అక్టోబర్ 2న జైల్లో చంద్రబాబు నిరసన దీక్ష
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను నిర్భంధించిన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే గాంధీ జయంతి రోజున నిరసన దీక్ష చేయనున్నారు.
తనకు జరిగిన అన్యాయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. గాంధీ జయంతి రోజు జైల్లో దీక్ష చేయాలని చంద్రబాబును కోరామని, ఆయన అంగీకరించారని తెలిపారు.
అదే రోజున ఆయన సతీమణి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో ఒకరోజు దీక్ష చేస్తారని తెలిపారు. ఇందుకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సోమవారం సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాల పాటు ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు...












Oct 02 2023, 17:11
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.6k