/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz CM Jagan: చంద్రబాబు, పవన్‌ నాన్‌ రెసిడెంట్‌ నాయకులు: జగన్‌ Yadagiri Goud
CM Jagan: చంద్రబాబు, పవన్‌ నాన్‌ రెసిడెంట్‌ నాయకులు: జగన్‌

చిత్తూరు: తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నాన్‌ రెసిడెంట్‌ నాయకులని సీఎం జగన్‌ అన్నారు. వాళ్లు మన రాష్ట్రంలో ఉండరని..

దోచుకోవడం కోసమే అధికారం కావాలంటున్నారని విమర్శించారు. అమూల్‌ ఆధ్వర్యంలో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్‌ మాట్లాడారు.

రూ.325కోట్ల పెట్టుబడికి అమూల్‌ సంస్థ ముందుకొచ్చిందని జగన్‌ చెప్పారు. చిత్తూరు డెయిరీ దుస్థితిని చూసి ఇవాళ జీవం పోస్తున్నామన్నారు. సహకార రంగంలో ఈ డెయిరీ అతిపెద్దదని చెప్పారు. చంద్రబాబు హయాంలో చిత్తూరు డెయిరీ సహా 54 ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డాయని జగన్‌ ఆరోపించారు. 35 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకి అక్కడ ఇల్లు లేదన్నారు. రాజకీయ జీవిత చరమాకంలో కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నామంటున్నారని వ్యాఖ్యానించారు..

Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి, 20 మందికి గాయాలు..

ముంబై : మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో మంగళవారం దారుణం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న ఓ లారీ అదుపుతప్పి, వాహనాలను ఢీకొడుతూ, ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది.

ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిని సిర్పూర్, ధూలేలలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,

మధ్య ప్రదేశ్ నుంచి ధూలే వైపు వెళ్తున్న లారీ మంగళవారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ముంబై-ఆగ్రా హైవేపై పలస్నేర్ గ్రామం సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో డ్రైవర్ అదుపు చేయలేకపోయారు. దీంతో రెండు మోటారు సైకిళ్లను, ఓ కారును, మరో కంటెయినర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో బస్టాప్ పక్కన ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత తలక్రిందులైంది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిని సిర్పూర్, ధూలేలలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదం బాధితుల్లో బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు కూడా ఉన్నారు..

AP BJP: భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు తొలగింపు

అమరావతి: ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తొలగించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు ఫోన్‌ చేసి తెలిపారు..

పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని నడ్డా ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై సోము వీర్రాజు ఇంకా స్పందించలేదు. 1978 నుంచి సోము వీర్రాజు భాజపాలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో 2020 జులై 27న ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఏపీ అధ్యక్షుడిని మార్చాలని భాజపా అధినాయకత్వం భావిస్తున్నట్లు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు సోము వీర్రాజుపై రాష్ట్రానికి చెందిన కొంతమంది నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు కొన్ని రోజులుగా కేంద్రమంత్రివర్గంలో మార్పులు చేర్పులు.. వివిధ రాష్ట్రాల అధ్యక్షుల మార్పుపై భాజపా అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఏపీలో మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడితోనే ఎన్నికలకు వెళ్లాలని భాజపా అధినాయకత్వం భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోము వీర్రాజును తప్పించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర భాజపాకు కొత్త అధ్యక్షుడిని సాయంత్రం లేదా రేపు ప్రకటించే అవకాశముంది...

బీసీలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా ఈ నెల 15 న హైదరాబాదులో "బీసీల రాజకీయ ప్లీనరీ"

ప్లీనరీలో బీసీల రాజకీయ పాలసీని ప్రకటిస్తాం

బీసీ డిక్లరేషన్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేస్తే సహించేది లేదు.

హైదరాబాదులో బీసీల రాజకీయ ప్లీనరీ

నల్గొండ ఉమ్మడి జిల్లా నుండి వేలది మంది బీసీ ప్రతినిధులు పాల్గొనాలి

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్

బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్ కూర్మ

తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలు రాజకీయంగా అనుసరించవలసిన విధానంపై చర్చించి, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించడానికి జూలై 15వ తేదీన హైదరాబాదులోని ఎల్బీనగర్ లోని కేబిఆర్ కన్వెన్షన్ లో పదివేల మంది బీసీ ప్రతినిధులతో "బీసీల రాజకీయ ప్లీనరిని" నిర్వహిస్తామని వారు తెలిపారు.

నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అధ్యక్షతన జరిగిన బీసీ సంక్షేమ, యువజన, విద్యార్థి సంఘాల జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇస్తామని చెప్పకుండా రాయితీలు, సంక్షేమ పథకాలతో "బీసీ డిక్లరేషన్" ప్రకటనల అంటూ రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేయాలని చూస్తున్నామని వారు ఆరోపించారు. బీసీలకు రాయితీలతో రాజీ పడకుండా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా, సీఎం పీటమే అజెండాగా బీసీ రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెడతామని, బీసీలను మోసం చేసే పార్టీలను ఎండగట్టి, బీసీల రాజకీయ చైతన్యం రగిలించడానికి ఈ ప్లీనరీ ని ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు, ప్లీనరీలో చర్చించి అవసరమైతే బీసీలకు కూడా ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తామని, బీసీలకు రాజకీయ సంఘటిత శక్తిని చాటి 2023 ఎన్నికలు బీసీ ఎజెండాగా జరగడానికి, బీసీలు ఆశించే స్థాయి నుండి రాజకీయంగా శాసించే స్థాయికి ఎదగడానికి ఈ ప్లీనరీ ఉపయోగపడుతుందని, పార్టీలకతీతంగా ఈ ప్లీనరీ లో పాల్గొని విజయవంతం చేయాలని వారు నల్గొండ జిల్లా బీసీలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపధ్యక్షులు బూడిద మల్లికార్జున్,విశ్వనాథ చారి, శంకర్ ముదిరాజ్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జజుల లింగం గౌడ్, బిసి యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగి శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర నాయకులు పానుగంటి విజయ్, నాగరాజ్ గౌడ్, పాలకురి కిరణ్, వరికుప్పాల మధు, నర్సింహ నాయక్, జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ఆంజనేయులు యాదవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Draupadi murmu: హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము

హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఆమెకు ఘన స్వాగతం పలికారు..

సాయంత్రం గచ్చిబౌలిలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు.

ద్రౌపదీ ముర్ము హకీంపేట విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. పర్యాటకుల సందర్శన తీరును రాష్ట్రపతి సమీక్షించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి ద్రౌపదీముర్ము చేరుకుని అల్లూరి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారు..

ఉద్యోగం కోసం భూమి కేసులో, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను నిందితుడిగా చేస్తూ సీబీఐ ఛార్జిషీట్

డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు కష్టాలు పెరిగాయని, ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.

డెస్క్: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కష్టాలు పెరిగాయి. ఉద్యోగం కోసం భూమి కేసులో, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను నిందితుడిగా చేస్తూ న్యూఢిల్లీలోని రూస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ సోమవారం రెండో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

తేజశ్వితో పాటు అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి సహా మరో 16 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో కొందరు మాజీ రైల్వే అధికారుల పేర్లు కూడా నిందితుల జాబితాలో ఉన్నాయి.

100 పేజీలకు పైగా ఉన్న ఈ చార్జిషీట్‌లో.. ఈడీ కేసులో.. రైల్వేలోని వివిధ జోన్లలో గ్రూప్-డిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మూడు డజన్ల మందికి పైగా భూమి, ఆస్తులను రాసివ్వాలని సీబీఐ కోరింది.

ఈ కేసులో 2022 మే 18న సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జ్ షీట్‌లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి సహా 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అదే సమయంలో, రెండో ఛార్జిషీట్‌లో తేజస్వి యాదవ్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ తాజా ఛార్జిషీట్‌పై విచారణ తేదీ ఖరారు కాలేదు, అయితే గతంలో దాఖలు చేసిన చార్జిషీట్‌ను జూలై 12న విచారించనుంది.

ఏమీ కొనేటట్టు లేదు ; ఏమి తినేటట్టు లేదు!!

కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా ధర ఆకాన్నంటుతున్నది. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వార సంతల్లో సైతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు పెరిగాయి. రూ. 100 తీసుకెళ్తే నాలుగైదు కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ. 500 తీసుకెళ్లినా సంచి నిండడం లేదు. ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో కూరగాయల ధరలు బాగా తగ్గిపోతాయి. కానీ, ఈ ఏడాది మాత్రం కూరగాయలు పేద, సామాన్య ప్రజలకు పెనుభారంగా మారాయి. ఏ కూరగాయ, అకుకూరలు చూసినా ధర షాక్‌ కొడుతున్నది. పొయ్యి మీద వేయకుండానే అంగట్లోనే ఉడికిపోతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలు సామాన్యులను బెంబెలేత్తిస్తున్నాయి.

కూరగాయలు కొనేందుకు పట్టణాల్లోని మార్కెట్‌, గ్రామీణ ప్రాంతాల్లోని వారపు సంతలకు వెళ్లాలంటేనే వినియోగదారులు వణికి పోతున్నారు. టమాట కిలో రూ.15 నుంచి 30లకు లభ్యమయ్యేవి. శనివారం ఎక్కడ చూసినా ధర రూ. 100 నుంచి రూ.120 పైనే ధర పలికింది. పచ్చిమిర్చి, మెంతికూర కూడా కిలో రూ.120 చేరాయి. అల్లం ఎలిగడ్డ కిలో రూ. 200లకు చేరింది. ఫలితంగా ప్రజలకు ధరాఘాతం తప్పడం లేదు. టమాట, పచ్చిమిర్చితో పాటు ప్రతి కూరగాయ ధర ఆకాశాన్నంటాయి. సాధారణ రోజుల్లో కిలో రూ. 20ల లోపు లభించే క్యారెట్‌, వంకాయ, బీన్స్‌, క్యాప్సికం, చిక్కుడు తదితర కూరగాయలు ప్రస్తుతం రూ. 50 నుంచి 80 చేరాయి.

కూరగాయలు ధరలే అనుకుంటే కోడిగుడ్డు కూడా ఒకటి రూ. 7కు చేరింది. మార్కెట్‌, వారాంతపు సంతల్లో ఏ కూరగాయలు కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. డిమాండ్‌ సరిపడా లోకల్‌ కూరగాయల అందుబాటులో లేకపోవడం, ఇతర ప్రాంతాల్లో వర్షాలు, కొన్నిచోట్ల ఎండలకు పంటలు దెబ్బతిని ధరలు పెరిగినట్లు తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పాటు ఇతర రాష్ర్టాల్లో తుఫాను ప్రభావం కూరగాయల పంటలపై పడింది. ఇతర రాష్ర్టాల నుంచే కాకుండా రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతి చేసుకోకపోవడం రవాణా చార్జీలు సైతం ధరల పెరుగుదలకు కారణమంటున్నారు వ్యాపారులు. మరో నెలరోజుల పాటు కూరగాయల ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు వ్యాపారులు. ధరలు పెరగడంతో ప్రజలు పొదుపు పాటించాల్సి వస్తున్నది. కిలో కొనేవారు పావుకిలో, అరకిలో కొని సరిపెట్టుకుంటున్నారు.

బండి సంజయ్ కి ఢిల్లీ నుండి పిలుపు : వస్తుందా❓️

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను మార్చుతారనే టాక్ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. బండి ముంబైకు బయలుదేరగా.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హస్తినకు వెళ్లడం కీలకంగా మారింది. ఇదే నేపథ్యంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఉదయం బండి సంజయ్ ముంబై వెళ్లారు. ముంబైలోని ముంబా దేవిని దర్శించుకున్న అనంతరం.. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అధ్యక్ష పదవి రెండు, మూడు రోజుల ముచ్చటేనంటూ తన సన్నిహితుల దగ్గర బండి వ్యాఖ్యనించినట్లు తెలుస్తోంది. ఈ నెల 8న వరంగల్ పర్యటనకు మోదీ రానున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష హోదాలో హాజరవుతాదో.. లేదో అంటూ కార్యకర్తల దగ్గర ఆవేదన చెందారు. ఈ తరుణంలో ఇవాళ మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుండటం, కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందనే ప్రచారం క్రమంలో ఏం జరుగబోతుందనేది టీ పాలిటిక్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇటీవల ఢిల్లీలో టీ బీజేపీ పరిస్థితిపై అధిష్టానం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కె.లక్ష్మణ్, కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని బీజేపీ పరిస్ధితి, అధ్యక్ష పదవి మార్పు అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బండికి కేంద్రమంత్రి పదవి లేదా కేంద్ర బీజేపీలో కీలక బాధ్యతలు ఇవ్వాలనే అంశం గురించి చర్చించారు. గతంలో కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో ఆయన మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.

బీజేపీ అధ్యక్షుడి మార్పు అంశంపై బండి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తనను తొలగిస్తే ఎలాంటి పదవులు వద్దని, ఒక కార్యకర్తలా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. కిషన్ రెడ్డి, విజయశాంతి, తరుణ్ చుగ్ లాంటి పలువురు నేతలు మాత్రం అధ్యక్ష పదవిలో ఎలాంటి మార్పులు ఉండవని, బండినే కొనసాగుతారని చెప్పుకొస్తున్నారు. ఒక్కొక్కరు ఒకలా చెబుతుండటంతో.. అసలు బీజేపీలో ఏం జరుగుతుందనేది తెలియక కార్యకర్తలు కూడా డైలమాలో ఉన్నారు. బీజేపీలోని పరిణామలు ఎటువైపు తారితీస్తాయో చూడాలి...

Modi: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్‌ కలకలం..!

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నివాసం వద్ద ఓ డ్రోన్‌ (Drone) కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఓ అనుమానాస్పద డ్రోన్‌ ప్రధాని నివాసంపై సంచరించినట్లు ఎస్పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) నుంచి సమాచారం అందిందని దిల్లీ పోలీసులు (Delhi Police) వెల్లడించారు..

ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

దిల్లీలోని లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని అధికారిక నివాసం (PM Residence) ఉంది. సాధారణంగా ప్రధాని నివాసం వద్ద నో-ఫ్లై జోన్‌ (No-Fly Zone) అమల్లో ఉంటుంది. అలాంటి ప్రాంతంలోకి డ్రోన్‌ రావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో దిల్లీ పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి డ్రోన్‌ను ట్రాక్‌ చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు.

అయితే ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏదీ కన్పించలేదని తెలుస్తోంది. ''ప్రధాని నివాసం పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి డ్రోన్‌ తరహా వస్తువు కన్పించలేదు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) రూంను కూడా సంప్రదించాం. ప్రధాని నివాసం వద్ద ఎలాంటి ఎగిరే వస్తువును గుర్తించలేదని వారు చెప్పారు'' అని దిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం వద్ద కూడా ఓ అనుమానాస్పద డ్రోన్ సంచరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కేజ్రీవాల్‌ నివాసం కూడా నో-ఫ్లై జోన్‌లోనే ఉంది..

Chandrababu: కేంద్ర మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ..

అమరావతి: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో చనిపోయిన అద్దంకికి చెందిన రాజేశ్‌కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని కోరారు..

అద్దంకికి చెందిన రాజేశ్‌.. ఇటీవల ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే బీచ్‌కు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. బీచ్‌లో తన పిల్లలను రక్షించే ప్రయత్నంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

రాజేశ్‌ భౌతికకాయాన్ని త్వరితగతిన స్వస్థలానికి తెచ్చేందుకు సహకారం అందించాలని కేంద్రమంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు..