ముదిరాజ్ జాతిపట్ల వివక్ష చూపుతున్న సి.యం రేవంత్ రెడ్డి! డి.ఎల్ పాండు ముదిరాజ్
ముదిరాజ్ జాతిపట్ల వివక్ష చూపుతున్న రేవంత్ రెడ్డి
మేనిఫెస్టో హామీని అటకెక్కించ్చిన రేవంత్ రెడ్డి
డిఎల్ పాండు ముదిరాజ్ సుప్రీంకోర్టు అడ్వకేట్
*చిన్నకోడూరు, ఏప్రిల్ 04, 2025
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముదిరాజులపైన వివక్ష కొనసాగుతుందని సుప్రీంకోర్టు అడ్వకేట్ డిఎల్ పాండు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ముస్తాబాద్ లో జరిగే ముదిరాజ్ సమావేశానికి వెళ్తున్న డిఎల్ పాండును సిద్దిపేట ముదిరాజులు కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, యూత్ అధ్యక్షులుపడిగె ప్రశాంత్, జిల్లా నాయకులు వెంకటేశం, పొన్నాల శ్రీనివాస్ లతో కలిసి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా ముదిరాజులకు ప్రత్యేక హామీ ఇస్తూ ముదిరాజులను బిసి'డి' నుండి బీసీ'ఏ' లోకి మారుస్తామని వారి యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచి తీరా బాధ్యతలు చేపట్టినాక ముదిరాజుల అంశం మరిచిపోయి ముదిరాజుల ఊసే ఎత్తడం లేదని, ఇవాళ ముదిరాజులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, గత ప్రభుత్వంలో కనీసం మత్స్యకారులను ఆదుకోవడానికి ఉచిత చేప పిల్లలు సబ్సిడీ ఇచ్చారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అది కూడా మర్చిపోయాడని, పేరుకే కార్పొరేషన్ ప్రకటించి నేటికి కూడా ఒక రూపాయి కేటాయించలేదని, మొన్న బడ్జెట్లో కూడా మత్స్యవృత్తికి ప్రాధాన్యత లేదని, అందుకనే ముదిరాజు మత్స్యకారులు న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇకనైనా ముదిరాజుల పట్ల ఆలోచన చేసి ముదిరాజులను బిసి'ఏ'లోకి చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ పాండు ముదిరాజ్ తో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, మాజీ సర్పంచ్ లు మేడికాయల వెంకటేశం, పొన్నాల శ్రీనివాస్, బరిగెల సాయి తదితరులు ఉన్నారు.
Apr 10 2025, 14:58