టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి దీక్ష
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం నిరసన దీక్షకు దిగనున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో దీక్ష చేపట్టనున్నారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నారు. నిన్న ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన మోత్కుపల్లి.. ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసుల అరెస్టును బీఆర్ఎస్ అధినేత ఇప్పటివరకూ ఖండించకపోవడంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రాజకీయాలకు అతీతంగా ఆ అరెస్టును ఖండించాల్సి ఉన్నదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అరెస్టులను ఖండించడం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు ఈ అరెస్టు వ్యవహారంలో కేసీఆర్ మౌనంగా ఉండడాన్ని అదే పార్టీకి చెందిన మోత్కుపల్లి నర్సింహులు
ప్రశ్నించడం గమనార్హం...
Sbnews














Sep 24 2023, 14:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.0k