అఖిల భారత 10వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి.
బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మేమెంతో మాకాంతా వాటా దక్కాలని, దేశవ్యాప్తంగా తక్షణమే బిసి కులగణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన గోవా రాష్టంలోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన అఖిల భారత 10వ జాతీయ ఓబిసి మహాసభను విజయవంతం చేయాలని బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దీనికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు బీసీ యువజన సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకు నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో జాతీయ ఓబీసీ 10వ మహాసభ గోడపత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారికి పంపించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ బీసీలపై సానుకూల దృక్పథం తో నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కేంద్రప్రభుత్వం బీసీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందిన తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టి 9 వ షెడ్యుల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా దేశ జనాభాలో 60 శాతంకు పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేకపోవడంతో విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం దక్కక శాసించే స్థాయిలో ఉన్న బీసీలు యాచించే స్థాయికి దిగజారారన్నారు. తక్షణమే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి బీసీల జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్ధిక రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, బీసీ యువజన సంఘం నాయకులు జిల్లేపల్లి సాయి, చింతకాయల మురళి, వినయ్, చైతన్య, బి.రాజు, అనిల్ కుమార్, కె. సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
10 hours ago