ఆరు గ్యారంటీల అమలుతో ప్రతిపక్షాల బేజారు*
తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు
యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొత్త నాగరాజు
*గుర్రంపోడు*:ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని, తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డిపై బిఆరెస్ నాయకులు
వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని యువజన కాంగ్రెస్ గుర్రంపోడు మండల అధ్యక్షులు కొత్త నాగరాజు అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే,ప్రతిపక్షంగా బిఆరెస్ పార్టీ నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి సీఎం రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు పాల్పడడం దురదృష్టకరమని అన్నారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అహంకారంతో దళితుడైన స్పీకర్ ని అవమానిస్తూ మాట్లాడి, ఇప్పటివరకు క్షమాపణలు చెప్పకపోవడం దారుణమన్నారు. తప్పు చేసిన జగదీష్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు సస్పెండ్ చేస్తే కార్యకర్తలతో ధర్నాలు చేయించడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.
Mar 17 2025, 14:08