/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఫుట్బాల్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ Mane Praveen
NLG: ఫుట్బాల్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ

నల్గొండ: మేకల అభినవ్ స్టేడియంలో చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న 25 మంది క్రీడాకారులకు, నిన్న సాయంత్రం గంటేకంపు బిక్షమయ్య సత్తెమ్మ ల స్మారకార్థం వారి కుమారులు రవీందర్, లెనిన్ లు స్పోర్ట్స్ కిట్స్ లను పంపిణీ చేశారు. 

ముఖ్యఅతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొని స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. క్రీడలు మనుగడ సాధించాలంటే స్పాన్సర్స్ ముందుకు రావడం ఎంతో ముఖ్యమని, ఆ రకంగా 25 మందికి స్పోర్ట్స్ కిట్స్ అందించడానికి ముందరికి వచ్చిన రవీందర్, లెనిన్ లను అభినందిస్తూ, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ గత దశాబ్ద కాలంగా నల్గొండ జిల్లాలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులను చేరదీసి వారిని చదువుతోపాటు, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తుందని తెలియజేశారు.అనంతరం స్పోర్ట్స్ కిట్స్ దాతలను మరియు ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ లను శాలువాతో అబ్బగోని రమేష్ గౌడ్ ఘనంగా సన్మానించారు.

స్పాన్సర్స్ గంటేకంపు రవీందర్, లెనిన్ లు మాట్లాడుతూ.. ఎంతో నిబద్ధతతో కూడిన క్రీడా వ్యవస్థ కలిగిన ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారులకు, మా తల్లిదండ్రులు గంటేకంపు బిక్షమయ్య సత్తెమ్మల స్మారకార్థం స్పోర్ట్స్ కిట్స్ అందజేస్తున్నామని, క్రీడల్లో చదువుల్లో రాణించే బీద విద్యార్థులకు భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారాలు అందిస్తామని తెలిపారు.

చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల నుండి నల్గొండ లో పాఠశాల దశ నుండే, ఒక మంచి స్పోర్ట్స్ కల్చర్ ను తయారు చేస్తూ నల్గొండ జిల్లా నుండి కబడ్డీ ఫుట్బాల్ జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తున్నామని, ఇటీవలనే చత్రపతి శివాజీ క్రికెట్ క్లబ్ ను కూడా ఏర్పాటు చేశామని తెలియజేస్తూ, క్రీడా వ్యవస్థలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ఒక భాగమైతే, స్పాన్సర్లు ముందుకు రావడం రెండవ భాగమని ఆ రకంగా నల్లగొండలో స్పోర్ట్స్ కల్చర్ ఇంకా డెవలప్మెంట్ కావాలంటే, క్వాలిటీ క్రీడాకారులను తయారు చేయాలంటే వివిధ కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు దాతలు ముందుకు రావాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న DYSO మక్బూల్ మొహమ్మద్ మాట్లాడుతూ.. మేకల అభినవ్ స్టేడియంలో అన్ని రకాల క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులు గ్రాస్ రూట్ నుండి తయారవుతున్నారని తెలియజేశారు. 

అనంతరం డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ మరియు చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అబ్బ గోలి రమేష్ గౌడ్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, పబ్బు సందీప్ గౌడ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, మరియు క్రీడా పోషకులు జాకటి బాలరాజు, అప్పల లింగయ్య, సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు రాచూరి వెంకట సాయి, కోక్కు యశ్వంత్, శివదాసు మరియు క్రికెట్, హాకీ, టైక్వాండో కోచ్ లు SK రహీం, యావర్, ప్రణీత్ లు, స్టేడియం ఇన్చార్జి కత్తుల హరి మరియు హాకీ, ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.

పుట్టిన తేదీ రుజువుగా ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఆధార్ కార్డు తొలగింపు: EPFO

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక ప్రధాన నిర్ణయంలో, పుట్టిన తేదీ (DOB) రుజువుగా ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఆధార్ కార్డును తొలగించింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నుండి వచ్చిన ఆదేశాల తర్వాత పుట్టిన తేదీకి ఆమోదయోగ్యమైన పత్రంగా ఆధార్ కార్డ్‌ను తీసివేసినట్లు EPFO తెలియజేసింది. జనవరి 16న జారీ చేసిన సర్క్యులర్‌లో, అనేక మంది లబ్ధిదారులచే పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించబడుతున్న ఆధార్.. ప్రాథమికంగా గుర్తింపు ధృవీకరణ సాధనం మరియు పుట్టిన రుజువు కాదని EPFO పేర్కొంది.

ఈ సర్క్యులర్‌కు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (సీపీఎఫ్‌సీ) నుంచి అనుమతి లభించింది. ఇటీవలి కొన్ని కోర్టు తీర్పులు కూడా ఆధార్‌ను పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని బలపరిచాయి.

చౌటుప్పల్: ఘనంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మెన్ వెన్ రెడ్డి రాజు జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మెన్ వెన్ రెడ్డి రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రములో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమములో, అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిదులు పురపాలక సభ్యులు సిబ్బంది కార్మికుల సమక్షంలో వేడుకలు జరిగాయి.

ఈ సందర్బంగా మున్సిపల్ కార్మికులకు ఆర్పి లకు సిబ్బందికి వెన్ రెడ్డి రాజు తన పుట్టిన రోజు సందర్బంగా దుస్తుల పంపిణీ చేశారు.

అనంతరం వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పట్టణ అభివృద్ది లో అందరి సహకారముతో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. అదేవిదంగా అమ్మ నాన్న ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు మరియు చెరువు గట్టు ఆలయములో అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మెన్ బత్తుల శ్రీశైలం గౌడ్, కౌన్సిలర్లు కొరగొని లింగస్వామీ, బత్తుల రాజ్యలక్ష్మి, బండమీది మల్లేష్, అంతటి విజయలక్ష్మి బాలరాజు, ఆలె నాగరాజు, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, కొయ్యడ సైదులు, సుల్తాన్ రాజు, ఉబ్బు వరమ్మ వెంకటయ్య, గోపాగొని లక్ష్మణ్ గౌడ్, కామిశెట్టి శైలజ భాస్కర్, MD బాబా షరీఫ్, నాయకులు దండ అరుణ్ కుమార్, బోడిగే బాలకృష్ణ, తాడూరి పరమేష్ మున్సిపల్ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆకుల ఇంద్ర సేన రెడ్డి, బోయ దేవేందర్, సుర్వి నర్సింహా, చింతల సాయిలు, చింతల వెంకట్ రెడ్డి, జాని బాయి, కుక్కల నర్సింహా, కోసనం భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RR: నూతన ఆర్టిఏ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే

రంగారెడ్డి జిల్లా: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ లో రామోజీ ఫౌండేషన్ వారి సహకారం తో నిర్మించిన నూతన ఆర్టిఏ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు.

ఖమ్మం: కుప్పకూలిన గ్రీన్‌ ఫీల్డ్ హైవే బ్రిడ్జి..

ఖమ్మం:

కుప్పకూలిన గ్రీన్‌ ఫీల్డ్ హైవే బ్రిడ్జి..

బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు కార్మికులు..

నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

మరింత సమాచారం తెలియాల్సి ఉంది

NLG: బీఎస్పీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యేకుల రాజారావు ఆధ్వర్యంలో నూతన నియోజకవర్గ కమిటీలు

నల్లగొండ జిల్లా:

బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ మరియు మిర్యాలగూడ నియోజకవర్గాలలో బుధవారం సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాల్లో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యేకుల రాజారావు ముఖ్యఅతిధి గా పాల్గొని రెండు నియోజకవర్గాలలో నూతన నియోజకవర్గ కమిటీలు వేయడం జరిగింది. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యేకుల రాజారావు మాట్లాడుతూ.. అందరూ కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, బూత్ లెవెల్ కమిటీ నిర్మాణాలే ప్రామాణికం అని నాయకులకువివరించారు.

అలాగే జన కళ్యాణ్ దివాస్ గురుంచి పూర్తిగా వివరించి వారికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. రెండు నియోజకవర్గాల పట్టభద్రులు అందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు కత్తుల కాన్షిరాం, జిల్లా కోశాధికారి గండు నాగేంద్రబాబు, నియోజకవర్గ అధ్యక్షులు పెరిక అభిలాష్ ,పుట్టల దినేష్ నల్లగొండ మరియు మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు, మండలాల నాయకులు, మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు.

NLG: మోసపూరితమైన ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోవద్దు: ఎస్పీ

నల్లగొండ: మోసపూరితమైన ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ లను మెసేజ్ లను క్లిక్ చేసి మోసపోవద్దు అని జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు.

TS: నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:

నల్లగొండ మున్సిపాలిటీ ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి బుధవారం నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్ నుంచి పానగల్ రోడ్డు వరకు 90 లక్షల రూపాయల NCAP నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు, శంకుస్థాపన చేశారు.

తర్వాత NG కళాశాల నుంచి రామగిరి వరకు కోటి 30 లక్షల రూపాయల నిధులతో విస్తరిస్తున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ సెంటర్ ని పరిశీలించిన మంత్రి చేపట్టాల్సిన మార్పుల గురించి కలెక్టర్ కు పలు సూచనలు చేశారు.

అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో 244 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, యుపిఎస్సి తరహాలో గ్రూప్స్ పరీక్షలని నిర్వహిస్తామని, నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు.

సంక్షేమ పథకాల కోసం ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందిస్తామని ఆయన వెల్లడించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారంపై అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

Mane Praveen

నల్లగొండ: ఆర్డీవో కార్యాలయంలో సమాచార హక్కు వికాస సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సమాచార హక్కు వికాస సమితి

NLG: ప్రజాహితం కోసమే సమాచార హక్కు వికాస సమితి: యర్రమాద కృష్ణారెడ్డి
నల్లగొండ: ఆర్డీవో కార్యాలయంలో సమాచార హక్కు వికాస సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాహితం కోసం సమాచార హక్కు వికాస సమితి పనిచేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు.
ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్

భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా నాగాలాండ్‌ లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్ప‌లు చెప్పే ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అల‌క్ష్యం చేశార‌ని మండిపడ్డారు.మౌలిక వ‌స‌తుల లేమితో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు.

ఇది నాగాలాండ్ ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మేన‌ని విమర్శించారు.