ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి! భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి!

భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 08-05-2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

భారత ఆర్మీకి ఎలాంటి ఆపద సంభవించద్దని ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పైన విజయం సాధించాలని భారత ప్రజలు సుభిక్షంగా ఉండాలని శేరిపల్లి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని గురుస్వామి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు గురువారం రోజు హనుమాన్ స్వాములతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సేరిపెల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భారత ఆర్మీ కోసం భారత ప్రజల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయి భారత్ పైన దాడులకు పాల్పడుతూ భారత అమాయక ప్రజలను పొట్టని పెట్టుకుంటూ భారత ఆర్మీ పై దొంగ చాటున దాడులు చేస్తూ వస్తున్నారని మొన్నటికి మొన్న పైల్గంలో అమాయక ప్రజలైన 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని మరి దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టి ఆర్మీ విజయం సాధించిందని మునుముందు భారత ఆర్మీ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని విజయ సాధనలో భారత ఆర్మీకి ఎలాంటి హాని జరగకూడదని భారత ఆర్మీకి ఆంజనేయ స్వామితో పాటుగా దేవుని అందరూ అండగా ఉండి భారత ఆర్మీ ని భారత ప్రజలను రక్షించాలని అదేవిధంగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన భారత ప్రజలు ఆర్మీ జవాన్లు మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా ఆయన అన్నారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్న హనుమాన్ భక్తులుగా భారతదేశ పౌరులుగా స్వాగతిస్తూ మద్దతునిస్తామని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా హనుమాన్ భక్తులుగా యుద్ధంలో సైతం పాల్గొనడానికి సిద్ధమని అన్నారు జైశ్రీరామ్ ఇట్టి కార్యక్రమంలో దయ్యాల పవన్ కనుగుల శ్రీనివాస్ మోహన్ నాగరాజు రాకేష్ పంతులు చంద్రారెడ్డి మరియు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.

పెద్దమ్మ దేవాలయం చిన్నకోడూర్

పెద్దమ్మ దేవాలయం చిన్నకోడూర్

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా లోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం శ్రీ పెద్దమ్మ దేవస్థానం ఇక్కడ అమ్మవారు కొలిచిన భక్తులకు కొంగుబంగారమై తలిసేటి భక్తులకు తల మీద గొడుగై కోరిన వరాలు ఇచ్చే పెద్దమ్మ తల్లిగా విరాజిల్లుతుంది ఇక్కడ పెద్దమ్మకు ముదిరాజులు పూజలు నిర్వహిస్తా ఉంటారు ఈ దేవాలయం ఆదిమానవ కాలమునాటిదని ఈ యొక్క దేవాలయం సిద్ధిరవాస్తులో ఉంటే ముదిరాజ్ సంఘం వారు 2000 సంవత్సరంలో పునర్నిర్మాణం చేసి దేవాలయం నిర్మించారు గత ప్రాచీన కాలం నుండే పెద్దమ్మ అమ్మవారికి ముదిరాజులు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో చివరి శుక్రవారం రోజు ముదిరాజ్ ప్రతి ఇంటి నుండి ఆడపడుచులు మంగళహారతులు తీసుకువచ్చి పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు అదేవిధంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి డిసెంబర్ నెలలో పెద్దమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తారు ఇట్టి జాతరకు తెలంగాణలోని హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ నిజాంబాద్ కామారెడ్డి సిరిసిల్ల వేములవాడ హుస్నాబాద్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ జాతరకు వస్తారు ఈ యొక్క పెద్దమ్మ దేవస్థానం పెద్దమనుషులు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటారు ఈ యొక్క సంఘానికి పెద్దమనుషులుగా జంగిటి సాయిలు ఇట్టబోయిన బుడాల మల్లయ్య చింతకింది మల్లయ్య పెద్ద మల్లయ్య చెరుకు చిన్న మల్లయ్య జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ చెరుకు పెద్దలు కోరబోయిన అంజయ్య కోరబోయిన బాలరాజ్ కోరబోయిన పెద్ద శ్రీనివాస్ జంగిటి శ్రీశైలం ఆనందం కోరబోయిన ప్రసాద్ పరకపెల్లి మల్లయ్య పరకపెల్లి కనకయ్య పరగపెల్లి వరదయ్య కొత్త పర్షియ్య చెరుకు శ్రీకాంత్ కొత్త బాలరాజ్ ఉప్పర బోయిన శంకర్ చింతకింది ప్రభాకర్ చెరుకు బిక్షపతి చింతకింది నరసింహారావు చెరుకు నరేష్ దొంతరబోయిన బాలమల్లు దొంతరబోయిన ఎల్లయ్య దొంతుర బోయిన రామస్వామి దొంతరబోయిన శ్రీనివాస్ దొంతరబోయిన చిన్న మల్లేశం కుందేళ్ళ చంద్రయ్య కుందేళ్ళ దశరథం దయ్యాల రామస్వామి పోయిల బాలరాజేశం పోయిల వెంకయ్య ఇట్టబోయిన బాలపోషయ ఇట్టబోయిన చిన్న పోచయ్య రాగిరి కనకయ్య అక్కెనపల్లి అంజయ్య పర్కపల్లి కనకయ్య పర్కపల్లి మల్లయ్య తదితరులు పెద్దమనుషులుగా ఉన్నారు

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ! రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ!

రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు!

కెసిఆర్ సభ విజయవంతం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ రెడ్డి వాయిదా వేసిన వేయవచ్చు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 28-04-2025 సోమవారం

చిన్నకోడూర్

కెసిఆర్ బయటకు వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బిజెపి నాయకులకు అర్థమైందని దెబ్బకు జరుపుకున్నారని కెసిఆర్ అంటే పేరు కాదని ఒక బ్రాండ్ అని తెలువక నిన్నటి వరకు చౌకబారు విమర్శలు చేశారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు వరంగల్ సభ జరగకుండా అడ్డుకోవాలని రేవంత్ ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టించి సభకు వచ్చే ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని అయినా కూడా జనాలు విరవకుండా భయపడకుండా వరంగల్ సభకు తరలివచ్చి మహాసముద్రాన్ని తలపించేలా మహా కుంభమేళను తలపించేలా దిక్కులు పీక్కటిల్లెల జనహూరు సాగిందని ఇది చూసిన రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిందని దీనితో స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయిన ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదని ఈ సభతో ప్రతిపక్షాలకు రేపటి రోజులు బిఆర్ఎస్వేనని అర్థమై ఉంటుందని ఆయన అన్నారు ఇకనైనా తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతిపిత కేసిఆర్ పై విమర్శలు మానుకొని ఉన్నన్ని రోజులు పాలనపై దృష్టి పెట్టాలని లేకుంటే ప్రజలు తగిన రీతిలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని జంగిటి అన్నారు.

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్న గ్రామస్థులపైన చర్య తీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్ను గ్రామస్తులపైన చర్య తీసుకోవాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

తేది: 10-04-2025 గురువారం

సిద్ధిపేట కలెక్టరేట్ న్యూస్

సిద్దిపేట జిల్లా బొంపల్లి అక్బర్పేట్ మండల్ ఖాజీపూర్ గ్రామ ముదిరాజ్ మత్స్యకారుల పైన గ్రామస్తులు వీడిసి పేరుతో గత 30 సంవత్సరాలుగా దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులపైన అధికారులు చర్య తీసుకోవాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.

ఖాజీపూర్ కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ముదిరాజ్ మత్స్యకారులను గ్రామ బహిష్కరణకు గురి చేస్తూ చేపలు పట్టుకోకుండా దౌర్జన్యం చేస్తూ 30 సంవత్సరాలుగా గ్రామస్తులు చేపల ఆదాయాన్ని గడిస్తున్నారని ముదిరాజులు మత్స్యకారులు తక్కువ సంఖ్యలో ఉన్నందున ఆ యొక్క గ్రామస్తులు ప్రభుత్వ చట్టాలను చేతిలోకి తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులవృత్తులను తుంగలో తొక్కి ఒక సామాజిక వర్గం పైనే ఒక కుల వృత్తి పైననే దౌర్జన్యంగా డబ్బులు గ్రామస్తులు దండుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని దీనిపైన ఉన్నదా అధికారులు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఖాజీపూర్ ముదిరాజులకు మత్స్య శాఖలో సొసైటీ ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇచ్చినప్పటికీ గ్రామస్తులు సుప్రీమ్ గా భావిస్తూ ఇంతటి దారుణానికి ఒడి కట్టడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు నిర్ణయాలు తీసుకొని చట్టాలను సైతం లెక్కచేయకుండా అక్కడి ముదిరాజ్ మచ్చకారులను గ్రామ బహిష్కరణకు గురిచేసి గ్రామంలో ఎవరు కూడా మాట్లాడకుండా చేయడము బెదిరింపులకు పాల్పడడం ప్రాణనాష్టం కల్పిస్తామని చెప్పడము స్వతంత్ర భారతదేశంలో ఇది కరెక్ట్ కాదని తక్షణమే కలెక్టర్ గారు ముదిరాజ్ మత్స్యకారులకు చేపలు పట్టుకొనుటకు అనుమతులు ఇస్తూ ముదిరాజ్ మత్స్యకారులకు రక్షణ ఇవ్వాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర కమిటీల ద్వారా కోరుతున్నామని అలా జరగనియెడల జిల్లాలో మొత్తం 370 సొసైటీలు 30 వేల మత్స్యకారులు ఉన్నారని అందరినీ ఏకం చేసి చలో కాజీపూర్ చేపట్టి అక్కడి చెరువుకుంటలో ఉన్న చేపలను పట్టి అక్కడి ముదిరాజ్ మత్స్యకారులకు ఇచ్చి అండగా నిలుస్తామని ఆయన అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో మత్య్సశాఖ జిల్లా డైరెక్టర్ ఆకారం సతయ్య, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు అరిగే కృష్ణ, కొంతం శ్రవణ్, యాట రాజేష్, గుడిపల్లి వికాస్, కోరబోయిన సుధాకర్, దూలం ముత్యం, గణేష్, రమేష్, నరేశ్, రమేష్, స్వామి తదితర ముదిరాజులు ఉన్నారు.

ముదిరాజ్ జాతిపట్ల వివక్ష చూపుతున్న సి.యం రేవంత్ రెడ్డి! డి.ఎల్ పాండు ముదిరాజ్

ముదిరాజ్ జాతిపట్ల వివక్ష చూపుతున్న రేవంత్ రెడ్డి

మేనిఫెస్టో హామీని అటకెక్కించ్చిన రేవంత్ రెడ్డి

డిఎల్ పాండు ముదిరాజ్ సుప్రీంకోర్టు అడ్వకేట్

*చిన్నకోడూరు, ఏప్రిల్ 04, 2025

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముదిరాజులపైన వివక్ష కొనసాగుతుందని సుప్రీంకోర్టు అడ్వకేట్ డిఎల్ పాండు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ముస్తాబాద్ లో జరిగే ముదిరాజ్ సమావేశానికి వెళ్తున్న డిఎల్ పాండును సిద్దిపేట ముదిరాజులు కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, యూత్ అధ్యక్షులుపడిగె ప్రశాంత్, జిల్లా నాయకులు వెంకటేశం, పొన్నాల శ్రీనివాస్ లతో కలిసి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా ముదిరాజులకు ప్రత్యేక హామీ ఇస్తూ ముదిరాజులను బిసి'డి' నుండి బీసీ'ఏ' లోకి మారుస్తామని వారి యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచి తీరా బాధ్యతలు చేపట్టినాక ముదిరాజుల అంశం మరిచిపోయి ముదిరాజుల ఊసే ఎత్తడం లేదని, ఇవాళ ముదిరాజులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, గత ప్రభుత్వంలో కనీసం మత్స్యకారులను ఆదుకోవడానికి ఉచిత చేప పిల్లలు సబ్సిడీ ఇచ్చారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అది కూడా మర్చిపోయాడని, పేరుకే కార్పొరేషన్ ప్రకటించి నేటికి కూడా ఒక రూపాయి కేటాయించలేదని, మొన్న బడ్జెట్లో కూడా మత్స్యవృత్తికి ప్రాధాన్యత లేదని, అందుకనే ముదిరాజు మత్స్యకారులు న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇకనైనా ముదిరాజుల పట్ల ఆలోచన చేసి ముదిరాజులను బిసి'ఏ'లోకి చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ పాండు ముదిరాజ్ తో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, మాజీ సర్పంచ్ లు మేడికాయల వెంకటేశం, పొన్నాల శ్రీనివాస్, బరిగెల సాయి తదితరులు ఉన్నారు.

ముదిరాజులకు అడుగడుగునా అన్యాయమే! మత్స్యకారులను విస్మరించి సరిపడ బడ్జెట్ కేటాయించని రేవంత్ రెడ్డి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజులకు అడుగడుగునా అన్యాయమే!

మత్స్యకారులను విస్మరించి సరిపడ బడ్జెట్ కేటాయించని రేవంత్ రెడ్డి!

ముదిరాజులను బిసి ఏలో చేర్చడం ఏమైంది రేవంత్ రెడ్డి?

మత్స్య శాఖకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులను విస్మరించడమేనని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మత్స్యకారులకు సరైన బడ్జెట్ కేటాయించకపోవడంతో శుక్రవారం నాడు పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో ముదిరాజులు ప్రభుత్వంపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రేవంత్ రెడ్డి ముదిరాజులను చిన్నచూపు చూస్తున్నాడని బీసీ డీ నుండి బీసీ ఏ లోకి మారుస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడిచిన నేటికి హామీ నెరవేర్చలేదని అది పోగా నేటి బడ్జెట్లో సరైన బడ్జెట్ కేటాయించకపోవడం మత్స్యకారుల పైన రేవంత్ రెడ్డికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని గత ప్రభుత్వం మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల్ని ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ యొక్క పథకాన్ని తీసేసి ముదిరాజులకు అన్యాయం చేసిందని ముదిరాజులు కేవలం ఓట్లు వేయడానికే పనికి వస్తారా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా హామీ నెరవేర్చకుంటే మీకు నీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ముదిరాజులు కనపడలేదా అని ఆగస్టు 15 లోపు ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానన్న హామీ ఏమైంది అని రేవంత్ రెడ్డి నీ మాటలు అన్నీ గాలి మాటలేనా అని ఆయన అన్నారు ఇట్టి కార్యక్రమంలో మేడికాయల వెంకటేశం, తోట్ల పరిసరాములు, పడిగే ప్రశాంత్ ఇట్టబోయిన శ్రీనివాస్, పెండెల బాలయ్య, టైగర్ సత్తి, శిలాపురం రాజు, సోషల్ మీడియా కన్వీనర్ సుతారి రాజు, యాట రాజేష్, సిద్ధరబోయిన శ్రీనివాస్, నాగరాజు, కొంతం శ్రావణ్, పడిగె లింగం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు శాపంగా మారిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

రైతులకు శాపంగా మారిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం!

రైతుల నుండి పొద్దు తిరుగుడు పంట పూర్తిగా ప్రభుత్వ కొనుగోలు చేయాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ 

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

తెలంగాణ రైతుల పాలిట రేవంత్ రెడ్డి శాపంగా మారాడని గద్దెనెక్కి అనేక ఆంక్షలు విధిస్తున్నాడని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

బుధవారం రోజు మండల కేంద్రంలోని సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో కలిసి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులను నమ్మబలికిన రేవంత్ రెడ్డి ఈనాడు రైతులకు శాపంగా మారారని రైతులు పండించిన పొద్దు తిరుగుడు ఎత్తులను ఎకరాకు 6 కింటలు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పంతో మాజీమంత్రి హరీష్ రావు గారు వ్యాయాప్రయాసాలకోర్చి రెయిన్బోలు కష్టించి తెలంగాణ రైతుల కుటుంబాలలో సంతోషాన్ని చూడాలని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్ళు అందిస్తే ఇప్పుడిప్పుడే రైతులు పంటలు సమృద్ధిగా పండిస్తూ ఉన్న అప్పులను తీర్చాలని చూస్తాన్న సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంక్షలు విధించి పొద్దుతిరుగుడు పంటను ఆరు కింటలు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆంక్షలు పెట్టడం ఇది రైతుల నడ్డి విరవడమేనని ఆయన మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే రైతులు పండించిన పూర్తి పోద్దు తిరుగు పంటను కొనుగోలు చేయకుంటే మాజీమంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో రైతులందరి పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో రైతులు రెడ్డి రాజిరెడ్డి, ఏదుల చంద్రారెడ్డి, రెడ్డి మహేందర్ రెడ్డి, యాట రాజేష్, మల్లయ్య, బాలరాజ్, రమేష్ తదిత రైతులు ఉన్నారు.

ముదిరాజులకు మొండి చేయి చూపుతున్న రేవంత్ రెడ్డి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజులకు మొండి చెయ్యి చూపుతున్న రేవంత్ రెడ్డి!

ముదిరాజులను బి.సి "డి" నుండి బీ.సీ "ఏ" మార్పు ఏమైంది రేవంత్ రెడ్డి!

ఎమ్మెల్సీ స్థానాలకు ముదిరాజులు కనపడలేదా రేవంత్ రెడ్డి?

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

తేది: 10-03-2025 సోమవారం

చిన్నకోడూర్ న్యూస్

తరాలు మారిన ముదిరాజుల తల రాతలు మారడం లేదని అనేక ప్రభుత్వాలు అయినా ఏ ఒక్క ప్రభుత్వం కూడా ముదిరాజులకు లాభం చేయలేదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

సోమవారం చిన్నకోడూరులో ప్రెస్ నోట్ విడుదల చేసి మాట్లాడుతూ ముదిరాజుల పట్ల రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపి ముదిరాజులను బిసి డి నుండి బిసి ఏలోకి మారుస్తానని పీసీసీ అధ్యక్షునిగా మేనిఫెస్టోలో మా అంశాన్ని పొందుపరిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ముదిరాజులను రేవంత్ రెడ్డి పూర్తిగా విస్మరించాడని ఇచ్చిన హామీని తుంగలో తొక్కడమే కాకుండా రాజకీయ పదవులలో కూడా ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలలో ఒక్కటి కూడా ముదిరాజులకు కేటాయించకపోవడం బాధాకరమని ముదిరాజులను ఓటు బ్యాంకుగా వాడుకొని నిర్ధాక్షణంగా రేవంత్ రెడ్డి ముంచుతున్నాడని కనీసం చెరువులలో చేప పిల్లలు కూడా పోయలేదని నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైనట్టు వ్యవహారం ఉందా అని ఆయన అన్నారు ఇప్పటికైనా ముదిరాలను బీసీ డీ నుండి బీసీ ఏలోకి మార్చకుంటే రాజకీయ పదవులలో స్థానం కల్పించకుంటే రేవంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటిస్తామని ఆయన అన్నారు.