హర్ ఘర్ ధ్యాన్ మిషన్ ద్వారా విశ్వశాంతి చేకూరుతుంది
•ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు.
ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ గారు బెంగళూరు ఆశ్రమంలో తెలంగాణ ప్రాంతం నుండి మా గురువుగారైన తెలంగాణ ప్రాంత సీనియర్ టీచర్ శ్రీ శ్రీనివాసరావును మరియు నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ను బెంగళూరు ఆశ్రమంలో సమావేశపరిచి తెలంగాణ లోని ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో ప్రతి పల్లెలో ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా
ప్రతి ఇంట్లో సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్, ప్రాణాయామం, బసిరికా, బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ యొక్క హర్ ఘర్ ధ్యాన్ మిషన్ ద్వారా విశ్వశాంతి చేకూరే విధంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ సభ్యులు వాలంటరీలు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని తెలియజేశారు.
తెలంగాణ ప్రాంతంలోని నల్లగొండ జిల్లాలో ప్రతినిత్యం ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా హ్యాపీనెస్ కోర్స్ నిర్వహిస్తూ అందుబాటులో ఉంటున్న నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ను పూజ్యశ్రీ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ గారు పూలమాలతో సత్కరించి ఆశీర్వదించారు.
ఈ యొక్క హర్ ఘర్ ధ్యాన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు చేరే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలని ఆయా గ్రామాల్లో రైతులు, మహిళలను, పెద్దలను, విద్యార్థులను, అనారోగ్యంగా ఉన్న వారిని మమేకం చేస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా అందరికీ ఆరోగ్యం ఆనందం కలిగే విధంగా ధ్యానం అందించాలని పూజ్యశ్రీ శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ తెలియజేశారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు అతి త్వరలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ వస్తానని అక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేద్దామని తెలియపరిచారు.
ఈ సమావేశంలో ఇంత గొప్ప అవకాశం కల్పించిన తెలంగాణ ప్రాంత సీనియర్ టీచర్ శ్రీనివాస్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు పల్లపు బుద్ధుడు తెలియజేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్, గంజి గోవర్ధన్, మాస శ్రీనివాస్, రావుల వెంకన్న, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటరీస్ పాకాల దినేష్, పాకాల సత్యనారాయణ, మర్రి హరీష్ రెడ్డి, సిద్ధ గాని అశోక్ గౌడ్, బొలుగూరి సైదులు, పల్లపు రాకేష్ పల్లపు సాయి, సారంగపాణి, అమ రోజు సందీప్ తదితరులు పాల్గొన్నారు
Jun 25 2023, 09:09