TSNews

Aug 07 2019, 20:28

గౌడ సంఘ మెదక్ జిల్లా అధ్యక్షులు గా పల్లె రామచందర్ గౌడ్ ఎన్నిక

ఉత్తర్వులు జారీచేసీ ఘనంగా సన్మానించి, సత్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు కేశం నాగరాజు గౌడ్

హర్షం ప్రకటించిన మెదక్ జిల్లా గౌడ సంఘం నాయకులు

రామాయంపేట్, ఆగస్టు, 7

తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యవర్గం బుధవారం హైదరాబాద్ లోని అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామాయంపేట్ పట్టణానికి చెందిన పల్లె రామచందర్ గౌడ్ ను మెదక్ జిల్లా అధ్యక్షులు గా ఎన్నుకొని ప్రమాణస్వీకారం చేయించారు. మెదక్ జిల్లా రామాయంపేట్ పట్టణానికి చెందిన పల్లె రామచందర్ గౌడ్ ను మెదక్ జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవడం పై రామాయంపేట్ గౌడ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ జిల్లా నాయకుడిగా, సర్పంచ్ గా గతంలో మెదక్ జిల్లా అధ్యక్షుడిగా గా ఉన్న అనుభవంతో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు గాని…

TSNews

Aug 07 2019, 14:42

శ్రీశైలం ప్రాజెక్టు అప్ డేట్

  

07-08-2019 02:00 PM

పూర్తిస్థాయి నీటిమట్టం: 269.750M /885ft
పూర్తిస్థాయి నీటిసామర్థ్యం : 215.807 TMC
ప్రస్థుత నీటిమట్టం : 265.650M/ 871.60 ft
ప్రస్థుత నీటినిల్వ : 148.3480 TMC
ఇన్ ఫ్లో
జూరాల నుంచి ప్రస్థుతం వస్తున్న వరద : 2,37,852 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో
a) A.P. PH R/S : 26,866 క్యూసెక్కులు
 b) T.S. PH L/S : 42,378 క్యూసెక్కులు

c) MGKLI.    :  1600 క్యూసెక్కులు

d) Malayal-HNSS:  1013 క్యూసెక్కులు

e) PRP HR.   : 6000 క్యూసెక్కులు

f) M.Marri-KCC :   Nil క్యూసెక్కులు

g) SpillWay   :   Nil క్యూసెక్కులు

Total.      : 77,857 క్యూసెక్కులు

నాగార్జున సాగర్ పైపు నీటి విడుదల : 69,244 క్యూసెక్కులు 

TSNews

Aug 07 2019, 14:17

తెలుగు టీవి నటుడు సీరియల్ నటుడు మధుప్రకాశ్ భార్య భారతి (34) ఆత్మహత్య

హైదరాబాద్:

   తెలుగు టీవి నటుడు సీరియల్ నటుడు మధుప్రకాశ్ భార్య భారతి (34) ఆత్మహత్య చేసుకుంది. గుంటూరుకు చెందిన వీరికి 2015లో వివాహమైంది. మణికొండలోని పంచవటి కాలనీలో నివసిస్తున్నారు. మధుప్రకాశ్ టివి నటుడు కాగా, భారతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. షూటింగులలో బిజీగా ఉంటున్న మధుప్రకాశ్ ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగింది. సోమవారం కూడా ఇదే విషయమై గొడవ మరింత ముదిరింది. మంగళవారం ఉదయం జిమ్‌కు వెళ్తున్నట్టు చెప్పిన మధు అటునుంచి అటే షూటింగ్‌కు వెళ్లిపోయాడు.ఈ క్రమంలో భర్తకు వీడియో కాల్ చేసిన భారతి తాను ఉరివేసుకుంటున్నట్టు చెప్పి బెదిరించింది. మధుప్రకాశ్ దీన్ని తేలిగ్గా తీసుకున్నాడు. షూటింగ్ ముగిశాక సాయంత్రం 7:30 గంటలకు మధు ఇంటికి వెళ్లాడు. బెడ్‌రూముకు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో భార్యను పిలిచాడు. అయినప్పటికీ లోపలి నుంచి స్పందిచ లేదు. తలుపు బద్దలు కొట్టి  చూసే సరికి లోపల ఆమె సీలింగ్ ప్యాన్ కు చీరతో ఉరివేసుకుని చనిపోయింది. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

TSNews

Aug 07 2019, 14:14

త్వరలో భాటియా ను పెళ్లి చేసుకోనున్న నటి తమన్నా

హైదరాబాద్ : 

త్వరలో ప్రముఖ నటి తమన్నా భాటియా పెళ్లి జరగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ కు చెందిన తమన్నా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తమన్నాకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారని టాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమన్నాకు సరైన జోడీని వెతికే పనిలో ఆమె కుటుంబం ఉందని తెలుస్తోంది. తన పెళ్లి వార్తలపై తమన్నా స్పందించారు. తన పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుతం పెళ్లికొడుకును వెతికే ప్రయత్నాలు చేస్తున్నారని తమన్నా స్వయంగా వెల్లడించారు. తన పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులదే తుది నిర్ణయమని ఆమె పేర్కొన్నారు. తమన్నా ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని, డేటింగ్ కూడా చేస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలను తమన్నా ఖండించారు. తాను ఎవరితో ప్రేమలో లేనని ఆమె తేల్చి చెప్పారు.

TSNews

Aug 07 2019, 13:45

రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌
 వాతావరణ కేంద్రం

   రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించినట్టు పేర్కొంది. 

వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

TSNews

Aug 07 2019, 13:17

సుష్మాస్వరాజ్ మరణం పట్ల దారుణ వ్యాఖ్యలు చేసిన ఓ పాకిస్థాన్ నెటిజెన్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్


హైదరాబాద్: 

    భారత మాజీ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ మరణం పట్ల దారుణ వ్యాఖ్యలు చేసిన ఓ పాకిస్థాన్ నెటిజెన్ కు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సుష్మ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కెటిఆర్ ట్వీట్ చేశారు. గతంలో ఆమెను కలసినప్పటి ఫొటోలను ఆయన ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు స్పందించిన ఓ పాకిస్థానీ నెటిజెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే ఆమె చనిపోయారని, ఆమె కోసం నరకం ఎదురు చూస్తోందని ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కెటిఆర్ ఫైర్ అయ్యారు. సుష్మాస్వరాజ్ మృతిపై నెటిజన్ షోయబ్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కెటిఆర్ అన్నారు. మీ వక్ర బుద్ధికి ఈ కామెంట్ అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ప్రొఫైల్ పిక్ చూస్తుంటే, మీరు పాకిస్థాన్ కు చెందినవారిలా ఉన్నారని చెప్పారు. జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించడానికి మీరు కొంత ధైర్యాన్ని సంపాదించుకోగలని కెటిఆర్ ట్వీట్ చేశారు.

TSNews

Aug 07 2019, 13:07

MLA వనమా వెంకటేశ్వరరావు ను కలిసిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

   ఈరోజు ఉదయం శ్రీ వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గారి నివాసం నందు నూతనంగా ఎన్నికైన జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య దంపతులు వనమా వెంకటేశ్వరరావు ఆశీర్వాదం తీసుకున్నారు.

TSNews

Aug 07 2019, 11:38

కిన్నెరసాని జలాశయానికి జల కళ...  - దిగువ ప్రాంత ప్రజలు అప్రమతంగా ఉండాలని హెచ్చరికలు జారీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

పూర్తిస్థాయి టీఎంసీ. :  8.4

పూర్తిస్థాయి నీటిమట్టం: 407 అడుగులు

ప్రస్తుత  టీఎంసీ.   : 6.975

ప్రస్తుత నీటిమట్టం   : 4.1.90అడుగులు

ఔట్ ఫ్లో.          : 15000 క్యూసెక్కులు

ఇన్ ఫ్లో.          :23000
క్యూసెక్కులు

ఒక గెట్ ఎత్తి 15000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు
దిగువ ప్రాంత ప్రజలు అప్రమతంగా ఉండాలని హెచ్చరికలు జారీ

TSNews

Aug 07 2019, 11:34

జూరాల వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం....

గంట గంటకు పెడుతున్న వరద ఉధృతి...

జూరాల ప్రాజెక్టు అధికారులకు సెలవులు రద్దు...
 అప్రమత్తమయ్యిన స్థానిక పోలీసులు

ప్రమాద కర స్థాయి లో వరద నీరు..
4 లక్షల క్కుసెక్కుల వరద నీరు వస్తుందని అధికారుల అంచనా..

నది తీరప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

జూరాల వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు...*

 మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు 28 గేట్స్ వెత్తివేత
 ఇన్ ఫ్లో : 3.06.000 క్యూసెక్కులు. 
ఔట్ ఫ్లో : 2.99.207 క్యూసెక్కులు
ప్రస్తుతం నీట్టి .నిల్వ : 7.334
పూర్తిస్థాయి నీట్టి నిల్వ : 9.657 TMC
  ప్రస్తుత  నీట్టి మట్టం :   317.33
పూర్తిస్థాయి నీట్టి మట్టం: 318.516

 జూరాల జలవిద్యుత్ కేంద్రలలో 11 యూనిట్లలో435 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి.

TSNews

Aug 07 2019, 11:20

మహిళలు నాటు వేస్తుండగా ఒక్కసారిగా పొంగిన వాగు..
 
ములుగు:

   మహిళలు నాటు వేస్తుండగా ఒక్కసారిగా వాగు పొంగడంతో 45 మంది నాలుగు గంటల పాటు తీవ్ర అవస్థలు పడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో ముసలమ్మ వాగు అవతలనున్న పొలాల్లో 45 మంది మహిళా కూలీలు నాటు వేయడానికి వెళ్లారు. కాసేపటికే వాగు పొంగడంతో నాలుగు గంటల పాటు మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో గ్రామస్తులంతా తాళ్ల సాయంతో మహిళలను ఒడ్డుకు చేర్చారు.
 
మరోవైపు ములుగు జిల్లా ఏటూరునాగారం సబ్ డివిజన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సమ్మక్క-సారలమ్మ మండలం మేడారంలో జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.