ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చికిత్స పొందుతున్న బాలుని కుటుంబ సభ్యులకు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆర్థిక సహాయం
నల్లగొండ పట్టణంలో 18 వ వార్డులో శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న కందగట్ల కృష్ణ - గీతా దంపతుల కుమారుడు 11 సంవత్సరాల నవదీప్ జనవరి 17 శుక్రవారం రోజున బిల్డింగ్ పై పతంగి ఎగరవేస్తున్న సమయంలో వారి ఇంటి పక్కన ఉన్న కరెంటు తీగలకు పతంగి చిక్కడంతో పతంగిని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి 60% అబ్బాయి కాలిపోవడం జరిగింది. వెంటనే నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అబ్బాయికి సీరియస్ గా ఉందని హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ కి పంపించారు. బాబు తల్లిదండ్రులు గాంధీ హాస్పిటల్ నుండి మెరుగైన వైద్యం కోసం కె.పి.హెచ్.బి. గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేయిస్తున్నారు.
బాబును ఆ పరిస్థితుల్లో చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై బాధపడుతున్నారని తెలుసుకున్న అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు నల్లగొండ నుండి కె.పి.హెచ్.బి. గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్ కి చేరుకొని శోకసంద్రంలో ఉన్న నవదీప్ తల్లిదండ్రులను కలిసి బాబు పరిస్థితి గురించి తెలుసుకొని ధైర్యాన్నిచ్చి వారికి కొంత ఆర్థిక సహాయం చేశారు.
నవదీప్ తల్లిదండ్రులు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ బాబు త్వరగా కోలుకొని ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అలాగే బాబు కుటుంబ సభ్యులు చాలా బీదరికంలో ఉన్నారని ఇంకా ఎవరైనా దాతలు పెద్ద మనసు చేసుకొని ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి కుటుంబ సభ్యులకు అందజేస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సురకారపు యాదగిరి గౌడ్, కంచర్ల రఘురామ్ రెడ్డి, పాలకూరి నర్సింహ గౌడ్, దోనాల లింగారెడ్డి, కట్టెబోయిన సంజీవ యాదవ్, అయితరాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Mar 01 2025, 19:26