షాద్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
షాద్‌నగర్ నియోజకవర్గంలో గురువారం మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. కొల్లూరులో నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనం, డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం షాద్‌నగర్‌లో 1700 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. బంజారా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం షాద్‌నగర్ మార్కెట్ యార్డులో జరిగే సభలో పాల్గొంటారు.
మధ్యా హ్నం రావిర్యాలలో విజయ మెగా డెయిరీని ప్రారంభిస్తారు. తర్వాత వికారాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన భవన్, రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.
సాయంత్రం 5 గంటలకు కూకట్‌పల్లి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం కేపీహెచ్‌బీలోని కేటీఆర్ పార్కులో జరిగే సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు...











Oct 05 2023, 14:18
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.5k