ఘనంగా గుర్రంపోడు జడ్పీహెచ్ఎస్ 2007-08 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుర్రంపోడు
ఘనంగా గుర్రంపోడు జడ్పీహెచ్ఎస్ 2007-08 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుర్రంపోడు:ఏప్రిల్ :

గుర్రంపోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-08 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన అలనాటి గురువులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు.అనంతరం పూర్వ విద్యార్థులు వారి బాల్య స్మృతులను నెమరు వేసుకొని ఒకరి గురించి ఒకరు పరస్పరం వివరాలు తెలుసుకొని ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా గడిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు లింగారెడ్డి,రాములు,జయప్రకాశ్ రెడ్డి,కౌసల్య,కవిత,విజయ, ఝాన్సీ,పూర్వ విద్యార్థులు గంగిరెడ్డి కరుణాకర్ రెడ్డి,వడ్డెగోని సైదులు గౌడ్,అమరేందర్,రవీంద్రా చారి,సురేష్,శివశంకర్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Jul 20 2025, 09:32