/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz YSR Matsyakara Bharosa: నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా: సీఎం జగన్‌ Yadagiri Goud
నిజంనిప్పులాంటిది

May 16 2023, 12:11

YSR Matsyakara Bharosa: నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా: సీఎం జగన్‌

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం జగన్‌ స్పీచ్‌

మన ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారు..

పేదవాడికి మంచి చేస్తుంటే చూడలేకపోతున్నారు.

ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు.

నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా.

ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం.

గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం.

టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేది.

చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేమన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నాం.

గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలి.

గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నాం.

గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నాం.

నిజంనిప్పులాంటిది

May 16 2023, 12:09

500 మద్యం దుకాణాల మూసివేత

చెన్నై:

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని 500 దుకాణాలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

రెండేళ్ల క్రితం డీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో దశలవారీగా రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేయనున్నట్లు పేర్కొంది. డీఎంకే గత రెండేళ్ల పాలనలో టాస్మాక్‌ దుకాణాలను మూయడానికి బదులుగా అదనంగా ఎలైట్‌ షాపులు, బార్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో జూన్‌ 3న కరుణ శతజయంతి వేడుకలు ప్రారంభమవుతున్న సందర్భంగా టాస్మాక్‌ దుకాణాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయించారు. తొలివిడతగా 500 టాస్మాక్‌ దుకాణాలను మూసివేయనున్నారు.

ఆ మేరకు టాస్మాక్‌ ఉన్నతాధికారులు మూసివేయాల్సిన దుకాణాల వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆలయాలకు చేరువగా ఉన్న మద్యం దుకాణాలు మూతపడతాయని తెలుస్తోంది.

అదేవిధంగా 500 మీటర్ల దూరంలో రెండు మద్యం దుకాణాలున్న ప్రాంతాల్లో ఒకే మద్యం దుకాణం కొనసాగేలా టాస్మాక్‌ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు...

నిజంనిప్పులాంటిది

May 16 2023, 12:05

హైదరాబాదులో ఆర్సీబీ గెలుస్తేనే ప్లే ఆఫ్

ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌ రేస్ రసవత్తరంగా సాగుతోంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి.. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరడమే కాదు.. టాప్ 2లో చోటు కూడా ఖరారు చేసుకుంది. ఇక మిగతా 3 స్థానాల కోసం 4 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే డుప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాప్ 4 చేరాలంటే.. కచ్చితంగా ఈ రెండు పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇందులో మొదటిది.. మే 18న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. రెండోది.. గుజరాత్ టైటాన్స్. మే 21న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించడం దాదాపు ఖాయం.

ఎందుకంటే పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్‌లు మంగళవారం తలపడనున్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ఓడిపోతే.. అలాగే లీగ్‌లోని తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. అటు నెట్‌ రన్‌రేట్ కూడా ముంబైది మైనస్‌లో ఉంది కాబట్టి.. కచ్చితంగా భారీ విజయం దక్కించుకోవాలి.

మరోవైపు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ ఓడిపోతే ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఎందుకంటే 13 పాయింట్లతో ఉన్న లక్నో జట్టు తదుపరి 2 మ్యాచ్‌ల్లో గెలిస్తే 17 పాయింట్లు వస్తాయి. ఒక మ్యాచ్‌లో ఓడిపోతే 15 పాయింట్లతో 4వ స్థానంలో ఉంటుంది. బెంగళూరు జట్టు తదుపరి 2 మ్యాచ్‌లలో గెలిస్తే 16 పాయింట్లు సాధిస్తుంది. ముంబై ఇండియన్స్(16 పాయింట్లు), పంజాబ్ కింగ్స్(16 పాయింట్లు) కూడా సేమ్ ఉన్నా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా చూసుకుంటే ఆర్సీబీనే ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే.. ఐపీఎల్ లీగ్ దశలో ఆర్సీబీ చివరి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. అసలే రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్న గుజరాత్‌ను ఓడించాలంటే.. ఆర్సీబీకి కత్తి మీద సామే. దీంతో కోహ్లీ భవితవ్యం కాస్తా హార్దిక్ చేతుల్లో ఉందన్న మాటే. బెంగళూరు ఈసారైనా కప్పు గెలుస్తుందో లేక అస్సాం చేస్తుందో చూడాలి.

నిజంనిప్పులాంటిది

May 16 2023, 12:04

ఇంట గెలిచి రచ్చ గెలువు

బీఆర్‌ఎస్‌ జాతీయ దుకాణం కొన్నాళ్లు సైలెంట్‌!

కర్ణాటక దెబ్బతో రాష్ట్ర అధికారపక్షం నేలచూపులు

తెలంగాణలో అదే పరిస్థితి అని సర్వేల్లో వెల్లడి

ఢిల్లీ రాజకీయాలపై దృష్టి తగ్గించాలని నిర్ణయం

మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ డౌటే?

తెలంగాణ అధికారపక్షం బీఆర్‌ఎస్‌ నేల మీదకు దిగొచ్చింది. జాతీయ రాజకీయాల ఆశలను కాసేపు పక్కనబెట్టి ఇల్లు చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకుంది. ఆర్నెల్ల క్రితమే పేరు మార్చుకొని జాతీయ పార్టీగా అవతారమెత్తిన బీఆర్‌ఎస్‌ ఢిల్లీ పీఠమే లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నట్లు ప్రచారం చేసుకుంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడమే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించనున్నట్లు చెప్పుకుంది. ఏపీ, మహారాష్ట్రల్లో పార్టీ శాఖలను తెరవడమే కాకుండా చేరికలను ముమ్మరం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీకీసన్నద్ధమైంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నామమాత్రంగా మారిపోయిందని, బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీన్‌ లేదని లెక్కలు వేసుకొని, ఇల్లు వదిలి రచ్చ గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అంచనాలను కర్ణాటక ఎన్నికలు పటాపంచలు చేశాయి.

డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఉన్నా కర్ణాటకలో అధికారపక్షం బీజేపీ చిత్తయింది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభంజనంలా మారి కాంగ్రెస్‌కు గత 40 ఏళ్లలో రానన్ని సీట్లను సంపాదించి పెట్టింది. వరుస ఓటములతో తిరోగమనంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. కర్ణాటక గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్‌ వాడవాడనా సంబరాలు చేసుకుంది. మారిన పరిస్థితి చూసి బీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో నూ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. సరైన ప్రత్యామ్నాయం ఇస్తామని కాస్తంగా భరోసా ఇచ్చినా కర్ణాటకలాగే ఇక్కడా ప్రతిపక్షానికి ఓట్లు పోటెత్తుతాయని అనుమానం మొదలైంది. కర్ణాటకలో బీజేపీ ప్ర భుత్వ వ్యతిరేకతకు విరుగుడుగా భారీ ఎత్తున కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. అయినా ఫలించలేదు.

ఇక్కడేమో సిటింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని సీఎం కేసీఆర్‌ అంతర్గత సమావేశాల్లో ఇప్పటికే కమిటయ్యారు. దాంతో ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కూడా తుపాను అవుతుందేమోనన్న భయం మొదలైంది. అందుకే, కేసీఆర్‌ ప్రజాదరణ పూర్తిగా కోల్పోయిన పలువురు నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్నా ళ్ల పాటు జాతీయ రాజకీయాల విషయంలో చప్పుడు చేయకుండా ఉండాలని గులాబీ బాస్‌ భావిన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమకు 50% ఓటు బ్యాంకు ఉందని, 60లక్షల సభ్యత్వాలున్న అతిపెద్ద ప్రాంతీయ పార్టీ తమదని, రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారం చేపడతామని బయటకు చెబుతున్నా..లోపల మాత్రం బీఆర్‌ఎస్‌కు గుబులు మొదలైందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.

ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను సరి చేసుకోవడంపై దృష్టి పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఎక్కడైనా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందని, ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి తగ్గించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో విజయంపైనే పూర్తి శక్తి యుక్తులు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చినపుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోనే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో పోటీయే చేయలేదు. అసలా ఊసే ఎత్తలేదు. గత అసెంబ్లీలో 37 సీట్లు గెలుచుకున్న జేడీఎస్‌ ఈసారి 19 సీట్లకే పరిమితమైంది. కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణలో ఉంటుందా అన్న విషయం కన్నా ప్రభుత్వ వ్యతిరేకత అన్న విషయంపైనే కేసీఆర్‌ దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఆయన చే యించుకున్న సొంత సర్వేల్లో తెలంగాణలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత గట్టిగానే ఉన్నట్లు తేలింది. దాన్ని ఎలా అధిగమించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ‘‘ఇక జాతీయ రాజకీయాలు కాదు.. ముందు తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం. తర్వాత.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెడదాం’’ అని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయానికి అనుకూలించిన అంశాలు, అక్కడి ప్రజల్లో అధికార బీజేపీపై వ్యతిరేకతకు కారణాలు, ప్రజల మెప్పు పొందడానికి కాంగ్రెస్‌ అనుసరించిన వ్యూహం వంటిని బీఆర్‌ఎస్‌ విశ్లేషించుకుంటోంది. ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, నియోజకవర్గాల వారీ గా పార్టీ పరిస్థితులు, వాటిని అధిగమించడం కోసం ఏం చేయాలి? వంటి విషయాలపై గులాబీ బాస్‌ దృష్టి సారించారు. బీజేపీ ఓటమి సంతోషం కలిగించినా.... కర్ణాటకలో కాంగ్రెస్‌ ఓట్లశాతం భారీగా పెరగడం, అత్యధిక సీట్లు దక్కించుకోవడం ఆందోళన కలిగిస్తోందని బీఆర్‌ఎస్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

నిజంనిప్పులాంటిది

May 16 2023, 12:02

రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం

రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బుధవారం సమావేశం కానున్నారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

రేపు తెలంగాణ భవన్ లో జరగనున్న ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీగా దేశంలో అనుసరిచాల్సిన విధానాలు, ఈ ఏడాది జరగనున్న ఎన్నికలకు ఏ విధంగా జనం ముందుకు వెళ్లాలన్న దానిపై నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు.

బీజేపీ కక్ష సాధింపులపై...

ప్రధానంగా బీజేపీ కక్ష సాధింపులపై ఏ విధంగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్న దానిపై కూడా కేసీఆర్ చర్చించనున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తదనంతర పరిణామాలపై నేరుగా చర్చించకున్నా ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం సంస్థల నుంచి ఇబ్బందులు ఎదురయితే పార్టీ వారికి అండగా నిలబడుతుందన్న సంకేతాలను ఈ సమావేశం ద్వారా కేసీఆర్ ఇవ్వనున్నారు...

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 16 2023, 12:00

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇదే..? సంచలనంగా కేసీఆర్ పథకాలు!

ఏలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది.

ఎన్నికల హామీలు, వాగ్దానాల అస్త్రాలతో అమ్ముల పొదిని సిద్ధం చేసుకుంటున్న గులాబీ బాస్.. ఏ పథకాలను బయటకు బయటకు తీస్తారు? ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మహిళలు, రైతులే టార్గెట్‌గా పలు పథకాలను అమలు చేసే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తున్నది. వీటికి తోడు ఇప్పటికే అమలవుతున్న స్కీమ్స్‌లోనూ కొన్ని మార్పులు చేయబోతున్నారని టాక్. ఇక దేశం అబ్బురపడే, అడ్డంపడే స్కీం ఒకటి తన దగ్గర ఉందని, అది అమలు చేస్తే ప్రతిపక్షాలు ఆగమవుతాయని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్.. దానిపైనా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇంతకూ ఆ స్కీం ఏంటనేది ఆ పార్టీ నేతలకు సైతం తెలియదు. సరైన టైమ్‌లో దాన్ని బయటకు తీసి విపక్షాలను షాక్‌ ఇవ్వాలని భావిస్తున్నారు కేసీఆర్.

'హ్యాట్రిక్ పక్కా.. బీఆర్ఎస్‌కు 95 సీట్లు గ్యారంటీ.. సౌత్ ఇండియాలో థర్డ్ టైమ్ సీఎంగా కేసీఆర్ రికార్డు ష్యూర్..' ఇలాంటి ఎన్నో కామెంట్స్ మంత్రులు, గులాబీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఆ ఫలితాల కోసమే బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల హామీలు, వాగ్దానాలతో సరికొత్త అస్త్రాల పొదిని సిద్ధం చేసే పని మొదలైంది. ఏ స్కీమ్‌కు ఎలాంటి ఆదరణ ఉంటుందనే చర్చలు షురూ అయ్యాయి. సరైన టైమ్‌లో పథకాలను బయటకు తీసి విపక్షాలకు షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. దేనికెంత వెయిట్ ఉంటుందనే లెక్కలు సైతం ఇంటెలిజెన్స్ వర్గాలు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నాయి. ప్రజల స్పందనను పసిగడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత మదిలో ఉన్న కొన్ని స్కీంలు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం తెలిసింది.

గులాబీ బాస్ మదిలో (సన్నిహితుల సమాచారం మేరకు)

- రైతులకు రూ.2,016 నెలవారీ పింఛన్

- 10-12 ఎకరాలకు రైతుబంధు సీలింగ్

- ఆసరా పింఛనులో (స్త్రీలకు) వెయ్యి పెంపు

- ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు

- మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

- భూముల రిజిస్ట్రేషన్ల ఫీజులో లేడీస్‌కు 1% రాయితీ

- అబ్చురపరిచే పథకం

సరికొత్త సంక్షేమ పథకాలతో పవర్‌లోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు అమలవుతున్న వెల్ఫేర్ స్కీమ్‌లకు కొన్ని మార్పులు చేయడంతో పాటు బలమైన హామీని ఇచ్చి ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలపై చర్చలు జరుగుతున్నాయి. ఏ స్కీమ్‌తో ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ఆరా తీసే పని మొదలుపెట్టాయి. ఆ వర్గాల నుంచి స్పష్టమైన నివేదిక వచ్చిన తర్వాత వీటిపై బీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నది. అబ్బురపడే స్కీమ్‌ను తెస్తానంటూ చాలా ఏండ్లుగా సీఎం కేసీఆర్ ఊరిస్తున్నారు. ఆయన మనసులో ఉన్న ఆ 'అబ్బురపడే' స్కీమ్ ఏంటో పార్టీ నేతలకు కూడా తెలియదు. విపక్షాల చెవిన పడకుండా ఆ స్కీమ్ గోప్యంగానే ఉండిపోయింది. సరైన సమయంలో ప్రకటించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను గుక్క తిప్పుకోకుండా చేయాలన్నదే కేసీఆర్ వ్యూహం. ఈసారి బీఆర్ఎస్‌కు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ముక్కోణపు పోటీ అనివార్యం కావడంతో ఓట్ల చీలికను నివారించడంపైనే ఫోకస్ పెట్టింది. రైతుబంధు, దళితబంధు స్కీమ్‌లతో ఆ సెక్షన్ ఓటర్లకు దగ్గరయ్యామనే భావన ఉన్నప్పటికీ ఈసారి 'విప్లవాత్మకమైన' స్కీమ్‌ను తీసుకురావడంపైనే దృష్టి పెట్టింది. మహిళలే కేంద్రంగా కొన్ని కొత్త స్కీమ్‌లను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే లోపే ఒకటో రెండో స్కీమ్‌లను అమల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్టు సమాచారం. మిగిలినవాటిని మేనిఫెస్టోలో పెట్టాలన్నది ఆ పార్టీ భావిస్తున్నది. గత (2018 డిసెంబరు) అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుబంధు స్కీమ్ అమల్లోకి వచ్చినట్లుగానే ఈసారి 'రైతు పింఛను' పథకం ఉనికిలోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

రైతులకు పింఛను?

సీఎంకు సన్నిహితంగా ఉన్న వర్గాల సమాచారం ప్రకారం.. పట్టాదారు పాస్‌బుక్ ఉన్న రైతులందరికీ ప్రతి నెలా రూ.2,016 పింఛను ఇచ్చే స్కీమ్‌పై స్టడీ మొదలైంది. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే నినాదాన్ని ఖరారు చేసినందున దీని ప్రభావం ఎలా ఉంటుంది? అమలుచేయాల్సి వస్తే తగిన గైడ్‌లైన్స్ ఎలా ఉండాలి? రైతుల ఆదాయం, వారికున్న సాగుభూములే ప్రామాణికంగా ఉండాలా? ప్రభుత్వ ఖజానాపై పడే భారమెంత?.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్కీమ్ ద్వారా లబ్ధిపొందే రైతులెంత మంది ఉంటారు? దీనికి అవసరమైన నిధులను సమకూర్చుకోడానికి ఉన్న మార్గాలేంటి? రైతుబంధు స్కీమ్‌ను 10-12 ఎకరాలకు మాత్రమే పరిమితం చేస్తే సేవ్ అయ్యేదెంత? వంటి అంశాలపై అటు ఇంటెలిజెన్స్ సిబ్బంది, ఇటు ఆర్థిక శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రైతుబంధు కోసం సగటున రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. సుమారు 65 లక్షల మంది రైతులు దీని ద్వారా సాయం అందుకుంటున్నారు. ఇందులో లక్షల మంది మాత్రమే పది ఎకరాలకంటే ఎక్కువ సాగుభూములు ఉన్నారనేది ప్రభుత్వ అంచనా. రైతుబంధు సాయంలో వీరికి కోత పెట్టడం ద్వారా పేద రైతులు సంతృప్త చెందుతారన్నది సర్కారు అభిప్రాయం.

200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు

ఇక గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ సరఫరా చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రమే నెలకు 50 యూనిట్ల వరకు రాయితీ సౌకర్యం లభిస్తున్నది. ఇకపైన దీనిని అన్ని ఇండ్లకూ వర్తింపజేస్తే పడే ప్రభావంపై ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే బీసీ బంధు, గిరిజన బంధు లాంటి స్కీమ్‌లపైనా కేసీఆర్ హామీ ఇచ్చారు.

మహిళలకు సిటీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

హైదరాబాద్ సిటీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విషయాన్ని సైతం చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, చెన్నయ్ నగరాల్లో ఈ స్కీమ్ అమలవుతుండగా మహిళల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వస్తున్నది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై ఈ స్కీమ్ కారణంగా పడే భారమెంతో తెలుసుకోడానికి విశ్లేషణ మొదలైంది. అందులో భాగంగానే డైలీ బస్ పాస్ రేటులో మహిళలకు 20% డిస్కౌంట్ విధానం పైలట్ బేసిస్‌గా అమలవుతున్నది. మహిళా ఓటు బ్యాంకును అనుకూలంగా మల్చుకోడానికి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుందో, ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో అనే లెక్కలు తీసే పని మొదలైంది. మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. మేనిఫెస్టోలో పెట్టేంతవరకూ వెయిట్ చేయకుండా ఎన్నికల షెడ్యూలు వచ్చే లోపే దీనిని అమల్లోకి తీసుకొచ్చే చాన్స్ ఉన్నది.

మహిళలకు పింఛను పెంపు

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, వృద్ధ మహిళలు, బీడీ కార్మికులు.. ఇలాంటి కేటగిరీలలో ప్రతి నెలా పింఛన్‌ రూపంలో రూ.2,016 అందిస్తున్నది. ఇకపైన దీనిని రూ.3,016 కు పెంచడం ద్వారా మహిళలకు ఉపయోగకరంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

భూముల రిజిస్ట్రేషన్లలో రాయితీ

భూముల రిజిస్ట్రేషన్లలో ప్రస్తుతం 7.5% మేర స్టాంపు ఫీజు రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తున్నది. మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగినట్లయితే దానిని 6.5 శాతానికే వర్తింప చేయాలన్నది బీఆర్ఎస్ ఆలోచన. రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించుకోడానికి ఇకపైన చాలా మంది దీన్ని ఒక ఆప్షన్‌గా ఎంచుకునే అవకాశాలున్నట్టు అంచనా. ఒకవైపు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం సీఎం కుమార్తె కవిత డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తరఫున ఒక స్పష్టమైన హామీని ఈ రూపంలో ప్రకటించడం సందర్భోచితంగా ఉంటుందన్నది గులాబీ పార్టీ అభిప్రాయం. ఇప్పటికే ఈ తరహా స్కీమ్ మహారాష్ట్రలో సక్సెస్‌ఫుల్‌గా అమలవుతున్నది. అక్కడి క్షేత్రస్థాయి అనుభవాలను బీఆర్ఎస్‌లో ఇటీవల చేరిన నేతలు సీఎం కేసీఆర్‌కు వివరించారు.

అబ్బురపరిచే స్కీం?

ఎన్నికల సంవత్సరం కావడంతో 'అబ్బురపడే' స్కీమ్‌ను ప్రకటించాలన్నది కేసీఆర్ ఆలోచన. గతేడాది తీసుకొచ్చిన రైతుబంధు అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని సంతృప్తి ఆ పార్టీలో ఉన్నది. ఈసారి కూడా ఇలాంటి 'విప్లవాత్మకమైన', 'అబ్బురపడే' పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నది. లోతైన అధ్యయనం జరిగిన తర్వాత దీనిపై విపక్షాల ఊహకు కూడా అందని తీరులో కేసీఆర్ ప్రకటించే అవకాశమున్నది. బీసీ బంధు, గిరిజనబంధు లాంటివి కూడా చక్కర్లు కొడుతున్నాయి.

నిజంనిప్పులాంటిది

May 16 2023, 11:48

తెలంగాణ వ్యాప్తంగా జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు

▪️తెలంగాణ జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.

▪️పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసిన పౌరసరఫరాల శాఖ.

▪️ఇందుకోసం రెండు కమిటీలను నియమించింది.

▪️కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు కొత్త పేర్లను చేర్చుకునేవారు దీనిని సద్వినియోగం చేసుకోనగలరు.

SB NEWS

SB NEWS

SB NEWS*

నిజంనిప్పులాంటిది

May 15 2023, 17:24

కౌన్ బనేగా కర్ణాటక సీఎం

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ జరిగేదే ఇప్పుడూ జరిగింది. ఆ పార్టీలో సొంత నిర్ణయాలు తీసుకునేందుకు ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు వెనకడుగు వేస్తుంటారు. ప్రతీదీ హైకమాండ్ నిర్ణయించాల్సిందే. ఇప్పుడూ అంతే. కర్ణాటక సీఎం ఎవరన్నది ఎమ్మెల్యేలు తేల్చలేకపోయారు.

నిన్న బెంగళూరులో హడావుడిగా సమావేశమైన కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP).. సీఎం అభ్యర్థిని తేల్చలేకపోయింది. మీరే తేల్చాలని ఏకవాక్య తీర్మానం చేసి... బంతిని హైకమాండ్ కోర్టులోకి నెట్టేసి.. ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. హైకమాండ్ ఎవరిని సెలెక్ట్ చేస్తే వారికే తమ మద్దతు అనేశారు. దాంతో.. ఈ బాధ్యత హైకమాండ్ నెత్తిన పడింది.

కర్ణాటక నెక్ట్స్ సీఎం ఎవరన్న ప్రశ్నకు సింపుల్ సమాధానమే ఉంది. రేసులో ఉన్నది ఇద్దరే. ఒకరు ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య, మరొకరు అపరణ చాణక్యం ప్రదర్శించే KPCC చీఫ్ డీకే శివకుమార్. ఈ ఇద్దరిలో ఒకరిని సీఎం చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ రేసులో కూడా సిద్ధరామయ్యే ముందున్నారు. ఈసారికి ఆయన్ని సీఎం చేసి... శివకుమార్‌ని డిప్యూడీ సీఎం చేస్తారనీ లేదా ఆయనకు కీలక మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. దీనిపై తేల్చేందుకు ఇవాళ ఢిల్లీ రావాలని ఈ ఇద్దరికీ హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది.

సీఎం సీటు పొందేందుకు అటు సిద్ధరామయ్య, ఇటు శివకుమార్ తమదైన ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఇద్దరి ఇళ్ల దగ్గరా కార్యకర్తలు గుమికూడి.. సీఎం అవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా... రెండు బలమైన వర్గాలుగా కార్యకర్తలు విడిపోతున్నట్లు స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం అంతా బాగుందని అంటున్నారు. పార్టీలో ఎలాంటి విబేధాలూ లేవని అంటున్నారు. సిద్ధరామయ్యను సీఎం చేస్తే... డీకేను ఎలా బుజ్జగిస్తారన్నది పెద్ద సమస్యగా ఉంది. ఈ విషయంపై హైకమాండ్... సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ... ఇతర జాతీయ సీనియర్ నేతల సలహాలు తీసుకుంటోంది.

నిజంనిప్పులాంటిది

May 15 2023, 17:05

తెలంగాణకు మరో అంతర్జాతీయ పరిశ్రమ

రాష్ట్రానికి మరో అంతర్జాతీయ పరిశ్రమ తరలివచ్చింది. ఎలక్ర్టానిక్స్‌, సెల్‌ఫోన్‌ తయారీ రంగంలో అతిపెద్ద సంస్థగా పేరొందిన తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ (Foxconn) రాష్ట్రంలో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.

ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఫాక్స్‌కాన్‌ సంస్థ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఫాక్స్‌కాన్‌ సంస్థ ప్రతి నిధులతో కలిసి మంత్రి భూమిపూజ నిర్వహించారు. రూ.1,655 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌ గ్రామంలో ఫాక్స్‌కాన్‌ సంస్థ ఏర్పాటు కానుంది.

ఈ సంస్థ కోసం కొంగరకలాన్‌లో జిల్లా కలక్టరేట్‌ సమీపంలో సర్వే నెంబర్‌ 300లో రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమలో 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

పదేళ్లలో 15 లక్షల ఉద్యోగావకాశాలు: కేటీఆర్

భూమి పూజ అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రకటించారు. ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశామని చెప్పుకొచ్చారు.

మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు రానున్నాయన్నారు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌ లియా పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 15 2023, 15:11

వరంగల్ జిల్లా కమిషనరేట్ లో ఎస్ఐ సస్పెండ్

వరంగల్ జిల్లా:

వ్యవసాయ భూవివాదంలో నిందితుడికి సహకరించినందుకుగాను గతంలో రఘునాథపల్లి ఎస్సైగా పనిచేసిన ఎన్ వీరేందర్ ను గతంలో పోలీస్ కమిషనరేట్ విఆర్ కు బదిలీ చేయడం జరిగింది.

భూ వివాదానికి సంబంధించి అధికారులు నిర్వహించిన విచారణకు ఎస్సై సహకరించకపోవడంతో పాటు ఈ వివాదంలో ఎస్సై నిందితుడికి సహకరించడంతో పాటు సంబంధించిన బాధితుల్ని ఇబ్బందులు గురి చేసినందునట్లు గా విచారణలో నిర్ధారణ కావడంతో ఎస్సై వీరేందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

SB NEWS

SB NEWS

SB NEWS