/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి రాజీనామా❓️ Yadagiri Goud
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి రాజీనామా❓️

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు అందజేశారు.

గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాల మధ్య బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు.

మంగళవారం జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం తను రాజీనామా చేసినట్లు బండి సంజయ్ ప్రకటించారు. తదుపరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు.

హైదరాబాద్ కలెక్టరేట్‌ ముట్టడికి ఏబీవీపీ యత్నం

నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం కలెక్టరేట్ ముట్టడికి ఏబీవీపీ యత్నించింది. విద్యా సమస్యలపై ఆందోళనకు దిగిన ఏబీవీపీ కలెక్టరేట్‌ వద్ద నిరసనకు దిగింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ వెంటనే చెల్లించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అధిక ఫీజులు వసూల్ చేస్తున్న కార్పోరేట్ విద్యాసంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. కలెక్టరేట్‌లోకి వెళ్లనీయడంతో అడ్డుకోవడంతో ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు.. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ధర్నాకు దిగింది. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని.. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు...

తెలంగాణ ఎన్నికల అదనపు కమిషనర్‌గా లోకేష్ కుమార్ బదిలీ?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సీఈసీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ అదనపు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా లోకేష్ కుమార్‌ను నియమించింది.

తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ గవర్నర్‌ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, లోకేష్‌ కుమార్‌ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్‌గా 2006 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి రోనాల్డ్ రోస్ నియమితులయ్యారు. అలాగే ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ను సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి Md. ముషారఫ్ అలీ ఫరూఖీకి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్ పదవిని కేటాయించారు....

కోడికత్తి కేసు.. బెయిల్‌కు సుప్రీంకోర్టుకు వెళ్లండి: నిందితుడికి ఎన్‌ఐఏ కోర్టు సూచన..

విజయవాడ: కోడికత్తి కేసుపై విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టును అభ్యర్థించాడు. బెయిల్‌ అంశం తమ పరిధిలో లేదని ఎన్‌ఐఏ కోర్టు అతడికి స్పష్టం చేసింది..

ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది.

గతంలో శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం జగన్‌ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.

జైల్లో దీక్ష చేస్తా: నిందితుడు శ్రీనివాస్‌

మరోవైపు కేసు జాప్యాన్ని నిరసిస్తూ జైల్లోనే దీక్ష చేపడతానని నిందితుడు శ్రీనివాసరావు చెప్పాడు. ఈనెల 11 నుంచి దీక్ష చేస్తానని తెలిపాడు. 2018లో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడి కత్తితో శ్రీనివాస్‌ దాడి చేసిన విషయం తెలిసిందే...

CM Jagan: చంద్రబాబు, పవన్‌ నాన్‌ రెసిడెంట్‌ నాయకులు: జగన్‌

చిత్తూరు: తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నాన్‌ రెసిడెంట్‌ నాయకులని సీఎం జగన్‌ అన్నారు. వాళ్లు మన రాష్ట్రంలో ఉండరని..

దోచుకోవడం కోసమే అధికారం కావాలంటున్నారని విమర్శించారు. అమూల్‌ ఆధ్వర్యంలో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్‌ మాట్లాడారు.

రూ.325కోట్ల పెట్టుబడికి అమూల్‌ సంస్థ ముందుకొచ్చిందని జగన్‌ చెప్పారు. చిత్తూరు డెయిరీ దుస్థితిని చూసి ఇవాళ జీవం పోస్తున్నామన్నారు. సహకార రంగంలో ఈ డెయిరీ అతిపెద్దదని చెప్పారు. చంద్రబాబు హయాంలో చిత్తూరు డెయిరీ సహా 54 ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డాయని జగన్‌ ఆరోపించారు. 35 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకి అక్కడ ఇల్లు లేదన్నారు. రాజకీయ జీవిత చరమాకంలో కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నామంటున్నారని వ్యాఖ్యానించారు..

Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి, 20 మందికి గాయాలు..

ముంబై : మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో మంగళవారం దారుణం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న ఓ లారీ అదుపుతప్పి, వాహనాలను ఢీకొడుతూ, ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది.

ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిని సిర్పూర్, ధూలేలలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,

మధ్య ప్రదేశ్ నుంచి ధూలే వైపు వెళ్తున్న లారీ మంగళవారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ముంబై-ఆగ్రా హైవేపై పలస్నేర్ గ్రామం సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో డ్రైవర్ అదుపు చేయలేకపోయారు. దీంతో రెండు మోటారు సైకిళ్లను, ఓ కారును, మరో కంటెయినర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో బస్టాప్ పక్కన ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత తలక్రిందులైంది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిని సిర్పూర్, ధూలేలలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదం బాధితుల్లో బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు కూడా ఉన్నారు..

AP BJP: భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు తొలగింపు

అమరావతి: ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తొలగించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు ఫోన్‌ చేసి తెలిపారు..

పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని నడ్డా ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై సోము వీర్రాజు ఇంకా స్పందించలేదు. 1978 నుంచి సోము వీర్రాజు భాజపాలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో 2020 జులై 27న ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఏపీ అధ్యక్షుడిని మార్చాలని భాజపా అధినాయకత్వం భావిస్తున్నట్లు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు సోము వీర్రాజుపై రాష్ట్రానికి చెందిన కొంతమంది నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు కొన్ని రోజులుగా కేంద్రమంత్రివర్గంలో మార్పులు చేర్పులు.. వివిధ రాష్ట్రాల అధ్యక్షుల మార్పుపై భాజపా అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఏపీలో మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడితోనే ఎన్నికలకు వెళ్లాలని భాజపా అధినాయకత్వం భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోము వీర్రాజును తప్పించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర భాజపాకు కొత్త అధ్యక్షుడిని సాయంత్రం లేదా రేపు ప్రకటించే అవకాశముంది...

బీసీలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా ఈ నెల 15 న హైదరాబాదులో "బీసీల రాజకీయ ప్లీనరీ"

ప్లీనరీలో బీసీల రాజకీయ పాలసీని ప్రకటిస్తాం

బీసీ డిక్లరేషన్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేస్తే సహించేది లేదు.

హైదరాబాదులో బీసీల రాజకీయ ప్లీనరీ

నల్గొండ ఉమ్మడి జిల్లా నుండి వేలది మంది బీసీ ప్రతినిధులు పాల్గొనాలి

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్

బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్ కూర్మ

తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలు రాజకీయంగా అనుసరించవలసిన విధానంపై చర్చించి, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించడానికి జూలై 15వ తేదీన హైదరాబాదులోని ఎల్బీనగర్ లోని కేబిఆర్ కన్వెన్షన్ లో పదివేల మంది బీసీ ప్రతినిధులతో "బీసీల రాజకీయ ప్లీనరిని" నిర్వహిస్తామని వారు తెలిపారు.

నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అధ్యక్షతన జరిగిన బీసీ సంక్షేమ, యువజన, విద్యార్థి సంఘాల జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇస్తామని చెప్పకుండా రాయితీలు, సంక్షేమ పథకాలతో "బీసీ డిక్లరేషన్" ప్రకటనల అంటూ రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేయాలని చూస్తున్నామని వారు ఆరోపించారు. బీసీలకు రాయితీలతో రాజీ పడకుండా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా, సీఎం పీటమే అజెండాగా బీసీ రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెడతామని, బీసీలను మోసం చేసే పార్టీలను ఎండగట్టి, బీసీల రాజకీయ చైతన్యం రగిలించడానికి ఈ ప్లీనరీ ని ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు, ప్లీనరీలో చర్చించి అవసరమైతే బీసీలకు కూడా ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తామని, బీసీలకు రాజకీయ సంఘటిత శక్తిని చాటి 2023 ఎన్నికలు బీసీ ఎజెండాగా జరగడానికి, బీసీలు ఆశించే స్థాయి నుండి రాజకీయంగా శాసించే స్థాయికి ఎదగడానికి ఈ ప్లీనరీ ఉపయోగపడుతుందని, పార్టీలకతీతంగా ఈ ప్లీనరీ లో పాల్గొని విజయవంతం చేయాలని వారు నల్గొండ జిల్లా బీసీలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపధ్యక్షులు బూడిద మల్లికార్జున్,విశ్వనాథ చారి, శంకర్ ముదిరాజ్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జజుల లింగం గౌడ్, బిసి యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగి శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర నాయకులు పానుగంటి విజయ్, నాగరాజ్ గౌడ్, పాలకురి కిరణ్, వరికుప్పాల మధు, నర్సింహ నాయక్, జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ఆంజనేయులు యాదవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Draupadi murmu: హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము

హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఆమెకు ఘన స్వాగతం పలికారు..

సాయంత్రం గచ్చిబౌలిలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు.

ద్రౌపదీ ముర్ము హకీంపేట విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. పర్యాటకుల సందర్శన తీరును రాష్ట్రపతి సమీక్షించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి ద్రౌపదీముర్ము చేరుకుని అల్లూరి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారు..

ఉద్యోగం కోసం భూమి కేసులో, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను నిందితుడిగా చేస్తూ సీబీఐ ఛార్జిషీట్

డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు కష్టాలు పెరిగాయని, ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.

డెస్క్: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కష్టాలు పెరిగాయి. ఉద్యోగం కోసం భూమి కేసులో, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను నిందితుడిగా చేస్తూ న్యూఢిల్లీలోని రూస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ సోమవారం రెండో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

తేజశ్వితో పాటు అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి సహా మరో 16 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో కొందరు మాజీ రైల్వే అధికారుల పేర్లు కూడా నిందితుల జాబితాలో ఉన్నాయి.

100 పేజీలకు పైగా ఉన్న ఈ చార్జిషీట్‌లో.. ఈడీ కేసులో.. రైల్వేలోని వివిధ జోన్లలో గ్రూప్-డిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మూడు డజన్ల మందికి పైగా భూమి, ఆస్తులను రాసివ్వాలని సీబీఐ కోరింది.

ఈ కేసులో 2022 మే 18న సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జ్ షీట్‌లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి సహా 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అదే సమయంలో, రెండో ఛార్జిషీట్‌లో తేజస్వి యాదవ్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ తాజా ఛార్జిషీట్‌పై విచారణ తేదీ ఖరారు కాలేదు, అయితే గతంలో దాఖలు చేసిన చార్జిషీట్‌ను జూలై 12న విచారించనుంది.