ముదిరాజులకు మొండి చేయి చూపుతున్న రేవంత్ రెడ్డి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజులకు మొండి చెయ్యి చూపుతున్న రేవంత్ రెడ్డి!
ముదిరాజులను బి.సి "డి" నుండి బీ.సీ "ఏ" మార్పు ఏమైంది రేవంత్ రెడ్డి!
ఎమ్మెల్సీ స్థానాలకు ముదిరాజులు కనపడలేదా రేవంత్ రెడ్డి?
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు
తేది: 10-03-2025 సోమవారం
చిన్నకోడూర్ న్యూస్
తరాలు మారిన ముదిరాజుల తల రాతలు మారడం లేదని అనేక ప్రభుత్వాలు అయినా ఏ ఒక్క ప్రభుత్వం కూడా ముదిరాజులకు లాభం చేయలేదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
సోమవారం చిన్నకోడూరులో ప్రెస్ నోట్ విడుదల చేసి మాట్లాడుతూ ముదిరాజుల పట్ల రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపి ముదిరాజులను బిసి డి నుండి బిసి ఏలోకి మారుస్తానని పీసీసీ అధ్యక్షునిగా మేనిఫెస్టోలో మా అంశాన్ని పొందుపరిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ముదిరాజులను రేవంత్ రెడ్డి పూర్తిగా విస్మరించాడని ఇచ్చిన హామీని తుంగలో తొక్కడమే కాకుండా రాజకీయ పదవులలో కూడా ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలలో ఒక్కటి కూడా ముదిరాజులకు కేటాయించకపోవడం బాధాకరమని ముదిరాజులను ఓటు బ్యాంకుగా వాడుకొని నిర్ధాక్షణంగా రేవంత్ రెడ్డి ముంచుతున్నాడని కనీసం చెరువులలో చేప పిల్లలు కూడా పోయలేదని నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైనట్టు వ్యవహారం ఉందా అని ఆయన అన్నారు ఇప్పటికైనా ముదిరాలను బీసీ డీ నుండి బీసీ ఏలోకి మార్చకుంటే రాజకీయ పదవులలో స్థానం కల్పించకుంటే రేవంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటిస్తామని ఆయన అన్నారు.
Mar 10 2025, 20:02