మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా ఏకమవుతున్న వృత్తి సంఘాలు
సూర్యాపేటలో మంత్రిని కలిసి మద్దతు తెలిపిన సూర్యాపేట కార్పెంటర్స్ అసోసియేషన్
నూతన సంఘాన్ని అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కి మద్దతుగా వృత్తి కుల సంఘాలు ఏకమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ వైపే మా పయనం అంటూ వృత్తి , కల , సంఘాలు ఒకొక్కరిగా మంత్రి కి మద్దతు తెలుపుతున్నారు.
తాజాగా సూర్యాపేటలో నూతనంగా ఏర్పడిన కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రిని కలిసి తమ మద్దతును ప్రకటించారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి తో తమకు చేదినిండా పని దొరుకుతుందని, మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు.
సూర్యాపేట ప్రజలంతా మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా ఏకతాటిపై నిలిచి జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కాగా నూతన అధ్యక్షుడు గా బైరోజు లింగాచారి,
కార్యదర్శి గా,కట్టోజు గోపి
ఉపాధ్యక్షులు గా పర్వతం భుషణాచారి,సహాయ కార్యదర్శి.. బహురోజు ..ఉపేందర్ ఎన్నిక అవగా వారందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. గౌరవ అధ్యక్షుడు పుట్టా కిషోర్ ఆద్వర్యం లో జరుగగా కార్యక్రమం లో కాసోజు మాధనాచారి,
కురెళ్లి మనోహర్,కేషవరపు కిరణ్
పోతుగంటి వీరాచారి,జనగాం వీరాచారి మోత్కురి వినోద్ పాల్గొన్నారు.











Oct 21 2023, 13:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.2k