/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు హాజరుకావడం లేదు : జూనియర్ ఎన్టీఆర్.. Yadagiri Goud
నిజంనిప్పులాంటిది

May 20 2023, 13:56

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు హాజరుకావడం లేదు : జూనియర్ ఎన్టీఆర్..

హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. నగరంలోని కూకట్‌పల్లి ఖైతాలపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు.. జూనియర్ ఎన్టీఆర్ వస్తారని భావించగా.. ఈ కార్యక్రమానికి తాను హాజరుకావట్లేదని తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తన పుట్టినరోజు కార్యక్రమాలు, టూర్‌ దృష్ట్యా హాజరు కాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 17 2023, 10:45

Liquor Allergy: మందు బాబులు అలర్ట్.. లిక్కర్‌ అలర్జీ ముప్పు.. హైదరాబాద్‌లో తొలి కేసు..

సంతోషం వచ్చినా.. బాధ కలిగినా.. ప్రమోషన్‌ వచ్చినా.. డిమోషన్‌ వచ్చినా.. బంధువులు వచ్చినా.. ఫ్రెండ్స్‌ కలిసినా.. ఇలా ఏది జరిగినా..

వచ్చేది ఒక్కటే మాట.. అదే మందు వేద్దామా? అని అంతలా చాలా మంది లిక్కర్‌లో మునిగితేలుతున్నారు.. అయితే, మందు బాబులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఇప్పటి వరకు లిక్కర్‌తో లివర్‌ చెడిపోతుందని మాత్రమే అనుకొనేవాళ్లు.. కానీ, ఇప్పుడో షాకింగ్ వ్యవహారం వెలుగు చూసింది..

హైదరాబాద్‌లో వెలుగు చూసిన అరుదైన కేసు.. మందు బాబులు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేస్తోంది.. ఇది ఎందరిలో ఉంది.. ఎలా వస్తుంది.. ఎలాంటి రియాక్షన్‌ ఉంటుంది? ఎలా గుర్తించాలి? లాంటే అనేక సందేహాలను తెరపైకి తెచ్చింది..

మందు తాగేవారిలో ఎర్రటి దద్దుర్లతో 'లిక్కర్‌ అలర్జీ' అనే అరుదైన వ్యాధి సోకుతుందని చాలా మందికి ఇప్పటి వరకు తెలిసి ఉండదు.. కానీ, దాని గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేంది.. ఎందుకంటే మనదేశంలో లిక్కర్‌ అలర్జీని ఇటీవల తొలిసారి హైదరాబాద్‌లోనే గుర్తించారు.

ఆగ్రా నుంచి వచ్చిన జాన్‌ అనే 36 ఏళ్ల యువకుడికి ఈ వ్యాధిని గుర్తించారు.. జాన్‌కు ఈ వ్యాధి సోకినట్టు హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌ వైద్యులు తేల్చారు.. ఇది చాలా అరుదైన వ్యాధి అని, మద్యం సేవించడం వల్ల కొంతమంది శరీరంలో అలర్జీకి సంబంధించిన మార్పులు కనిపిస్తాయంటున్నారు డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌.. అయితే, చాలా అరుదైన కేసు.. ప్రపంచంలోనే ఈ తరహా కేసులు వందకు మించి ఉండవని పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

May 17 2023, 08:38

శత్రువు కూడా జాలిపడే పరిస్థితిలో పాకిస్తాన్

ఇస్లామాబాద్:

ప్రపంచంలో ఉన్న ఏ ముస్లిం అయినా జీవితంలో ఒక్క సారైన సౌదీ అరేబియాలో ని మక్కా మసీదును సందర్శించాలని కోరుకుంటారు. హజ్ యాత్ర కు సంబంధించి సౌదీ అరేబియా ప్రపంచంలో ని అన్ని దేశాల్లో ఉన్నముస్లింలకు సందర్శించడానికి అవకాశం ఇస్తుంది.

అందులో ఒక్కో దేశానికి సంబంధించి ఇంతమంది రావడానికి వీసాలు ఇస్తామని చెబుతుంది. ఏయే దేశాలకు ఎంతమందికి ఇవ్వాలో సౌదీ నిర్ణయిస్తుంది. గతంలో పాకిస్థాన్ మా కోట పెంచండి, మాది ముస్లిం దేశం ఇక్కడి నుంచి మక్కాకు రావడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని అడిగేది. అయితే అలా ఎక్కువ ఇవ్వడం కుదరదని సౌదీ చెప్పేది.

ఈ సంవత్సరం మాత్రం పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయి దీనావస్థలో ఉంది. ఎంతలా అంటే హజ్ యాత్రకు సౌదీ అనుమతించిన వీసాల్లో సగానికి సగం మాకు అవసరం లేదు. మీరే ఎవరికైనా ఇచ్చేసుకోండని చెప్పింది. ఎందుకంటే హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. రాయితీలు ఇచ్చేంత సొమ్ము ఇప్పుడు పాక్ వద్ద లేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ తమకు ఇచ్చిన వీసాలను తిరిగి వెనక్కి ఇచ్చేసింది. ఇది అతి పెద్ద సంచలనంగా మారింది.

సౌదీ ఇచ్చిన అవకాశం ప్రకారం అందరూ వెళ్లాలంటే సౌదీకి 4500 డాలర్లు పాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే పాకిస్థాన్ కరెన్సీలో 1.2 మిలియన్ల వరకు అవుతుంది. దీంతో 70 శాతం ఖర్చు పెరిగింది. ఇది హజ్ యాత్ర కు సంబంధించిన కోటాను వెనక్కి ఇవ్వడంతో పాక్ పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ కోటాకు సంబంధించిన హజ్ యాత్ర వీసాలను ఇండోనేషియాకు సౌదీ ఇచ్చింది. ప్రస్తుతం పాక్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఈ హజ్ యాత్ర కోటానే ఉదాహరణ గా తీసుకోవచ్చు. ఈ ఆర్థిక సంక్షోభం ముదిరి ఎటు వైపు దారి తీస్తుందో.. ఎలాంటి దారుణాలు జరుగుతాయో చూడాలి.

నిజంనిప్పులాంటిది

May 17 2023, 08:36

శంషాబాద్ మెట్రో రైలుకు టెండర్లు

రాయదుర్గం–శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టు కోసం.. 2023, మే 16వ తేదీన టెండర్లను ఆహ్వానిస్తూ.. హెచ్ఏఎంఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 17వ తేదీ నుంచి బిడ్డింగ్ పత్రాలను జారీ చేయనుంది. హైద్రాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఎయిర్ పోర్టు మెట్రో బిడ్డింగ్ కు చివరి తేదీ జూలై 5 గా నిర్ణయించారు. శంషాబాద్ మెట్రో కాంట్రాక్టు విలువ 5 వేల 648 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. 2022 డిసెంబర్ 9వ తేదీన మెట్రో నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్ల మైట్రో ఏర్పాటు చేయనున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ కు కేవలం 31 నిమిషాల్లోనే చేరుకునే విధంగా ప్లాన్ చేశారు.

31 కిలోమీటర్ల మార్గంలో.. రెండున్నర కిలోమీటర్లు భూగర్భంలో లైన్ను నిర్మించనున్నారు. తొమ్మిది స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మూడేళ్లలో హైద్రాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైలు పనులను పూర్తి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 17 2023, 08:34

Heat Waves Effect: ఏపీలో ఇవాళ 20 మండలాల్లో వడగాల్పులు. హై అలర్ట్..

నేడు 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండబోతోంది..

అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఈరోజు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44డిగ్రీలు నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41డిగ్రీల నుంచి – 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది..

వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి..

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 16 2023, 12:12

PM Rozgar Mela: 10 నెలల్లో పది లక్షల ఉద్యోగాలు.. అక్రమాలకు తావు లేకుండా నియామకాలు..

పది నెలలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను మోడీ నేరుగా చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు..

దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో పీఎం రోజ్ గార్ మేళను మోడీ సర్కార్ నిర్వహించనుందని వెల్లడించారు. ఇవాళ పిఎం రోజ్ గార్ మేళలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం రోజ్ గార్ మేళలో మోడీ పాల్గొననున్నారు.

ఇక హైదరాబాద్ లో పీఎం రోజ్ గార్ మేళలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రిక్రూట్ అయిన 71 వేల మందికి పీఎం రోజ్ గార్ మేళలో నియామక పత్రాలు జారీ కానున్నట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మోడీ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అనంతరం 232 మందికి నియామక పత్రాలను కిషన్ రెడ్డి అందజేసారు..

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 16 2023, 12:11

YSR Matsyakara Bharosa: నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా: సీఎం జగన్‌

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం జగన్‌ స్పీచ్‌

మన ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారు..

పేదవాడికి మంచి చేస్తుంటే చూడలేకపోతున్నారు.

ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు.

నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా.

ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం.

గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం.

టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేది.

చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేమన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నాం.

గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలి.

గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నాం.

గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నాం.

నిజంనిప్పులాంటిది

May 16 2023, 12:09

500 మద్యం దుకాణాల మూసివేత

చెన్నై:

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని 500 దుకాణాలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

రెండేళ్ల క్రితం డీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో దశలవారీగా రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేయనున్నట్లు పేర్కొంది. డీఎంకే గత రెండేళ్ల పాలనలో టాస్మాక్‌ దుకాణాలను మూయడానికి బదులుగా అదనంగా ఎలైట్‌ షాపులు, బార్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో జూన్‌ 3న కరుణ శతజయంతి వేడుకలు ప్రారంభమవుతున్న సందర్భంగా టాస్మాక్‌ దుకాణాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయించారు. తొలివిడతగా 500 టాస్మాక్‌ దుకాణాలను మూసివేయనున్నారు.

ఆ మేరకు టాస్మాక్‌ ఉన్నతాధికారులు మూసివేయాల్సిన దుకాణాల వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆలయాలకు చేరువగా ఉన్న మద్యం దుకాణాలు మూతపడతాయని తెలుస్తోంది.

అదేవిధంగా 500 మీటర్ల దూరంలో రెండు మద్యం దుకాణాలున్న ప్రాంతాల్లో ఒకే మద్యం దుకాణం కొనసాగేలా టాస్మాక్‌ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు...

నిజంనిప్పులాంటిది

May 16 2023, 12:05

హైదరాబాదులో ఆర్సీబీ గెలుస్తేనే ప్లే ఆఫ్

ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌ రేస్ రసవత్తరంగా సాగుతోంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి.. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరడమే కాదు.. టాప్ 2లో చోటు కూడా ఖరారు చేసుకుంది. ఇక మిగతా 3 స్థానాల కోసం 4 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే డుప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాప్ 4 చేరాలంటే.. కచ్చితంగా ఈ రెండు పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇందులో మొదటిది.. మే 18న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. రెండోది.. గుజరాత్ టైటాన్స్. మే 21న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించడం దాదాపు ఖాయం.

ఎందుకంటే పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్‌లు మంగళవారం తలపడనున్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ఓడిపోతే.. అలాగే లీగ్‌లోని తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. అటు నెట్‌ రన్‌రేట్ కూడా ముంబైది మైనస్‌లో ఉంది కాబట్టి.. కచ్చితంగా భారీ విజయం దక్కించుకోవాలి.

మరోవైపు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ ఓడిపోతే ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఎందుకంటే 13 పాయింట్లతో ఉన్న లక్నో జట్టు తదుపరి 2 మ్యాచ్‌ల్లో గెలిస్తే 17 పాయింట్లు వస్తాయి. ఒక మ్యాచ్‌లో ఓడిపోతే 15 పాయింట్లతో 4వ స్థానంలో ఉంటుంది. బెంగళూరు జట్టు తదుపరి 2 మ్యాచ్‌లలో గెలిస్తే 16 పాయింట్లు సాధిస్తుంది. ముంబై ఇండియన్స్(16 పాయింట్లు), పంజాబ్ కింగ్స్(16 పాయింట్లు) కూడా సేమ్ ఉన్నా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా చూసుకుంటే ఆర్సీబీనే ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే.. ఐపీఎల్ లీగ్ దశలో ఆర్సీబీ చివరి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. అసలే రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్న గుజరాత్‌ను ఓడించాలంటే.. ఆర్సీబీకి కత్తి మీద సామే. దీంతో కోహ్లీ భవితవ్యం కాస్తా హార్దిక్ చేతుల్లో ఉందన్న మాటే. బెంగళూరు ఈసారైనా కప్పు గెలుస్తుందో లేక అస్సాం చేస్తుందో చూడాలి.

నిజంనిప్పులాంటిది

May 16 2023, 12:04

ఇంట గెలిచి రచ్చ గెలువు

బీఆర్‌ఎస్‌ జాతీయ దుకాణం కొన్నాళ్లు సైలెంట్‌!

కర్ణాటక దెబ్బతో రాష్ట్ర అధికారపక్షం నేలచూపులు

తెలంగాణలో అదే పరిస్థితి అని సర్వేల్లో వెల్లడి

ఢిల్లీ రాజకీయాలపై దృష్టి తగ్గించాలని నిర్ణయం

మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ డౌటే?

తెలంగాణ అధికారపక్షం బీఆర్‌ఎస్‌ నేల మీదకు దిగొచ్చింది. జాతీయ రాజకీయాల ఆశలను కాసేపు పక్కనబెట్టి ఇల్లు చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకుంది. ఆర్నెల్ల క్రితమే పేరు మార్చుకొని జాతీయ పార్టీగా అవతారమెత్తిన బీఆర్‌ఎస్‌ ఢిల్లీ పీఠమే లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నట్లు ప్రచారం చేసుకుంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడమే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించనున్నట్లు చెప్పుకుంది. ఏపీ, మహారాష్ట్రల్లో పార్టీ శాఖలను తెరవడమే కాకుండా చేరికలను ముమ్మరం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీకీసన్నద్ధమైంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నామమాత్రంగా మారిపోయిందని, బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీన్‌ లేదని లెక్కలు వేసుకొని, ఇల్లు వదిలి రచ్చ గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అంచనాలను కర్ణాటక ఎన్నికలు పటాపంచలు చేశాయి.

డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఉన్నా కర్ణాటకలో అధికారపక్షం బీజేపీ చిత్తయింది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభంజనంలా మారి కాంగ్రెస్‌కు గత 40 ఏళ్లలో రానన్ని సీట్లను సంపాదించి పెట్టింది. వరుస ఓటములతో తిరోగమనంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. కర్ణాటక గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్‌ వాడవాడనా సంబరాలు చేసుకుంది. మారిన పరిస్థితి చూసి బీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో నూ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. సరైన ప్రత్యామ్నాయం ఇస్తామని కాస్తంగా భరోసా ఇచ్చినా కర్ణాటకలాగే ఇక్కడా ప్రతిపక్షానికి ఓట్లు పోటెత్తుతాయని అనుమానం మొదలైంది. కర్ణాటకలో బీజేపీ ప్ర భుత్వ వ్యతిరేకతకు విరుగుడుగా భారీ ఎత్తున కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. అయినా ఫలించలేదు.

ఇక్కడేమో సిటింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని సీఎం కేసీఆర్‌ అంతర్గత సమావేశాల్లో ఇప్పటికే కమిటయ్యారు. దాంతో ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కూడా తుపాను అవుతుందేమోనన్న భయం మొదలైంది. అందుకే, కేసీఆర్‌ ప్రజాదరణ పూర్తిగా కోల్పోయిన పలువురు నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్నా ళ్ల పాటు జాతీయ రాజకీయాల విషయంలో చప్పుడు చేయకుండా ఉండాలని గులాబీ బాస్‌ భావిన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమకు 50% ఓటు బ్యాంకు ఉందని, 60లక్షల సభ్యత్వాలున్న అతిపెద్ద ప్రాంతీయ పార్టీ తమదని, రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారం చేపడతామని బయటకు చెబుతున్నా..లోపల మాత్రం బీఆర్‌ఎస్‌కు గుబులు మొదలైందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.

ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను సరి చేసుకోవడంపై దృష్టి పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఎక్కడైనా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందని, ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి తగ్గించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో విజయంపైనే పూర్తి శక్తి యుక్తులు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చినపుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోనే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో పోటీయే చేయలేదు. అసలా ఊసే ఎత్తలేదు. గత అసెంబ్లీలో 37 సీట్లు గెలుచుకున్న జేడీఎస్‌ ఈసారి 19 సీట్లకే పరిమితమైంది. కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణలో ఉంటుందా అన్న విషయం కన్నా ప్రభుత్వ వ్యతిరేకత అన్న విషయంపైనే కేసీఆర్‌ దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఆయన చే యించుకున్న సొంత సర్వేల్లో తెలంగాణలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత గట్టిగానే ఉన్నట్లు తేలింది. దాన్ని ఎలా అధిగమించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ‘‘ఇక జాతీయ రాజకీయాలు కాదు.. ముందు తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం. తర్వాత.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెడదాం’’ అని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయానికి అనుకూలించిన అంశాలు, అక్కడి ప్రజల్లో అధికార బీజేపీపై వ్యతిరేకతకు కారణాలు, ప్రజల మెప్పు పొందడానికి కాంగ్రెస్‌ అనుసరించిన వ్యూహం వంటిని బీఆర్‌ఎస్‌ విశ్లేషించుకుంటోంది. ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, నియోజకవర్గాల వారీ గా పార్టీ పరిస్థితులు, వాటిని అధిగమించడం కోసం ఏం చేయాలి? వంటి విషయాలపై గులాబీ బాస్‌ దృష్టి సారించారు. బీజేపీ ఓటమి సంతోషం కలిగించినా.... కర్ణాటకలో కాంగ్రెస్‌ ఓట్లశాతం భారీగా పెరగడం, అత్యధిక సీట్లు దక్కించుకోవడం ఆందోళన కలిగిస్తోందని బీఆర్‌ఎస్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.