ప్రజల పక్షాన పోరాడే సిపిఎం ను గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు
![]()
అవినీతికర బిజెపిని అవకాశవాద కాంగ్రెస్, బిఆర్ఎస్ ఓడించి ప్రజల పక్షాన పోరాడే సిపిఎం గెలిపించండి
- సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు*
అవినీతిలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న బిజెపిని, అవకాశవాద కాంగ్రెస్, బిఆర్ఎస్ లను ఓడించి ప్రజల పక్షాన పోరాడే సిపిఎం అభ్యర్థి ఎండి. జాహంగీర్ ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ అవినీతిపై పోరాటం చేస్తానన్న మోడీ ఇప్పుడు దేశంలో అత్యంత అవినీతి పార్టీగా బిజెపిని మార్చాడని విమర్శించారు. పైలెట్ జెట్ విమానాల కొనుగోలు, మైనింగ్ లీజు, ఎలెక్టోరల్ బాండ్స్ పేరుతో వేలకోట్ల దందా నడిపి కోట్లాది రూపాయలు కూడేసుకుని అవినీతినే బిజెపి చట్టబద్ధత చేసి లక్షల కోట్ల రూపాయలలో అవినీతికి పాల్పడిందని విమర్శించారు. మరోపక్క కార్పొరేట్ శక్తులకు, అవినీతిపరులకు మొత్తం ప్రభుత్వ రంగాన్ని దారా దత్తం చేశారని ఆవేదన వెలుబు ఇచ్చారు. దేశంలో నిరుద్యోగం, ఆకలి చావులు, రైతుల పైన మహిళల పైన దాడులు, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ, నిత్యవసర ధరలు పెంచడం లాంటివి బిజెపి పాలనలో పెరిగిపోయాయి అని అన్నా. మరో మారు దేశంలో బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వత్వం పెరుగుతుందని, రాజ్యాంగం, రిజర్వేషన్లు లేకుండా చేస్తారని అందుకే ఓటుతో బిజెపిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హక్కులను అమలు చేయాలని, సాగు తాగునీరు అందించాలని, విద్యా, వైద్యము అందరికి అందాలని పోరాడుతున్న సిపిఎం సిపిఎం తరఫున పోటీ చేస్తున్న ఎండి. జహంగీర్ గారిని అన్ని వర్గాల ప్రజలు ఆదరించి గెలిపించాలని నర్సింహ కోరినారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ పాల్గొని మాట్లాడగా ఈ సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, ఏదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలువేరి ఎల్లయ్య, ఎల్లముల వెంకటేష్, పాండాల మైసయ్య, కొండాపురం యాదగిరి, జిట్టా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.





భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా లోతుకుంట గ్రామంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కస్తూరి మాధురి గారు హాజరైనారు ఈ సందర్భంగా ఇంటింటి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని బూర నరసయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా గ్రామంలో నడుస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి వారిని కలవడం జరిగింది బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించాలని వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిఎన్ రెడ్డి , పార్లమెంటు కన్వీనర్ బందారపు లింగస్వామి జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,జిల్లా కార్య వర్గ సభ్యులు పాక పుల్లయ్య బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడి లింగస్వామి,మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కాకుల మాధవి, రంగా రేఖ, మహిళా మోర్చ కార్యదర్శి మందుల లక్ష్మి , బూరుగు లాస్య, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కందుల తానిస గౌడ్ , మండల ఉపాధ్యక్షులు డోగిపర్తి సంతోష్, దయ్యాల వెంకటేష్,మండల కోశాధికారి అప్పిషెట్టి సంతోష్ , మండల కార్యదర్శులు మైసూర్లో మచ్చగిరి మండల నాగరాజు,BJYM జిల్లా నాయకులు రేగురి అమరేందర్ , ఓబీసీ మోర్చా మండల అద్యక్షులు వెలిమినేటి వెంకటేశం,BJYM మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి,దంతురి అరుణ్,మహేష్, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.





యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తొర్రూరు ఎక్స్ రోడ్ వద్ద వలిగొండ పోలీసులు సోమవారం సాయంత్రం ఏడు గంటలకి పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు వలిగొండ నుండి చిత్తం పురం వైపు తన బైక్ పై వెళ్తున్న ఏనుగు నరేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా మల్లారెడ్డి వద్ద గల బ్యాగులో సరైన పత్రాలు లేని రూ.2,80,000 నగదును పట్టు కున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉన్నతాధికారులకి సమాచారం నిమిత్తం మరియు తదుపరి చర్య నిమిత్తము రెవెన్యూ అధికారులకు తెలిపామని అన్నారు. అలాగే మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 4225 విలువగల 16.9 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని వలిగొండ ఎస్ఐ డి మహేందర్ తెలిపారు.

నరేంద్ర మోడీ పాలన దేశానికి చాలా అవసరం

Apr 30 2024, 16:44
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.6k