ముదిరాజులకు అడుగడుగునా అన్యాయమే! మత్స్యకారులను విస్మరించి సరిపడ బడ్జెట్ కేటాయించని రేవంత్ రెడ్డి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజులకు అడుగడుగునా అన్యాయమే!
మత్స్యకారులను విస్మరించి సరిపడ బడ్జెట్ కేటాయించని రేవంత్ రెడ్డి!
ముదిరాజులను బిసి ఏలో చేర్చడం ఏమైంది రేవంత్ రెడ్డి?
మత్స్య శాఖకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులను విస్మరించడమేనని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
మత్స్యకారులకు సరైన బడ్జెట్ కేటాయించకపోవడంతో శుక్రవారం నాడు పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో ముదిరాజులు ప్రభుత్వంపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రేవంత్ రెడ్డి ముదిరాజులను చిన్నచూపు చూస్తున్నాడని బీసీ డీ నుండి బీసీ ఏ లోకి మారుస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడిచిన నేటికి హామీ నెరవేర్చలేదని అది పోగా నేటి బడ్జెట్లో సరైన బడ్జెట్ కేటాయించకపోవడం మత్స్యకారుల పైన రేవంత్ రెడ్డికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని గత ప్రభుత్వం మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల్ని ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ యొక్క పథకాన్ని తీసేసి ముదిరాజులకు అన్యాయం చేసిందని ముదిరాజులు కేవలం ఓట్లు వేయడానికే పనికి వస్తారా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా హామీ నెరవేర్చకుంటే మీకు నీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ముదిరాజులు కనపడలేదా అని ఆగస్టు 15 లోపు ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానన్న హామీ ఏమైంది అని రేవంత్ రెడ్డి నీ మాటలు అన్నీ గాలి మాటలేనా అని ఆయన అన్నారు ఇట్టి కార్యక్రమంలో మేడికాయల వెంకటేశం, తోట్ల పరిసరాములు, పడిగే ప్రశాంత్ ఇట్టబోయిన శ్రీనివాస్, పెండెల బాలయ్య, టైగర్ సత్తి, శిలాపురం రాజు, సోషల్ మీడియా కన్వీనర్ సుతారి రాజు, యాట రాజేష్, సిద్ధరబోయిన శ్రీనివాస్, నాగరాజు, కొంతం శ్రావణ్, పడిగె లింగం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Apr 04 2025, 20:59