పాత్ర పోషించాడని, గ్రామంలో పేదలు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వ భూములకు నూతన పాసుబుక్కులు సాధించడంలో, చెరువుషికం భూములను కాపాడడంలో బిక్షపతి పాత్ర చాలా కీలకమని జహంగీర్ తెలియజేశారు. సామాజిక ఉద్యమాలలో, మండల, గ్రామ సమగ్ర అభివృద్ధికి జరిగిన పోరాటాలలో తన పాత్ర గొప్పదని బిక్షపతి జీవితాంతం ఎర్రజెండా చేతబట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపినాడని, క్రమశిక్షణతో సమ సమాజంకోసం, దోపిడి రహిత సమాజ నిర్మాణం కోసం, ఎర్రజెండా రాజ్యం కోసం కష్టజీవుల రాజ్యం కోసం సిపిఎం నాయకత్వంలో కామ్రేడ్ బిక్షపతి అనేక పోరాటాలలో ముందుండి పని చేశారని వారి మృతి సిపిఎం ఉద్యమానికి తీరని లోటని వారి ఆశయ సాధన కోసం రానున్న కాలంలో ప్రజా పోరాటాలను ఉదృతం చేయాలని జహంగీర్ పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, భువనగిరి పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, సంగీత డైరెక్టర్, ప్రజానాట్యమండలి సీనియర్ కళాకారుడు మద్దూరి ఐలయ్య, సిపిఎం సీనియర్ నాయకులు బొల్లెపల్లి కుమార్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, కొండా అశోక్, అన్నంపట్ల కృష్ణ, మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, చీమలకొండూరు శాఖ కార్యదర్శి బొడ అంజనేయులు, ముస్త్యలపల్లి శాఖ కార్యదర్శి కళ్లెం లక్ష్మీనరసయ్య, ముత్తిరెడ్డిగూడెం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, గ్రామ శాఖ సభ్యులు వడ్డబోయిన వెంకటేష్, పల్లెర్ల వినోద్, రాగుల పోశయ్య, రాగుల కిష్టయ్య, బలిత రాజు, జిల్లాపల్లి నవీన్, పద్మ,సరిత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు* వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు మారగొని శ్రీనివాస్ గౌడ్.అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి.ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అనేక బలిదానాల తోటి త్యాగాల తోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కానీ గత ప్రభుత్వం ఉద్యమకారులను అమరులను గుర్తించలేదని ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వలిగొండ ఎంపీటీసీ పలుసం. రమేష్. తుర్కపల్లి ఎంపీటీసీ. తుమ్మల వెంకట్ రెడ్డి. శీలం స్వామి. బత్తిని రవి. ఉద్యమకారుల ఫోరం. నాయకులు మల్లం వెంకటేశం .జోగు అంజయ్య చౌటుప్పల్ మండల అధ్యక్షులు గట్టు సుధాకర్ రామన్నపేట మండల అధ్యక్షులు నోముల శంకర్ మంటి రమేష్ మంటి లింగయ్య మంటి శంకర్ శ్రీనివాసచారి కదిరేని స్వామి .పబ్బు.స్వామి.కే బాబు. ఈతప మల్లేశం. బల్గూరి నరేష్ రెడ్డి. అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు

భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలోని లలిత కలెక్షన్ దగ్గర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించి ,జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అవతరణకు సహకరించిన అప్పటి ఎన్డీఏ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారిని మరియు అమరవీరులను స్మరించుకుని వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, సీనియర్ నాయకులు షీలోజు శ్రీరాములు, కనతాల అశోక్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు గంగదారి దయాకర్, కోశాదికారి అప్పిషెట్టి సంతోష్,మండల కార్యదర్శి మైసొల్ల మచ్చగిరి, BJYM మండల అద్యక్షులు మంధాడి రంజిత్ రెడ్డి, BJYM అసెంబ్లీ కన్వీనర్ బంగమట్ల మహేశ్, BJYM జిల్లా నాయకులు దంతూరి అరుణ్ ,ఓబీసీ మౌర్చా మండల నాయకులు పాతకోట నరేష్, పిట్టల రాజు,మాటురి శివ , నాగేళ్లి పాండు, ఎల్లంకీ మురళి, ఎర్రబోలు జంగయ్య, బర్ల మల్లేశం,రాపోలు ఆంజనేయులు, విఘ్నేష్,కీర్తి వెంకటేశం,అనిల్ రెడ్డి, రేగు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

కౌంటింగ్ పనులను ఏకాగ్రతతో నిర్వహించాలి: జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు కే జెండగే

కౌంటింగ్ పనులను పూర్తి ఏకాగ్రత్తతో నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. ఈ నెల 4 న స్థానిక అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో 14- భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గం సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన కౌంటింగ్ పనుల దృష్ట్యా శనివారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లకు పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం కౌంటింగ్, ఇటిపిబిఎస్ కౌంటింగ్ విధులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రెండవ విడుత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణ పూర్తి ఏకాగ్రతతో నిర్వర్తించాలని, ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా కలెక్టరు వారికి సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్, జనగాం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు పింకేశ్ కుమార్, ఇబ్రహింపట్నం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కే.అనంతరెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి జగన్మోహనప్రసాద్, జిల్లా లీడ్ మేనేజరు రామకృష్ణ, జిల్లా స్థాయి మాస్టం ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాధరెడ్డి లు పాల్గొన్నారు.

హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి

కేసీఆర్ పిలుపు మేరకు “తెలంగాణ దశాబ్ది ఉత్సవాల“ముగింపు సంధర్బంగా భువనగిరి మాజీ శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చలు సమర్పించి కొవ్వు త్తులతో అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డడానికి ఎందరో మహనీయులు తమ ఆత్మ బలిదానాలు ఇచ్చారని ముఖ్యంగా,విద్యార్థులు బలిదానాల వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని అన్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకై కెసిఆర్ ఎంతో కృషి చేసారని అన్నారు. కేసీఆర్ తెచ్చి పెట్టిన రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ,రాజ్యాధికారం పొంది ప్రజలకు అమరులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని వాపోయారు ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు,నాగారం కిరణ్ కుమార్,నాయకులు తాడేం రాజశేఖర్,యువజన నాయకులు నాగారం సూరజ్ సైదులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరులకు ఘన నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో కేసిఆర్ గారి పిలుపు మేరకు “తెలంగాణ దశాబ్ది ఉత్సవాల“ముగింపు సంధర్బంగా.. అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చలు సమర్పించి అమరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జడల అమరేందర్ గౌడ్, కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయినా ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, భువనగిరి పట్టణ అధ్యక్షులు AV కిరణ్, భువనగిరి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, నీల ఓం ప్రకాష్ గౌడ్, అబ్బ గాని వెంకట్ గౌడ్, ఇత్తబోయిన గోపాల్, ఖాజ ఉద్దీన్, అతికం లక్ష్మీనారాయణ, ఇక్బాల్ చౌదరి, కుశంగల రాజు, పాండు, సుధగాని రాజు, తాడెం రాజశేఖర్, కాజాం, ముజీబ్, నాగు, బబ్లూ, సురేష్, సుభాష్, యువ నయకులు నాగారం సూరజ్, అజయ్, శివ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈనెల 4న జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్

ఈనెల 4న జరిగే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు హెచ్చరిక చేశారు.ఎన్నడు లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు.