తగుళ్ల సర్వయ ఆధ్వర్యంలో నూతనఎమ్మెల్సీ నెల్లికల్లి సత్యానికి ఘన సన్మానం
గుర్రంపోడు మండల కేంద్రం లో గురువారం సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు, శంకరాచారి నివాసంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నూతనంగా ఎన్నిక కావడంతో గుర్రంపూడు మండల కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ ఆహ్వానం మేరకు గుర్రంపొడు మండలానికి విచ్చేసిన సందర్భంగా , గుర్రంపొడు మండల సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ను శాలువాతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలం,చిన్న పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో పుట్టి సిపిఐ పార్టీ కోసం తన వంతుకష్టపడి కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటూ, మునుగోడు నియోజకవర్గంలో అందరి మన్ననలు పొంది ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల మునుగోడు నియోజకవర్గ సిపిఐ పార్టీ నాయకులకుకార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి ఎమ్మెల్సీ ఆకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నల్లగొండ జిల్లా మంత్రి కోమరెడ్డి వెంకట్ రెడ్డికి మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. మునుగోడు నియోజకవర్గ నికి చెందిన యాదవ సామాజిక వర్గం బీసీ బిడ్డ నెల్లికంటి సత్యం కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల గుర్రంపొడు మండల బీసీ నాయకులు సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసిహర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు తగుల్ల సర్వయ్య, సిపిఐ మండల కార్యదర్శి రేపాక లక్ష్మీపతి, ఎస్.కె మదర్, ఉజ్జుని రామచంద్రరావు, రామగిరి చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకులు జాల చిన్న సత్తయ్య యాదవ్, తగుల యాదయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మేడి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Mar 21 2025, 06:41