/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పంచాయితీ పోలింగ్ రక్తసిక్తం ..పేలిన తుపాకి, కత్తిపోట్లు … 10 మంది మ‌ర‌ణం Yadagiri Goud
పంచాయితీ పోలింగ్ రక్తసిక్తం ..పేలిన తుపాకి, కత్తిపోట్లు … 10 మంది మ‌ర‌ణం

కోల్ క‌తా :జూలై 08

పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 10 మంది మరణించారు.. వందలాది మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అనేక ప్రాంతాల‌లో హింసాత్మ‌క సంఘ‌ట‌ల‌ను చోటు చేసుకున్నాయి…కాగా, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 5.67 కోట్ల మంది ప్రజలు సుమారు 2.06 లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

ఈ నేప‌థ్యంలోలోనే బిజెపి, తృణ‌మూల్, కాంగ్రెస్ పార్టీల కార్య‌కర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు తలెత్తాయి .. . కూచ్ బెహార్ లోని ఫాలిమారీలో బీజేపీ పోలింగ్ ఏజెంట్ ను కాల్చిచంపారు. బిశ్వాస్ పోలింగ్ బూత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా టీఎంసీ మద్దతుదారులు అడ్డుకున్నారని, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారు ఆయనను చంపారని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది.

నార్త్ 24 పరగణాల జిల్లాలోని కదంబగచ్చి ప్రాంతంలో ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారుడు రాత్రంతా కొట్టడంతో మృతి చెందాడు. మృతుడిని అబ్దుల్లా (41)గా గుర్తించారు. అతడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందినట్లు ఎస్పీ భాస్కర్ ముఖర్జీ తెలిపారు. ఈ హత్యను నిరసిస్తూ స్థానికులు తెల్లవారుజామున టాకి రోడ్డును దిగ్బంధించగా పోలీసులు వాటిని తొలగించారు.

ముర్షిదాబాద్ జిల్లా కపస్దంగా ప్రాంతంలో జరిగిన హింసాకాండలో టీఎంసీ కార్యకర్త మృతి చెందాడు. మృతుడిని బాబర్ అలీగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్, ఖర్గ్రామ్లో ఇద్దరు, కూచ్బెహార్ జిల్లాలోని తుఫాన్గంజ్లో మరో వ్యక్తిని హతమార్చినట్లు అధికార టీఎంసీ ఆరోపించింది.

‘‘పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైనా కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు నిన్న రాత్రి నుంచి టీఎంసీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయి. రెజీనగర్, తుఫాన్గంజ్, ఖర్గ్రామ్లో ముగ్గురు కార్మికులు చనిపోయారు. డోమ్కల్ లో మా ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. కేంద్ర బలగాలు ఎక్కడున్నాయి?’’ అని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ప్రశ్నించారు...

సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరిక ఖాయమేనా ❓️

గద్వాల జిల్లా:జూలై 08

గద్వాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖారారైంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్య నాయకులతో సమావేశమైన జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులు అభ్యర్థిత్వంపై చర్చించినట్లు తెలిసింది. హైద రాబాద్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో శుక్రవారం సాయంత్రం సమావేశమై, దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 20న కొల్లాపూర్‌లో జూపల్లి ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో వీరు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది.

ఆ సభకు ప్రియాంకా గాంధీ రానుండటంతో.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలువురు ముఖ్య నాయకులు హస్తం గూటి కి చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భా గంగానే అదే రోజు పార్టీలో చేరేందుకు గద్వా ల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దంపతులు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండగా, మొన్నటి వరకు ఆ పార్టీ నుంచే గద్వాల స్థానం నుంచి టికెట్‌ వస్తుందని ఆశించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన నాటి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తామనే ప్రచారంలో ఉండగా, అటు అలంపూర్‌, ఇటు గద్వాల శాసనసభ్యులతో వారి వర్గా నికి అంతర్గత కలహాలు ఉన్నాయి. ప్రొటో కాల్‌ విషయంతో పాటు జడ్పీ సమావేశాల నిర్వహణ.. పలు అధికారిక కార్యక్రమాల్లో బాహాటంగానే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమో హన్‌రెడ్డికి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దంప తులకు మధ్య విభేదాలు బయటపడ్డాయి.

ఇటీవల సీఎం కేసీఆర్‌ పర్యటన ముందు వరకు కూడా వారు బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉండి, టికెట్‌ కోసం ప్రయత్నిస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు పలువురు మంత్రుల వద్ద కూడా తమ అభ్యర్థనను పెట్టారు. కానీ అందరూ ఊహించని విధంగా, ఇటీవల పొంగులేటి, జూపల్లితో రేవంత్‌రెడ్డి సమావేశమైన సందర్భంలోనే జడ్పీ చైర్‌పర్సన్‌ భర్త తిరుపతయ్య కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. దీంతో వారు పార్టీ మారే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల క్రితం ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్‌ సంపత్‌కుమార్‌ నివాసంలో సమావేశమైన చైర్‌పర్సన్‌ దంపతులు.. స్థానిక డీసీసీ అధ్యక్షుల తోపాటు మరో బీఆర్‌ఎస్‌ నాయకుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి చర్చించినట్లు తెలిసింది. అయితే ఈ దంపతులిద్దరూ శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనతో స మావేశం కావడంతో ఈ నెల 20న జరిగే సమావే శంలోనే కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్లుగా భావించవచ్చు.

దేశంలో తెలంగాణ పాత్ర గొప్పది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

హన్మకొండ :జూలై 08

తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో ప్రధాని పాల్గొని మాట్లాడారు.

ముందుగా ‘తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ చిన్న, కొత్త రాష్ట్రం కావచ్చు కానీ, దేశంలో మీ పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. తెలుగువారి ప్రతిభ దేశ సామార్ధ్యాన్ని పెంచిందని అన్నారు. పెట్టుబడుటు పెట్టేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారని తెలిపారు.

తెలంగాణ ముందు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గడిచిన 9 ఏళ్ల నుంచి ఎంతో కృషి చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కనెక్టివిటీ పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. కొత్త లక్ష్యాల కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని అన్నారు. లాజిస్టిక్స్ సదుపాయం లేకపోతే వ్యాపారాలు నష్టపోతాయని తెలిపారు. రాష్ట్రంలో 2500 జాతీయ రహదారులు ఇప్పుడు 5 వేల కిలో మీటర్లకు పెరిగాయని అన్నారు.,..........

గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటుపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయాలి.. ప్ర‌ధాని మోదీకి కేటీఆర్ డిమాండ్

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ కొన్ని డిమాండ్లు చేశారు. తెలంగాణ‌లో గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డంలో కేంద్ర స‌ర్కార్ జాప్యం చేస్తున్న‌ట్లు మంత్రి ఆరోపించారు. ఇవాళ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాని మోదీని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏపీ విభ‌జ‌న చ‌ట్టం కింద ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉంద‌న్నారు. కానీ రాష్ట్రంలోని వేలాది మంది గిరిజ‌న యువ‌త ఉన్న‌త విద్యా అవ‌కాశాలును కోల్పోతున్న‌ట్లు మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు.

ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు కోసం ఆరేళ్ల క్రిత‌మే ములుగులో 350 ఎక‌రాల స్థ‌లాన్ని కేంద్రానికి అప్ప‌గించిన‌ట్లు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ అక్క‌డ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డంలో దారుణంగా విఫ‌ల‌మైంద‌న్నారు. కీల‌క‌మైన ఆ ఇన్స్‌టిట్యూష‌న్ కోసం కేంద్రం నిధుల‌ను విడుద‌ల చేయ‌డం లేద‌న్నారు. ఎన్నో సార్లు సీఎం కేసీఆర్ కేంద్రాన్ని విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించార‌ని, కానీ కేంద్ర పాల‌కులు ఆ విన్న‌పాల‌ను విస్మ‌రించిన‌ట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు విష‌యంలో నిర్ల‌క్ష్యాన్ని, తెలంగాణ ప్ర‌జ‌ల ప‌ట్ల స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను వీడాల‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగ‌ల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయాల‌ని ఆయ‌న ప్ర‌ధాని మోదీని డిమాండ్ చేశారు......

ప్ర‌ధాని స‌భ‌ కు వీఐపీ పాస్‌ల‌కు పైర‌వీలు

వ‌రంగ‌ల్ జిల్లా :జూలై 08

బీజేపీ విజ‌య సంక‌ల్ప స‌భ వీఐపీ పాస్‌ల కోసం ముఖ్య నేత‌లు, శ్రేణులు అగ‌చాట్లు ప‌డుతున్నారు. వీఐపీ గ్యాల‌రీలో 2వేల పైచిలుకుగా వీఐపీ పాస్‌ల‌ను ముఖ్య నేత‌ల‌కు అంద‌జేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య‌నేత‌ల‌కు త‌లా కొన్ని పంపిణీ చేశారు.

అయితే ప్ర‌ధాని స‌భ కావ‌డంతో స‌హ‌జంగానే వీఐపీ గ్యాల‌రీ నుంచి న‌రేంద్ర మోదీని ద‌గ్గ‌ర నుంచి చూడాల‌నే కుతుహ‌లంతో పాస్‌ల కోసం పైర‌వీలు జోరుగా సాగుతున్నాయి. వాస్త‌వానికి జిల్లాలో చాలా కీల‌కంగా ప‌నిచేస్తున్న నేత‌ల‌కు సైతం పాస్‌లు అంద‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

హ‌న్మ‌కొండ జిల్లాలో పార్టీ హోదాను అడ్డుపెట్టుకుని ఓ నాయ‌కురాలు పాస్‌లు వారి వ‌ర్గానికే ఎక్కువ‌గా ఇచ్చుకున్నారంటూ ఓ వ‌ర్గం నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. పాస్‌లు త‌మ‌కు రాక‌పోవ‌డంతో కొంత‌మంది నేత‌లు చిన్న‌బుచ్చుకుంటున్నారు. మ‌రికొంత‌మందైతే జిల్లా పార్టీ నాయ‌క‌త్వాన్ని త‌ప్పుబ‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. పార్టీలో త‌మ‌కు ప్రాధాన్యం లేద‌న‌డానికి పాస్‌లు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే నిద‌ర్శ‌న‌మంటూ అసంతృప్తి స్వ‌రం వినిపిస్తున్నారు. శ్రేణులు పాస్‌ల కోసం విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీజేపీ కీల‌క నేత‌లంద‌రికీ ఫోన్ చేసి మ‌రీ అన్నా పాస్ ఉందా అంటూ వాక‌బు చేస్తుండ‌టం విశేషం....

హకీంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్ :జూలై 08

హకీం పేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోడీ చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ ప్రధాని వెళ్లనున్నారు. వరంగల్ లోని మామునూరు ఎయిర్ స్ట్రిప్‌లో దిగనున్నారు.

వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. వ్యాగన్ తయారీ, పీవోహెచ్ సహా పలు అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం చుట్టనున్నారు.

హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు....

సిఐ స్వర్ణలత -దొంగ , పోలీసా ❓️

విశాఖపట్నం:జూలై 08

మూడేళ్ల కిందట విశాఖ జిల్లా ఎస్పీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకుడు అయ్యన్న పాత్రుడిపై ఇష్టారీతిన మాట్లాడిన ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ ని చాలా మంది గుర్తు పెట్టుకునే ఉంటారు. ఆమె పోలీస్ ఆఫీసర్స్ సంఘానికి ఉపాధ్యక్షురాలు కూడా. ఆమె పేరు స్వర్ణలత. ఇప్పుడు ఆమె బండారం మొత్తం బయటపడింది. ఏకంగా ఓ దోపిడీ ముఠానే నడుపుతున్నట్లుగా బయటపడింది.

ఈ వ్యవహారం పోలీసు శాఖలో సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి అధికారులను కాపాడేందుకు ప్రభుత్వంలోని వైసీపీ పెద్దలు ఎప్పుడూ రెడీగా ఉంటారు కాబట్టి.. తెర వెనుక ప్రయత్నాలు జరుగతూనే ఉన్నాయి. విశాఖపట్నంలో రూ. 90 లక్షల 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత నాయకత్వం వహించారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ సీఐగా స్వర్ణలత పనిచేస్తున్నారు. రూ. 90 లక్షల్లో సీఐ స్వర్ణలత రూ. 20 లక్షలు నొక్కేశారు. సీఐ స్వర్ణలత తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా స్వర్ణలత ఉన్నారు. రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపా లని డీసీపీ -1 విద్యాసాగర్ నాయుడు, క్రైమ్ డీసీపీ జి.నాగన్నలను ఆదేశించారు. విచారణలో ఆ ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో శుక్రవారం సీపీకి నివేదించారు. మరోవైపు రిటైర్డ్‌ నేవీ ఉద్యోగులను బెదిరించి లక్షలు కాజేసిన సిఐకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. నిందితులైపై చర్యలకు సిద్దమైన సమయంలో నగరానికి చెందిన ఒక వైసీపీ ప్రజాప్రతినిధి ఫోన్ చేసి. కేసు లేకుండా వదిలేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బాధితులు నగదుతో వస్తున్నారనే సమాచారం లీక్ చేసి కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి దోపిడీలు చేసి ఉంటారని.. ఇప్పుడు బయటపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు స్వర్ణలతను అరెస్ట్ చేస్తారా లేకపోతే.. అలాంటి ఆఫీసర్లే తమ బలం అని వదిలేస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

నేడు సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్‌

వైఎస్సార్‌ జిల్లా: జూలై 08

నేటి నుంచి 10 వ తేదీ వరకు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు.శనివారం దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం 2.05 గంటలకు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకోనున్న సీఎం.. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం తిరిగి ఇడుపులపాయలో

తన నివాసానికి సీఎం చేరుకోనున్నారు.

9వ తేదీ పర్యటన

రెండో రోజు పర్యటనలో భాగంగా 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండిపేట చేరుకోనున్న సీఎం జగన్‌.. గండిపేట వద్ద ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ ఆఫీసు భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.

అనంతరం పులివెందుల, రాణి తోపు చేరుకుని నగరవనం ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్‌ ఫ్రెంట్‌ చేరుకుని.. గరండాల కెనాల్‌ డెవలప్‌మెంట్‌ ఫేజ్‌ –1 పనులను సీఎం ప్రారంభించనున్నారు. తర్వాత పులివెందులలోని నూతనంగా నిర్మించిన (వైఎస్సార్‌ ఐఎస్‌టిఏ) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూ టెక్‌ బయో సైన్సెస్‌ను సీఎం ప్రారంభించున్నారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు.

10వ తేదీ పర్యటన

మూడో రోజూ వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్‌ మార్గ్, రాజీవ్‌ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తి బయలుదేరి వెళ్లనున్న సీఎం.. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్‌ యూనిట్‌ను ప్రారంభోత్సవం చేయడంతో పాటు పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు.........

గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా సాయిచంద్‌ సతీమణి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్‌డబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌గా వేద రజినిని ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్‌ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని సాయిచంద్‌ భార్య రజినికే ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ మేరకు సాయిచంద్‌ భార్య రజినిని చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దివంగతులైన బీఆర్‌ఎస్‌ నేతలు సాయిచంద్‌, కుసుమ జగదీశ్‌ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇరువురి కుటుంబాలకు రూ.కోటిన్నర చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. వారి పిల్లలు, తల్లిదండ్రుల పేరిటరూ.25 లక్షల చొప్పున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని ప్రకటించారు. సాయిచంద్‌ సతీమణికి గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చామని చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ మొదటి నుంచి ఉద్యమంలో తమతోపాటు కలిసి పనిచేశారని గుర్తుచేశారు. 2001 నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌కు అనుంగు సహచరుడిగా, యువజన విభాగం నాయకుడిగా పనిచేశారని చెప్పారు. చిన్న వయసులో కుసుమ జగదీశ్‌ మరణించడం బాధాకరమని, ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌, తమ్ముడు సాయిచంద్‌ చాలా చిన్న యవసులో అకాలమరణం చెందారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరి అకాల మరణం పట్ల పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తీవ్రంగా కలత చెందారని తెలిపారు. పార్టీకి దశాబ్దాలపాటు వారు చేసిన సేవలను గౌరవించి జగదీశ్‌ను జెడ్పీ చైర్మన్‌గా, సాయిచంద్‌ను గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారని చెప్పారు......

మత్స్యకారుల వలలో బంగారు తాబేలు!

శ్రీసత్యసాయిజిల్లా:జూలై 08

మడకశిర మండలంలోని కల్లుమర్రి చెరువులో శుక్రవారం సాయంత్రం మత్స్యకారులకు అరుదైన తాబేలు చిక్కింది.

గ్రామానికి చెందిన కొందరు యువకులు చెరువులో వల వేయగా చేపలతోపాటు తాబేలు పడింది. ఆ తాబేలు బంగారు రంగులో ఉంది. దానిని చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు.

ఆ తాబేలు పలువురు పూజలు చేశారు. ఏదైనా దేవస్థానానికి సంబంధించిన కోనేరులో ఆ తాబేలును వదలాలని మత్స్యకారులు నిర్ణయించుకున్నారు