/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz No-Confidence Debate: 'అవిశ్వాసం'పై చర్చ.. అధికార, విపక్షాల నుంచి మాట్లాడేది వీరే.. Yadagiri Goud
No-Confidence Debate: 'అవిశ్వాసం'పై చర్చ.. అధికార, విపక్షాల నుంచి మాట్లాడేది వీరే..

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి 'ఇండియా' లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Debate)పై చర్చ ప్రారంభం..

12 గంటలకు అవిశ్వాస తీర్మానంపై డిబేట్‌ మొదలుపెట్టనున్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఇది కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాలు చర్చకు సిద్ధమయ్యాయి.

అటు ప్రధాని మోదీ (Modi) నేతృత్వంలో భాజపా (BJP) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అవిశ్వాసంపై ఎలా స్పందించాలన్న దానిపై ఈ భేటీలో చర్చించారు. మరోవైపు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కార్యాలయంలో విపక్ష కూటమి 'ఇండియా (India)' నేతలు సమావేశమయ్యారు..

చర్చ రాహుల్‌తో ప్రారంభం..

విపక్ష కూటమి 'ఇండియా' తరఫున చర్చను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీలు గౌరవ్‌ గొగొయ్‌, మనీశ్ తివారీ, దీపక్‌ బైజ్‌, అధిర్‌ రంజన్‌ చౌధరీ, బెన్నీ బెహనాన్‌, హిబి ఈడెన్‌, టీఎన్‌ ప్రతాపన్‌, డీన్‌ కురియకోస్‌ చర్చలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి..

ఇక అధికార పక్షం తరఫున ఐదుగురు మంత్రులు, ఐదుగురు ఎంపీలు అవిశ్వాసంపై సమాధానమివ్వనున్నట్లు తెలుస్తోంది. భాజపా తరఫున నిషికాంత్‌ దూబే చర్చను ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అమిత్ షా, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్‌ రిజిజు చర్చలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 9న అమిత్‌షా సమాధానమివ్వనున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ ఇచ్చిన ఈ అవిశ్వాస తీర్మానంపై గురువారం వరకూ 3 రోజులపాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ సమాధానమిస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఓటింగ్‌ జరుగుతుంది..

పేలిన పెట్రోల్‌ బంక్‌.. ఎగసిపడిన మంటలు

తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పేలింది. పేలడు ధాటికి భారీ శబ్దం రావడంతో ప్రజలు భయబాంత్రులకు గురయ్యారు..

వివరాల్లోకి వెళితే.. తొస్సిపూడి గ్రామంలోని ఇండియన్‌ బంక్ ప్రక్కన ఉన్న షెడ్డులో బాణాసంచా నిల్వ ఉంచారు.

అనుకోకుండా బాణాసంచా పేలుడు సంభవించడంతో ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ కూడా బ్లాస్టయింది.

ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో పెద్దగా జనసంచారం లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది.

అయితే ఈ ఘటనలో బంక్ ప్రక్కన వున్న గాయత్రి రైస్ మిల్ స్వల్పంగా ధ్వంసమైంది. బంక్ పేలుడుతో భూకంపం వచ్చినట్లు శబ్దాలు వినిపించాయని చుట్టుపక్కల మూడు గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

రాష్ట్రంలో 71 శాతం మంది యువ, మహిళా ఓటర్లే

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2023 జనవరిలో ఎన్నికల సంఘం ఈసీ, ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం..

ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది. మొత్తం ఓటర్లలో 2.12 కోట్లు (71 శాతం) మహిళలు, యువ ఓటర్లే ఉండటం గమనార్హం.

ఈసీ గణాంకాల ప్రకారం.. మొత్తం ఓటర్లలో 18-19 ఏండ్ల వయస్సు ఉన్నవారు ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 2.78 లక్షలు ఉన్నారు.

గత జనవరిలో ప్రకటించిన తుది ఓటరు జాబితాలో వివిధ కారణాలతో 2.72 లక్షల మంది ఓటర్లను తొలగించారు.

6.84 లక్షల మందిని కొత్తగా చేర్చారు. ఈ మేరకు రాష్ట్రంలో 34,891 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2023 అక్టోబర్‌లో ప్రకటించే తుది జాబితా ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు...

నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి :ఆగస్టు 08

సర్వసాధారణంగా తిరుమలలో వీక్‌ డేస్‌లో భక్తుల రద్దీ తక్కువగానూ.. వీకెండ్‌లో భక్తులరద్దీ ఎక్కువగాను ఉంటుంది. కానీ ఈ రోజు వీక్ డేస్‌లోనూ భక్తుల రద్దీ కొననసాగుతోంది.

నేడు మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

ఇక సోమవారం స్వామివారిని 69,733 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28,614 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు...

మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..నేడు చర్చ ప్రారంభం..

న్యూఢిల్లీ:పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఎన్డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభం కానుంది..

మణిపుర్ హింసపై పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అనర్హత నుంచి ఉపశమనం పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఆ పార్టీ తరఫున చర్చను ప్రారంభించనున్నారు.

బుధ, గురు వారాల్లోనూ అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న (గురువారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీర్మానంపై మాట్లాడనున్నారు. ఆగస్టు 11న వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టింది..

గతవారం దీన్ని స్పీకర్ ఓంబిర్లా ఆమోదించారు. మణిపుర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోడీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే, సభలో మణిపుర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

తద్వారా ప్రధానితో మాట్లాడించవచ్చని భావిస్తున్నాయి. పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్.. సభ్యులకు సమయాన్ని కేటాయించనున్నారు. అధికార పార్టీ ఎంపీలు మాట్లాడిన తర్వాత విపక్ష సభ్యులకు సమయం ఇస్తారు..

Tirumala: తితిదే పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం..

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సమావేశం ముగిసింది. తిరుమలలోని అన్నమయ్య భవవ్‌లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది..

ఈ మేరకు పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.

పాలకమండలి ఆమోదించిన అంశాలివే..

రూ.4 కోట్లతో అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం నుంచి మోకాలిమిట్ట వరకు భక్తుల సౌకర్యార్థం షేడ్లు ఏర్పాటు.

రూ.2.5 కోట్లతో పీఏసీలో భక్తుల కోసం మరమ్మతు పనులు.

రూ.24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు.

రూ.4.5 కోట్లతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికీకరణ.

రూ.23.50 కోట్ల వ్యయంతో తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లేక్స్ నిర్మాణం.

శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణానికి రూ. 3 కోట్లు కేటాయింపు.

రూ.3.10 కోట్ల వ్యయంతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులకు ఆమోదం.

రూ. 9.85 కోట్లతో వకుళమాత ఆలయం వద్ద అభివృద్ధి పనులుకు నిధుల కేటాయింపు.

రూ.2.60 కోట్లతో తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు.

శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్లు కేటాయింపు.

ఎస్‌వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ధి పనులకు రూ. 11.5 కోట్లు కేటాయింపు.

రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు రూ.2.20 కోట్లు కేటాయింపు.

ఎస్‌వీ సంగీత కళాశాల అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు కేటాయింపు.

తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.25 కోట్లు కేటాయింపు.

గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ని తితిదే ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు పొడిగిస్తూ ఆమోదం.

తితిదే ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలుకు కంచె ఏర్పాటుకు రూ. 1.25 కోట్లు కేటాయిస్తూ ఆమోదం.

ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యి

ప్లాంట్ ఏర్పాటుకు రూ. 5 కోట్లు కేటాయింపు.

తెలంగాణ యువతకు స్టేట్ పోలీస్ కీలక హెచ్చరిక

ప్రైవేట్ వాహనాలకు సైరన్లు వాడటం చట్ట రీత్యా నేరమని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇవాళ ట్వీట్ చేసింది.

రాష్ట్రంలో కొందరు యువకులు తమ వాహనాలకు సైరన్లు బిగించి అదొక ఘనకార్యంగా భావిస్తారని, సైరన్ల వాహనాలతో పోలీసులకు పట్టుబడ్డప్పుడు అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడరని హెచ్చరించింది.

సమాజం పట్ల బాధ్యతగల తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపింది.

మైనర్లకు కార్లు, బైక్‌లు ఇవ్వడం నేరంతో పాటు తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తున్నదని పేర్కొంది.

మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు అతనికే కాదు.. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడి కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉందని గుర్తించాలని సూచించింది.......

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రమాదవశాత్తు తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పొగలు రావడం కలకలం సృష్టించింది.

ఈ ఘటనలో ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌కు ట్రైన్ ఆదివారం అర్ధరాత్రి చేరుకుంది.

ఈ క్రమంలో ట్రైన్‌లో పొగలు చెలరేగాయి. రైలులోని S-3 బోగీ నుండి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

భోగిలో పొగలు రావడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది, డ్రైవర్ వెంటనే రైలును బెల్లంపల్లి స్టేషన్‌లో నిలిపివేసి మరమ్మతులు చేశారు. ట్రైన్ బ్రేక్ జామ్ వల్ల భోగిలో పొగలు వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.

వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో బోగీలోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరమ్మతుల అనంతరం రైలు బెల్లంపల్లి నుంచి ఈరోజు ఉదయం బయలుదేరింది....

ఉప్పల్‌లో చేనేత భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా సోమవారం ఉదయం ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాన చేశారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణతో కలిసి చేనేత భవన్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

500 గజాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు.

అదేవిధంగా చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయాదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించనున్నారు...

కొనసాగుతున్న గద్దర్ అంతిమయాత్ర

హైదరాబాద్ :ఆగస్టు 07

ప్రజా యుద్ధనౌక, విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభం అయింది.

ప్రత్యేక వాహనాన్ని పూలతో అలంకరించి గద్దర్ అమర్ రహే అనే భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అశేష జనవాహని నడుమ విప్లవ జోహార్లతో గద్దర్‌కు ప్రజలు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు.

గద్దర్ అంతిమయాత్ర దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాల గుండా తరలిస్తున్నారు.

కాగా గద్దర్ పార్ధీవదేహాన్ని ఎల్బీ స్టేడియం నుంచి అమరవీరుల స్థూపానికి తీసుకెవెళ్లనున్నారు. అనంతరం ఇంటి వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది.

అల్వాల్‌లోని మహాభోది స్కూల్ గ్రౌండ్ లో గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో సీఎ కేసీఆర్ పాల్గొంటారు. చివరి సారిగా గద్దర్ ను చూసేందుకు ఆయన అభిమానులు తరలివస్తున్నారు...