/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం.. సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి Vijay.S
VijayaKumar

May 19 2024, 20:37

సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం.. సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి

సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం.. వర్కట్ పల్లి గ్రామంలో సుందరయ్య గారి 39వ వర్ధంతి భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన పుచ్చలపల్లి సుందరయ్య జీవితాంతం పేదలు వ్యవసాయ కూలీల,కార్మికుల, పేద ప్రజల కోసం పనిచేసిన గొప్ప మహనీయుడని ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు ఈరోజు మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన పుచ్చలపల్లి సుందరయ్య పేద ప్రజలు వ్యవసాయ కూలీలు, కార్మికుల,దళితుల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడన్నారు,ఉత్తమ పార్లమెంట్ సభ్యునిగా సైకిల్ పై వెళ్లి రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడన్నారు పిల్లలు పుడితే తనలో స్వార్థం పెరుగుతుందనే భావనతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని తన జీవితం మొత్తం పేదల కోసం పనిచేసిన త్యాగమూర్తన్నారు స్వాతంత్ర ఉద్యమ సమయంలో బాల్య దశలోనే పోరాటాలకు ఉత్తేజితులై కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై దక్షిణ భారతదేశంలో సిపిఎం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడని సిపిఎం మొదటి జాతీయ కార్యదర్శిగా పనిచేశారని ఎంపీ ఎమ్మెల్యేగా పార్లమెంటు,అసెంబ్లీలో చట్టసభలకు వన్నెతెచ్చిన రాజకీయ సిద్ధాంతకర్త అన్నారు ఆయన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమైందని ఆయన చూపిన దోపిడీ,పీడనలేని సమ సమాజం కోసం,కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళని,ఆయన ఆశయ సాధనకు పునరంకితం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం వర్కట్ పల్లి శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి సిపిఎం నాయకులు గూడూరు బుచ్చిరెడ్డి, ఆకుల మారయ్య,రొండి రాములు,గోగు కిష్టయ్య,రొండి మల్లేశం, నాగవేల్లి లక్ష్మయ్య,మెట్టు లక్షమ్మ,సిర్పంగి స్వప్న,బాబు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 19 2024, 20:24

భవన నిర్మాణ కార్మికులకు రావలసిన పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే విడుదల చేయాలి : కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్ రావు

అసంఘాటీత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు నూతనంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తంబు విధానని రద్దుచేసి పాత పద్ధతినే గుర్తింపు కార్డులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘo రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని తాపీ సంఘం భవన ప్రారంభోత్సవానికి రత్నాకర్ రావు మరియు ఎండీ ఇమ్రాన్ ముఖ్యఅతిథిగా హాజరై శిలా పలకాలను ఆవిష్కరించి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ చాలామంది కార్మికులకు రేషన్ కార్డులు లేనందున నూతన లేబర్ కార్డులు రావడం లేదని కావున ప్రభుత్వ వెంటనే నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని, 60 ఏళ్ళు వయస్సు పైబడిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ మరియు ఇతర బెనిఫిట్ బకాయిలను వెంటనే ఇవ్వాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికుల అడ్డాల వద్ద అన్ని మౌలిక వసతులు ప్రధానంగా షెల్టర్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ప్రమాదంలో మరణించిన భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి రూ.10లక్షలు, సహజ మరణం పొందితే రూ.5 లక్షలు, పెండ్లి కానుక ఒక లక్షకు పెంచాలని, పిల్లల చదువుకు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, నాయకులు దాసరి లక్ష్మయ్య, పోచంపల్లి మండల అధ్యక్షులు చేరాల లింగయ్య, ఉపాధ్యక్షులు దేవిగారి బాలయ్య, ప్రధాన కార్యదర్శి కొత్త నరేష్, సహాయ కార్యదర్శి రామచర్ల సందయ్య, కోశాధికారి పోతగళ్ల బాలరాజు మరియు మాజీ మండల అధ్యక్షులు పొన్నమోని ఎట్టయ్య, చేరాల పెద్ద నర్సింహా, పెద్దల యాదయ్య, ఇబ్రహీంపట్నం అంజయ్య, చెరుకు నరసింహ, సలహాదారులు చీరాల చిన్న నరసింహ, కొండమడుగు బాలయ్య, గోరికంటి బాలయ్య, జక్కి రమేష్, గుర్రు దానయ్య, నాయకులు కొండమడుగు మైసయ్య, పొన్నమోని శ్రీశైలం, చేరాల రాజయ్య, చేరాల యాదయ్య, తదితర 100 మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.


VijayaKumar

May 19 2024, 20:06

గోపరాజు పల్లి లో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని పాల సెంటర్ నుండి మూసీ నది వరకు రోడ్డు మంజూరు చేస్తామని ,పాల సెంటర్ నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వరకు కరెంటు స్తంభాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ నూతి రమేష్ రాజ్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి ,గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి, పెద్ద గొల్ల సారి గొల్ల ఏనుగుల బచ్చయ్య ,మంటిపల్లి రామకృష్ణ, యాదవ సంఘం సభ్యులు, పుల్లపు శేఖర్ , ఏనుగుల మత్స్యగిరి, ఏనుగుల లింగయ్య, నీలం బాబురావు , పులగూర్ల కొండల్ రెడ్డి , ఏనుగుల నరసింహ, పోలబోయిన సత్తయ్య, దొండ లింగయ్య, ఏనుగుల మత్స్యగిరి ,మల్లేష్, ఏనుగుల విష్ణు, మంటిపల్లి నరేష్, ఏనుగుల కిరణ్, గ్రామస్తులు, భక్తులు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

May 19 2024, 19:21

గోపరాజుపల్లి లో శ్రీ మల్లికార్జున స్వామి కేతమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కేతమ్మ కళ్యాణం మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని సన్మానించారు .ఈ కార్యక్రమంలో వలిగొండ మండల ఎంపీపీ నూతి రమేష్ రాజ్ ,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి, వేములకొండ ఎంపిటిసి సామ రాంరెడ్డి, నరేష్ రెడ్డి ,గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి, పెద్ద గొల్ల ఏనుగుల బచ్చయ్య, సారి గొల్ల మంటిపల్లి రామకృష్ణ, యాదవ సంఘం సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి, కాంగ్రెస్ నాయకులు పుల్లగూర్ల లింగారెడ్డి, నీలం బాబురావు, కీసర్ల మహేందర్ రెడ్డి, మంటిపల్లి నరేష్, ఏనుగుల మత్స్యగిరి, విష్ణు ,వల్లపు శేఖర్, పులగూర్ల కొండల్ రెడ్డి, సంగిశెట్టి కిష్టయ్య , సలిగంజి పృద్వి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 19 2024, 18:59

అనాధలకు మనోధైర్యాన్ని కలిగిద్దాం : ధరణికోట నరసింహ వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు

పుట్టినరోజు, పెళ్ళిరోజు వేడుకలను అనాదశ్రమంలో జరుపుకొని వారికి మనో ధైర్యాన్ని కల్గిద్దామని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు ధరణి కోట నర్సింహ అన్నారు. ఆదివారం సంస్థ సభ్యులు మచ్చ ఉపేందర్ గౌడ్ కుమార్తె మచ్చ వర్షిణి పుట్టినరోజు వేడుకలు వంగపల్లి లోని "అమ్మ ఒడి అనాదాశ్రమం"లో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనాధలకు, వృద్దులకు ఆదారణ కరువైందని ఆయన అన్నారు. నేటి సమాజంలో మానవత్వం , నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం లాంటివి పిల్లలకు బాల్యం నుంచే నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అమ్మ ఒడి అనాదాశ్రమంలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న "మచ్చ వర్షిణి ని" పలువురు ఆశీర్వదించారు. కార్యక్రమంలో వికలాంగుల పరిరక్షణ సమితి జిల్లా డైరెక్టర్ మచ్చ ఉపేందర్, నాయకులు జాగిల్లపురం అయిలయ్య, ఇంజ పద్మ, బబ్బూరి రాజు, మచ్చ బాలరాజు , ఆశ్రమం నిర్వాహకురాలు చింతకింది దివ్య, ఆశ్రమం లోని యవకులు, వృద్దులు పాల్గొన్నారు.

VijayaKumar

May 18 2024, 19:11

రెడ్ల రేపాక గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత : వలిగొండ ఎస్సై డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామ శివారులో గల ఎండి కాజా పౌల్ట్రీ ఫార్మ్ దగ్గర వాహనాల తనిఖీ లో అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. విశ్వనీయ సమాచారం మేరకు పోలీసులు వలిగొండ మండలంలో వివిధ గ్రామాల నుండి పేద ప్రజల దగ్గర తక్కువ రేటుకు పిడిఎస్ బియ్యాన్ని తీసుకొని ఎక్కువ రేటుకు అమ్ముతున్న యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని పి.బితండా గ్రామానికి చెందిన గగులోతు కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని టాటా ఏసీ వాహనంలో తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. వాహనంలో 17 బ్యాగుల ఉన్నాయని ఒక్కొక్క బ్యాగులో 60 కిలోల బియ్యం ఉన్నాయని అన్నారు. వీటి బరువు దాదాపు 10 క్వింటాల్ వరకు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.

VijayaKumar

May 18 2024, 18:49

ఆలేరులో రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిలువలను పరిశీలించి, ప్రతి గింజ కొంటామన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా  అలేరు పట్టంణంలోని మల్లికార్జున ఆగ్రో రైస్ మిల్లును *ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు* సందర్శంచారు ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులతో, రైస్ మిల్లు యజమానుల తో మాట్లాడారు.. రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిలువను పరిశీలించారు.గత వానాకాలం,యాసంగి ధాన్యం నిలువ ఉండటం వళ్లే ఈ కాలం ధాన్యం ఆన లోడింగ్ కు ఇబ్బందులు అవుతున్నయని పరిశీలినలో తెలుసుకున్నారు.అనంతరం ఆలేరు పట్టంణంలోని మార్కెట్ యార్డును పరిశీలించారు.రైతులతో,హామలి కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం పట్టణంలో విద్యుత్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు..ఎక్కడ కూడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.గతం కంటే ప్రస్తుతం విద్యుత్ ఎక్కువగా అందిస్తున్నట్లు అధికారులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి తెలిపారు. ఈ సందర్భంగా *బీర్ల ఐలయ్య* గారు మాట్లాడుతూ.గత వానాకాలం,యాసంగి,ధాన్యం 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాములో నిల్వలు ఉండటం వల్ల ఈ కాలం ధాన్యం నిలువ కు ఇబ్బందులు వస్తున్నాయన్నారు.గతంలో జూన్ 30వరకు కొనుగోళ్లు జరిగేవని,కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం లో అధికారుల చొరవ తో మరో 10రోజుల్లో టార్గెట్ పూర్తి చేస్తూ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతులు ఎవ్వరు ఆధర్యపడవద్దని,ధైర్యంగా ఉండాలని,ప్రతి గింజను ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.ప్రతి పక్షాలు అబద్దపు ప్రచారాలు చేసి రోడ్డు ఎక్కుతున్నారని అన్నారు,వరి వేస్తే ఉరి అన్న వారు నిరసన చేయడానికి అనర్హులు అన్నారు.రైతుల రుణమాఫీ కోసం,500రూపాయల బోనస్ ఇవ్వటం కోసం రైతులకు పెద్దపీట కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుందన్నారు.


VijayaKumar

May 18 2024, 18:10

భువనగిరి లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. గెలుపే లక్ష్యంగా చేసుకొని అందరం పని చేద్దామని కోరారు .కాంగ్రెస్ - బిఆర్ఎస్ పార్టీలు యువతకు చేస్తున్న మోసాన్ని ఎండగట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి విజయానికి అందరూ కృషి చేయాలని నాయకులను కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వరంగల్ నలగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, జిల్లాకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

VijayaKumar

May 18 2024, 14:34

తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా మంటి లింగయ్య నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామానికి చెందిన మంటి లింగయ్యను తెలంగాణ ఉద్యమ. కళాకారుల సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రమౌళి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంటి లింగయ్య మాట్లాడుతూ నా నియామకానికి సహకరించి నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రమౌళికి కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులం అనేక ధూంధాములు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి అనేక రకాలుగా నష్టపోయామని ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాలని ఆయన అన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కళాకారులందరూ ఏకం కావలసిన అవసరం ఉందన్నారు.

VijayaKumar

May 18 2024, 13:56

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా. బీబీనగర్ మండల లో బట్టుగూడెం, చిన్నరావులపల్లి గ్రామాలలో ఐకేపీ సెంటర్ లో వరి ధాన్యం ప్రభుత్వం కొనక పోవడం ,కాంట వేయకపోవడం పైన అధికారులను కలిసి రైతులు లను కలసిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల మార్కెట్ లో ధాన్యం తడిసి ముద్దయిందని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసానమోర్చా జిల్లా అధ్యక్షులు రాజేందర్ , బీజేపీ మండల అధ్యక్షులు ఎంజమూరి ప్రభాకర్ , జంగారెడ్డి , st మోర్చా నాయకులు రాజు నాయక్ , మండల, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.