/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ Yadagiri Goud
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల:ఆగస్టు 13

తిరుమలలో వీకెండ్ కావడంతో తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది

శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో

భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 82,265 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

శ్రీవారికి 41,300 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.....

Revanth reddy: 'తిరగబడదాం.. తరిమికొడదాం..' నినాదంతో ముందుకెళ్లాలి: రేవంత్‌

హైదరాబాద్‌: 'తిరగబడదాం.. తరిమికొడదాం' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు..

భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం రూపొందించినట్టు తెలిపారు. బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడుతూ..

నెల రోజుల పాటు గ్రామ గ్రామాన భారాస వైఫల్యాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

ఇందులో భాగంగా భారాస ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ పార్టీ ఛార్జ్‌షీట్‌ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. 12వేల గ్రామాల్లో, 3వేల డివిజన్లలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75లక్షల కుటుంబాలను కాంగ్రెస్‌ శ్రేణులు కలుస్తారని వెల్లడించారు..

నిజాం కాలేజీలో చదువుకోవడం నాకు గర్వంగా ఉంది..: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

1933 నుంచి 96 వరకు ఈ కాలేజీలో చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు. కాలేజీకి గొప్ప పేరుందన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు తాను నిజాం కాలేజీలో చదువుకున్నట్లు గొప్పగా చెబుతానని వెల్లడించారు.

హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ లో బాయ్స్‌ హాస్టల్‌, న్యూ కాలేజీ బ్లాక్‌కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీతో కలిసి శనివారం మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. యూనివర్సిటీల పరంగా తెలంగాణకు నాలుగవ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఓయూ అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదని చెప్పారు. వర్సిటీ వీసీ రవీందర్ కూడా ఓయూ అభివృద్ధి కోసం మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.

యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా ప్రారంభించిన కార్యక్రమం బాగుందన్నారు. తెలంగాణ టీశాట్‌తో కలిసి ఉస్మానియా టీవీ ఏర్పాటు చేయడం ద్వారా మారుతున్న పరిస్థితులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విద్యను మరింతమందికి అందించేలా ప్రయత్నం చేయడం స్వాగతించదగిన విషయమని చెప్పారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. నిజాం కాలేజీ కోసం నిధులు ఇవ్వలేదని విమర్శించారు. ఆయన కూడా నిజాం కాలేజీ విద్యార్థేనని గుర్తుచేశారు.

గతంలో ఈ కాలేజీలో డిగ్రీ చదువుతున్న బాలికలకు హాస్టల్ వసతి లేకపోవడంతో వెంటనే నిర్మాణం చేసి, ప్రారంభించుకున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. విద్యాశాఖకు నిధులకు అదనంగా పురపాలక శాఖలోని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.40.75 కోట్లు ఇచ్చామన్నారు.

నేడు బాయ్స్ హాస్టల్‌తోపాటు అదనపు తరగతి గదులను నిర్మించుకోబోతున్నామని తెలిపారు. వచ్చే 15 నెలల్లో భవనాల నిర్మాణాలను పూర్తిచేస్తామన్నారు. కాలేజీ గ్రౌండ్‌కు ఇబ్బంది రాకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

నిర్మాణం కోసం మా నిధుల తోపాటు మంత్రి కేటీఆర్ HMDA నిధులు కూడా ఇచ్చినందుకు కేటీఆర్‌కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మొదటిసారి నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థులకు కూడా హాస్టల్ కల్పించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారని, యూనివర్సిటీల కోసం 500 కోట్లు ముఖ్యమంత్రి కేటాయించారని వెల్లడించారు.

గురుకులాలు ఏర్పాటు చేసిన తర్వాత ఉన్నత విద్యలో అమ్మాయిల సంఖ్య పెరిగిందని చెప్పారు. కల్యాణ లక్ష్మితో వచ్చిన డబ్బును కొంతమంది అమ్మాయిలు ఉన్నత చదువుల కోసం వాడుకుంటున్నారని తెలిపారు....

Justice NV Ramana: రాజద్రోహం సెక్షన్‌ను ఆనాడే నిలిపేసిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

దిల్లీ రాజద్రోహం సెక్షన్‌ను భారతీయ శిక్షాస్మృతి నుంచి రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించినా.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ 15 నెలల కిందటే దాన్ని నిలుపుదల చేశారు..

ఐపీసీలోని సెక్షన్‌ 124ఎ కింద ఎలాంటి కేసులూ నమోదుచేయొద్దని, వలస పాలకులు తెచ్చిన ఆ చట్టాన్ని సమీక్షించాలని ఆయన 2022 మే 11న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేశారు.

''చట్ట సమీక్ష పూర్తయ్యేంతవరకూ రాజద్రోహ నిబంధనలు ప్రయోగించించడం మంచిదికాదు. 124ఎ సెక్షన్‌ కింద కొత్త కేసులు నమోదుచేయడంకానీ, విచారణ కొనసాగించడంకానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు. ఒకవేళ కొత్తగా ఆ సెక్షన్‌ కింద కేసులు నమోదుచేస్తే దాన్నుంచి విముక్తి కోసం సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చు..

సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అనుసరించి కోర్టులు నిందితులకు ఉపశమనం కల్పించవచ్చు'' అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆరోజు ఉత్తర్వులు జారీచేశారు. అలాగే బ్రిటిష్‌ కాలంలో తయారైన చట్టాలను భారతీయీకరించాలని, నేటి పరిస్థితులకు అనుగుణంగా అందులో మార్పులు తేవాలని ప్రధాన న్యాయమూర్తి హోదాలో ప్రతి సభ, సమావేశాల్లో ఆయన చెబుతూ వచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఆ దిశలోనే సాగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం తెచ్చిన కొత్త బిల్లు ప్రకారం దేశద్రోహానికి పాల్పడితే కేసులు నమోదుచేయడానికి వీలవుతుంది. రాజద్రోహానికి పాల్పడితే కేసులు పెట్టడానికి వీల్లేదు..

శంషాబాద్‌లో హత్యకు గురైన మహిళ మంజుల గా గుర్తింపు

శంషాబాద్‌లో దిశ తరహాలో ఓ మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇది తెలంగాణలో సంచలనం సృష్టించింది. అయితే.. మహిళ దారుణ హత్య కేసులో పోలీసులు కాస్త పురోగతి సాధించారు. హత్యకు గురైన మహిళ ఎవరో గుర్తించారు.

శంషాబాద్‌లో దారుణ హత్యకు గురైన మహిళ మంజులగా పోలీసులు గుర్తించారు. మంజుల స్వస్థలం.. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని దొడ్డి గ్రామం. ఈ నెల 10 న కడుపులో నొప్పి వస్తుందని హాస్పిటల్‌కు వెళ్లేందుకు మంజుల బయటకు వచ్చింది. ఈ మేరకు శంషాబాద్ రూరల్ పోలీసులకు భర్త లక్ష్మయ్య ఫిర్యాదు చేశారు.

నిందితుల కోసం పది బృందాలుగా ఎస్ఓటి పోలీసులు గాలిస్తున్నారు. పెట్రోల్ బంక్ లో రికార్డ్ అయిన సిసి విజువల్స్ ఆధారంగా నిందితుల కోసం గాలింపులు నిర్వహిస్తున్నారు.

పెట్రోల్ బంక్‌లో ఐదు లీటర్ల డీజిల్ తీసుకున్న ఇద్దరు వ్యక్తులే నిందితులా? లేదంటే మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది...

RS Praveen Kumar: పోలీసుల గృహనిర్బంధంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ గన్ పార్క్ వద్ద ఇవాళ ఆయన సత్యాగ్రహ దీక్షను తలపెట్టారు..

ఈ క్రమంలో ప్రవీణ్‌ కుమార్‌ను కలిసి దీక్ష వివరాలు అడిగిన పోలీసులు.. అనంతరం ఇంట్లోనే నిలువరించారు.

పార్టీ నేతలు, కార్యకర్తలను ఇంట్లోకి అనుమతించడం లేదు. దీంతో ఇంట్లోనే తన దీక్షను కొనసాగిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని వెల్లడించారు..

గ్రూప్‌-2 పరీక్ష వాయిదాపై 14న నిర్ణయం

గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్‌పీఎస్సీ నివేదించింది.

ఈ నెల 29, 30న జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ డీ మహేశ్‌ సహా 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ పీ మాధవీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు.

ఇదే నెలలో గ్రూప్‌-2 సహా వేర్వేరు పోటీ పరీక్షలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గిరిధర్‌రావు, నర్సింగ్‌ చెప్పారు. ఈ దశలో గ్రూప్‌-2ను వాయిదా వేయాలని పిటిషనర్‌ వినతిపత్రం ఇచ్చినా కమిషన్‌ స్పందించలేదని తెలిపారు.

ఇప్పటికే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్‌రావు కోర్టుకు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారని, ఆయా కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు కూడా ప్రకటించిందని వివరించారు...

మత్తు లో దారుణం.. ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి

గంజాయి మత్తులో ఓ యువకుడు ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసిన ఘటన

గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది.

స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బాలుడు

శుక్రవారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు.

అటుగా వచ్చిన నాగిశెట్టి పవన్‌ సంజయ్‌ (20) గంజాయి మత్తులో బాలుడిని గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలుడి కేకలు విన్న స్థానికులు యువకుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

శనివారం తిరుమలలో భక్తుల రద్దీ బాగానే ఉంది

శనివారం తిరుమలలో భక్తుల రద్దీ బాగానే ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శుక్రవారం 72,158 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.08 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

నేడు స్వామివారికి 30,735 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా? లేనట్లేనా ❓️

వాయిదా వేయాలంటూ టీఎస్‌పీఎస్సీ ముట్టడికి అభ్యర్థుల యత్నం

గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్షలు జరుగుతాయన్న అభిప్రాయాన్ని టీఎస్ పీఎస్సీ అధికారులు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరీక్షలను వాయిదా వేస్తే.. మళ్లీ ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు.

గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న అభ్యర్థనపై టీఎ్‌సపీఎస్సీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా.. రాబోయే రోజుల్లో అనేక ఇతర పరీక్షలు ఉండటంతోపాటు దసరా సెలవులు, అనంతరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వంటి వాటితో ఈ పరీక్షలను ఇక నిర్వహించడం కష్టమన్న వాదన ఉంది. ఒకవేళ, వాయిదా వేయాలంటే తిరిగి అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో సుమారు 783 ఖాళీ గ్రూపు-2 పోస్టుల భర్తీ కోసం డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం సుమారు 5.51 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పరీక్షలను ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్టు టీఎస్ పీఎస్సీ ఫిబ్రవరిలో ప్రకటించింది.

ఈ మేరకు మిగిలిన పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా రూపొందించింది. ఇందులో భాగంగా, ఈ నెల్లోనే గురుకులాల్లో భర్తీ చేసే కొన్ని పోస్టుల పరీక్షలు కూడా ఉన్నాయి. దాంతో గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టీఎ్‌సపీఎస్సీ అధికారులకు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. తాజాగా టీఎ్‌సపీఎస్సీని ముట్టడించారు.

టీఎస్‌ పీఎస్సీ ముట్టడి యత్నం.. ఉద్రిక్తత

గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ వివిధ జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన అభ్యర్థులు కదం తొక్కారు. గురువారం ఉదయాన్నే అకస్మాత్తుగా టీఎ్‌సపీఎస్సీని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

కానీ, భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాలుగు వైపుల నుంచి దూసుకొచ్చిన అభ్యర్థులను విడతలవారీగా నిలువరించి ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, అభ్యర్థుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అనంతరం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లి అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు.

గ్రూపు-2 పరీక్షలు మూడు నెలల వాయిదా వేయాలని, సిలబస్‌ భారాన్ని తగ్గించాలని నినాదాలు చేశారు. ఏడేళ్లుగా గ్రూపు-2 పరీక్షలు గుర్తుకురాలేదని, ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వం హడావిడిగా వరుసగా పలు పోటీ పరీక్షలు నిర్వహిస్తోందని, దీనివల్ల ప్రిపరేషన్‌కు ఇబ్బందిగా ఉందని.. తక్షణమే గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.

టీఎస్ పీఎస్సీ చైర్మన్‌ వచ్చి స్పష్టమైన హమీ ఇచ్చేవరకు కదిలేది లేదన్నారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ వారికి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మూడు నెలలు గ్రూపు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. గ్రూప్‌ 2 పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికితే కాంగ్రెస్‌ నాయకులను అరెస్ట్‌ చేసి పాలకులు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రియాజ్‌ను మఫ్టీ పోలీసులు అతని కోచింగ్‌ సెంటర్‌లో అరెస్ట్‌ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారని, NSUI అధ్యక్షుడు వెంకట్‌ను అరెస్ట్‌ చేశారని, విద్యార్థుల పక్షాన ప్రజాస్వామిక పోరాటం చేస్తున్న నాయకులను అరెస్టులు చేయడం అక్రమమని విమర్శించారు. విద్యార్థుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు......