/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు రక్షణ కోట్ లు ఇవ్వాలి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్ Miryala Kiran Kumar
సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు రక్షణ కోట్ లు ఇవ్వాలి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్

సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు రక్షణ కోట్ లు ఇవ్వాలి     ---------- కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్

      

సింగరేణిలో పనిచేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డులందరికీ వర్షం మరియు చలి వల్ల డ్యూటీ ల వద్ద ఇబ్బందులు కలగకుండా రక్షణ కోసం వర్షం,చలి కోట్ లను ఇవ్వాలని ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం నాడు కార్పొరేట్ లోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతు సింగరేణి ఎస్ అండ్ పిసి వారు సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా వర్షము చలి కోట్ లను ఇప్పించ వలసి ఉన్నదని అందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ఇతర విభాగాల కార్మికులకు చెల్లించినట్టుగా మెడికల్ కు సంబంధించిన డబ్బులను రియంబర్స్మెంట్ చేసి ప్రైవేట్ గార్డులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రేయింబవళ్లు సింగరేణి ఆస్తులను కాపాడటంలో మరియు భద్రతను కల్పించడంలో నేడు ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల శ్రమ కీలకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, జాకీర్, మోహన్, గౌస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులకు, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులకు, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. అనర్హులను సభ్యులుగా నియమించడం పై అభ్యంతరం

శివ శంకర్. చలువాది

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఆలయాన్ని నిర్వహించే సంస్థ టీటీడీ.. ఈ సంస్థ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశ్యం స్వామివారి ఆలయం బాగోగులు చూడడమే.. 

అంతేకాదు దేశం నలువైపులా వివిధ సామజిక, ధార్మిక, సాంస్కృతి వంటి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూ ధర్మాన్ని విస్తరింపజేస్తుంది.

 ఈ నేపథ్యంలో టీటీడీ సంస్థ నిర్వహణ కోసం చైర్మన్, బోర్డు మెంబర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే కొత్తగా టీటీడీ సభ్యులను ప్రభుత్వం నియమించింది. 

వారికీ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నేర చరిత్ర ఉన్నవారిని బోర్డు సభ్యులుగా నియమించడంపై అభ్యంతరం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.

టీటీడీలో ఏర్పాటు చేసిన కొత్త పాలకమండలి సభ్యుల్లో కొందరికి నేర చరిత్ర ఉందని హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డికి పర్సనల్ నోటీసులు జారీ చేసింది హైకోర్టు. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు విజయవాడకి చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు.. మంచి నడవడిక లేని, అనర్హులను, నేర చరిత్ర ఉన్నవారిని టీటీడీ సభ్యులుగా నియమించడం చట్ట వ్యతిరేకమని హైకోర్టుకు విన్నవించారు.. పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్, జస్టిస్ రఘునందన రావు ధర్మాసనం.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. శిక్ష ఇంకా విధించని కారణంగా వారు నేరస్థులుగా పరిగణించలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.

మరోవైపు.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఇండియా సభ్యత్వం నుండి తొలగింప బడిన కేతన్ దేశాయ్‌ను టీటీడీ సభ్యుడిగా నియమించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు చింతా వెంకటేశ్వర్లు తరపు న్యాయవాది శ్రావణ్.ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి విచారణ ఎదుర్కొన్నారని, సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు వున్నాయని పిటిషనర్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

అమెజాన్లో బధిరులకు ఉద్యోగాలు..

అమెజాన్లో బధిరులకు ఉద్యోగాలు..

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో బధిరులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలంగాణ వికలాంగుల మరియు వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ తెలిపింది.

ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌లో బధిరులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలంగాణ వికలాంగుల, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్‌ వ్యక్తుల సాధికారత శాఖ తెలిపింది.

పదో తరగతి.. ఆపై చదువుకున్న 18 నుంచి 35 ఏండ్ల వయసున్న బధిరులు ఈ నెల 15న హైదరాబాద్‌ (మలక్‌పేట)లోని కార్యాలయంలో తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నది.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి ట్రాన్స్‌జెండ‌ర్

*అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి ట్రాన్స్‌జెండ‌ర్* 

కెనడాకు చెందిన డేనియెల్లె మెక్‌గ‌హే(Danielle McGahey) త్వ‌ర‌లోనే అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌లో అరంగేట్రం చేయ‌నుంది. దాంతో, తొలి ట్రాన్స్‌జెండ‌ర్ క్రికెట‌ర్‌(First Transgender Cricketer)గా ఆమె గుర్తింపు చరిత్ర సృష్టించ‌నుంది.

ఓపెనింగ్ బ్యాట‌ర్ అయిన డేనియెల్లె వ‌చ్చే ఏడాది పొట్టి ప్రపంచ క‌ప్ క్వాలిఫ‌యింగ్ స్క్వాడ్‌(2024 Women’s T20 World Cup Qualifying Squad)లో చోటు ద‌క్కించుకుంది.

ఐసీసీ(ICC) నుంచి ఎలాంటి అభ్యంత‌రాలు లేక‌పోవ‌డంతో కెన‌డా సెలెక్ట‌ర్లు డేనియెల్లేను సెలెక్ట్ చేశారు.

‘నేను క్రికెట‌ర్ అవుతాన‌ని క‌లలో కూడా అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు మా క‌మ్యూనిటీ త‌ర‌ఫున దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌బోతున్నా. అందుకు చాలా సంతోషంగా, చాలా గ‌ర్వంగా ఉందని అన్నారు.

క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు!

క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు!

```డాక్టర్ గుప్తా మాట్లాడుతూ, నిర్లక్ష్యంతో పాటు ఎవరూ క్యాన్సర్‌తో చనిపోకూడదు. ;(1) చక్కెర తీసుకోవడం మానేయడం మొదటి దశ. మీ శరీరంలో చక్కెర లేకుండా, క్యాన్సర్ కణాలు సహజంగా చనిపోతాయి.

 ;(2) రెండవ దశ ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి 1-3 నెలల పాటు ఉదయం భోజనానికి ముందు తాగితే క్యాన్సర్ పోతుంది. మేరీల్యాండ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, కీమోథెరపీ కంటే వేడి నిమ్మ నీరు 1000 రెట్లు మెరుగైనది, బలమైనది మరియు సురక్షితమైనది.

(3) మూడవ దశ ఏమిటంటే, ఉదయం మరియు రాత్రి 3 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ కొబ్బరి నూనెను త్రాగాలి, క్యాన్సర్ అదృశ్యమవుతుంది, మీరు చక్కెరను నివారించడం సహా ఇతర రెండు చికిత్సలలో దేనినైనా ఎంచుకోవచ్చు.

అజ్ఞానం ఒక సబబు కాదు. నేను 5 సంవత్సరాలకు పైగా ఈ సమాచారాన్ని పంచుకుంటున్నాను. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్పండి, క్యాన్సర్‌తో చనిపోవడం ఎవరికైనా అవమానకరం; ప్రాణాలు కాపాడేందుకు విస్తృతంగా షేర్ చేయండి.

స్వచ్ఛ సర్వేక్షణ్ కింద నల్లగొండ నియోజకవర్గంలో అప్పాజిపేట ఎంపిక

స్వచ్ఛ సర్వేక్షణ్   కింద నల్లగొండ నియోజకవర్గంలో అప్పాజిపేట ఎంపిక           

 నల్లగొండ : స్వచ్ఛ సర్వేక్షణ్  గ్రామీణ -2023 సంవత్సరం కింద నల్లగొండ మండలం అప్పాజిపేట ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. నల్లగొండ జిల్లాలో మొత్తం 12 గ్రామ పంచాయతీలు ఎంపిక కాగా , నల్లగొండ నియోజకవర్గంలో అప్పాజిపేట సెలక్ట్ అయ్యింది.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్తులో గ్రామ సర్పంచ్ పబ్బతిరెడ్డి రవీందర్ రెడ్డిని , కార్యదర్శి ఉపేందర్ ను జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి , కలెక్టర్ ఆర్ వి. కర్ణన్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ , జడ్పీ సిఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి , ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి , ఎంపీవో మాధవరెడ్డిలు ఉన్నారు.

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలు

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలు

నేడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఉద్యమ సూర్యుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న ఆర్ కృష్ణ అన్న జన్మదిన సందర్భంగా నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కేకు కట్ చేసి స్వీట్ల పంపిణీ సంబరాలతో బీసీ సంక్షేమ సంఘం యువజన సంఘం ఉద్యోగుల సంఘం మహిళా సంఘం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన సంబరాలు చేయడం జరిగింది.

ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి గారు కేక్ కట్ చేసి వారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిరంతరం బీసీల కోసం గత 50 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నటువంటి అహర్నిశల్ కృషి చేస్తున్న ఏకైక లక్ష్యం బీసీ వర్గాలు చట్టసభల్లో లేనంత కాలం మనకు రాజ్యాధికారం పొద్దలేమని ఉద్దేశంతో చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చేంతవరకు కుల సంఘాలు తో పాటు మేధావులు అన్ని వర్గాల ప్రజలు అన్న ఆర్ కృష్ణ అన్నకు మద్దతు తెలియజేస్తూ వారి ఉద్యమానికి రిజర్వేషన్లు వచ్చేంతవరకు మద్దతు ఇవ్వాలని నలగొండ బీసీ సంక్షేమ సంఘం ప్రతి ఒక్కరికి విజ్ఞ ప్తి చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిసి మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ మత్స్యకారుల రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన వెంకటరమణ ముదిరాజ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నా ప్రసన్న కుమార్ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల యాదన్న యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి మార్గం సతీష్ కుమార్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శులు భరత్ మల్లె పోయిన సతీష్ యాదవ్ మార్గం సతీష్ పగిళ్ల కృష్ణ చిలుకూరి శ్రీనివాస్ వలకీర్తి శ్రీనివాస్ సుజాత వనం లలిత రుద్ర లక్ష్మీనారాయణ రవీంద్ర చారి వెంకటాచారి దుడుకు తిరుపతయ్య ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో మరో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు

తెలంగాణలో మరో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ :సెప్టెంబర్‌ 12

ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాష్ట్రంలో మరో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 272 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించింది...

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈనెల 15 వరకు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈనెల 15 వరకు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే 3 రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో.. ఈ నెల 15 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు..

గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..పార్వతీపురం, అల్లూరి, ప్రకాశం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు..

జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో ఎన్‌కౌంటర్‌.. ఓ ఉగ్రవాది హతం

Jammu Kashmir: రాజౌరీలో ఎన్‌కౌంటర్‌.. ఓ ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. నార్ల గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి..

అయితే ఈ క్రమంలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. మంగళవారం రాజౌరీ జిల్లాలోని మారుమూల గ్రామంపై సెర్చ్ చేయడానికి వెళ్లిన భద్రతా బలగాల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు..