TS :కొత్తగూడెం:యువత సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్:డివైఎఫ్ఐ
యువత సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్.
-డివైఎఫ్ఐ
యువత సంక్షేమానికి పాటుపడతామని చెబుతూనే, యువజన సర్వీసులు, క్రీడలకు బడ్జెట్లో నిరాశ జనకంగా కేటాయింపులు ఉన్నాయని, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అభిప్రాయపడింది. యువత సంక్షేమానికి గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ లోనే యువజనుల సర్వీసు శాఖకు సరైన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం అన్యాయం.2021-22 బడ్జెట్ లో 188 కోట్లు,2022-23 బడ్జెట్లో 176 కోట్లు,2024-25 బడ్జెట్లో 173 కోట్ల 93లక్షలు మాత్రమే కేటాయింపులు ఉన్నవి. ఈ కొద్దిపాటి నిధులతో రాష్ట్రంలో యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. యువజన సంక్షేమాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల ముందు పేర్కొన్న మాదిరిగా నిరుద్యోగ భృతి చెల్లింపు విషయంలో స్పష్టత ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటన, 2 లక్షల ఉద్యోగాలపై నామమాత్ర ప్రస్తావననే తప్ప స్పష్టత లేదు. ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీ సమావేశాల ముందు ప్రకటించిన మాదిరిగా సత్వరమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, గడువులోపు రెండు లక్షల ఉద్యోగాలుభర్తీ చేయాలి. యువజనులు క్రీడలు శారీరక నైపుణ్యం కేంద్రాలు పెంచాలి. యువత నైపుణ్య శిక్షణ అభివృద్ధి కొరకు ప్రత్యేక యూనివర్సిటీ నిర్మిస్తామని చెప్పిన మాటలకు బడ్జెట్లో మాత్రం ప్రస్తావించలేదు. విద్యారంగానికి ఆశించిన మేరకు బడ్జెట్ కేటాయింపులు లేవు పాఠశాల, ఉన్నత విద్య యూనివర్సిటీలు మరింత సంక్షోభంలో ఉన్నవి.బడ్జెట్ లో యువతని విస్మరించడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
Feb 12 2024, 16:28